- జీవో లేకుండానే టూరిజం సెక్యూరిటీ అవుట్ పోస్టులు పెట్టించారు
- డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని షణ్ముఖ పవన్ కన్నీరు
- నిధులు విడుదల చేయించుకుని మళ్లించుకుని మెక్కేశారు
- జగన్, రోజా, తానేటి వనిత, మాజీ డీజీపీపై బాధితుడి ఫిర్యాదు
- తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకువచ్చారని ఆవేదన
- నిధులు ఎక్కడకు వెళ్లాయి? వరు తిన్నారో తేల్చాలని వినతి
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ నేతల ఎదుట గోడు
మంగళగిరి(చైతన్యరథం): జగన్‌రెడ్డి అండ్ కో భారీ మోసం మరొకటి బయటకు వచ్చింది. వైసీపీ నేతల మోసానికి ఆత్మహత్య చేసుకోబోయి న్యాయం కోసం తిరుగుతున్న విశాఖ వాసి ప్రిజమ్స్ సిరీయస్ అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన షణ్ముఖ పవన్ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల కార్యక్రమంలో మంత్రి కొం డపల్లి శ్రీనివాస్, బొల్లినేని రామారావు, నరసింహ ప్రసాద్‌ల ఎదుట గోడు వెళ్లబోసు కున్నారు. పోలీసుల ఒత్తిడితో ఎలాంటి ఒప్పందం లేకుండానే తాను టూరిజం పోలీస్ సెక్యూరిటీ పోస్టులను ఏర్పాటు చేశానని చెప్పారు. దానికి రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్లకు తీసుకున్న మెటీరియల్‌తో కలిపి 1.80 కోట్ల వరకు ఖర్చు అయినట్టు తెలిపారు. 2023 ఫిబ్రవరి 14న ఆన్‌లైన్‌లో బటన్ నొక్కి ప్రస్తుత అప్పటి ముఖ్యమంత్రి జగన్, హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిలు ఆ సెక్యూరిటీ పోస్టులను ప్రా రంభించారని వివరించారు. ఈ పోస్టుల నిర్వహణకు రూ.200 కోట్లు విడుదల చేయగా తాను ఏర్పాటు చేసిన పోస్టులకు మాత్రం డబ్బులు ఇవ్వలేదని వాపోయారు. డబ్బుల కోసం వెళ్లి అడగ్గా అసలు ఆ పోలీసు సెక్యూరిటీ పోస్టుల ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం ఎటువంటి జీవో విడుదల చేయలేదని తేలిందని వివరించారు. అవుట్ పోస్టుల వద్ద డిజిటల్ బోర్టులు ఏర్పాటు చేసుకుని ప్రకటనలపై వచ్చే ఆదాయం తీసుకోవాలని చెప్పి దాన్ని అడ్డుకున్నారని తాను పూర్తిగా మోసపోయానని జరిగిన మోసాన్ని వివరించాడు. తనకు న్యాయం చేయాలని మంత్రి ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు. బాధితుడి నుంచి ఫిర్యాదును స్వీకరించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
జగన్‌రెడ్డి బాడీగార్డ్ పొలాన్ని లాక్కున్నాడు
` మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బాడీగార్డుగా పనిచేస్తున్న నేలపూడి సురేష్ తన పొలాన్ని లాక్కున్నాడని ఏలూరు జిల్లా కలిదిండి మండలం సంతోషపురం పంచాయతీ నరసింహపురం గ్రామానికి చెందిన అంకాలభోగేశ్వరరావు ఫిర్యాదు చేశాడు. 2022లో సురేష్ తాను జగన్ సెక్యూరిటీనని చెప్పి తనపై దౌర్జన్యం చేసి పోలీసుస్టేషన్‌లో పెట్టిస్తానని బెదిరించి ఖాళీ స్టాంప్ కాగితాలపై సంతకాలు చేయించుకెళ్లాడని వాపోయా డు. దయ చేసి తమ భూమి తమకు ఇప్పించాలని వేడుకున్నాడు.
` అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం మజరా బొంతలవారిపల్లికి చెందిన బొంత నరసింహారెడ్డి సమస్యను వివరిస్తూ రీ సర్వే పేరుతో తమ పేర్ల మీద ఉన్న భూములను మండల తహసీల్దారు అక్రమంగా మరొకరి పేరు మీదకు మార్చారని వాపోయాడు. తహసీల్దారును ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించి తమ భూమి తమకు ఇప్పించా లని వేడుకున్నాడు.
200 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా
` నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్తవాడ పంచాయతీ వడ్డిపాళెం గ్రామానికి చెందిన విరిగినేని మహేశ్వరరావు తమ గ్రామంలో వైసీపీ నాయకుడు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి జామాయిల్ సాగుచేస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. అతడు వెంగమాంబ దేవస్థానం ట్రస్టీగా ఉండి అవినీతి చేయడంతో తొలగించారని వివరిం చాడు. అతని చెర నుంచి ప్రభుత్వ భూమిని విడిపించాలని మహేశ్వరరావుతో పాటు గ్రామస్తులు కోరారు.
` అప్పులు తెచ్చి ఇచ్చిన సరుకులకు సంబంధించి తమకు రావాల్సిన డబ్బులను అడుగుతుంటే సజ్జల రామకృష్ణారెడ్డి తన బంధువు అని చెబుతూ తమపై అక్రమ కేసులు పెట్టించి తమను చంపాలని కొల్లు నరసింహారెడ్డి చూస్తున్నాడని తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని నెల్లూరు టౌన్‌కు చెందిన ఇరగల శ్రీనివాసరెడ్డి వాపోయాడు.
` శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం టి.సదుగాం గ్రామానికి చెందిన చలపతి తన భూమి 2.14 సెంట్లను గ్రామానికి చెందిన గౌడ చెరువు రమణారెడ్డి ఆక్రమించా డని ఫిర్యాదు చేశారు. తన కుటుంబానికి ఆ భూమే ఆధారమని.. తమ భూమి కబ్జా నుంచి విడిపించి న్యాయం చేయాలని వేడుకున్నాడు.
తన భూమిని మరొకరి పేరుపై మార్చారు
` అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం శోత్రియం జగడంవారిపల్లి గ్రామంలో తన భూమిని తహసీల్దారు, మండల సర్వేయర్ మరొకరి పేరుపైకి మార్చారని బొంతల వారిపల్లికి చెందిన గూడె పాపిరెడ్డి ఫిర్యాదు చేశాడు.
` పల్నాడు జిల్లా మాచర్ల మండలం రాయవరం గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల ఆంజనేయులు సమస్యను వివరిస్తూ సర్వే నెంబర్ 6.43లో ఉన్న 7.49 ఎకరాల దేవా దాయశాఖ భూమిని తనకు లీజుకు ఇవ్వాలని 2019లో అర్జీ పెట్టుకుని మాచర్ల ఈఓ కృష్ణమూర్తికి రూ.40 వేలు చెల్లించినట్టు తెలిపాడు. అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి చెందిన వైసీపీ నేత తురక కిషోర్ టీడీపీ వాళ్లకు ఎటువంటి పొలం ఇచ్చేది లేదని బెదిరించాడని, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఫిర్యాదు చేశా డు. తనకు తిరిగి ఆ పొలం లీజుకు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నాడు.
అధికారుల అండతో భూమి కబ్జా
` రాజకీయ నాయకుల అండతో లంచం తీసుకుని డిప్యూటీ తహసీల్దారు, మండల సర్వేయర్, ఇన్‌చార్జ్ తహసీల్దార్లు అక్రమార్కులతో కుమ్మక్కై తమ భూమిని కొట్టేశారని, రికార్డులను పరిశీలించి కబ్జాదారులకు సహకరించిన అధికారులను శిక్షించి తమకు న్యాయం చేయాలని పెద్ద తిప్పసముద్రం మండలానికి చెందిన గుడె శివరామరెడ్డి, గుడె మంజునాథ్ రెడ్డిలు వేడుకున్నారు.
` అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం లేవాకువారుపల్లెలో ఉన్న తమ పొలంలో వైసీపీ నేతలు మట్టిని తవ్వేశారని..అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తమకు న్యాయం చేయాలని నాగినేని వెంకటసుబ్బయ్యనాయుడు వేడుకున్నాడు.
` నెల్లూరు జిల్లా కొండాపురం మండలం మర్రికుంట గ్రామానికి చెందిన మాల్యాద్రి సమస్యను వివరిస్తూ ఏఎస్‌పేట మండలం శిరమన గ్రామంలో 2 ఎకరాల 37 సెంట్లు దాడిశెట్టి వెంకటేశ్వర్లు, తాను జాయింట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని వివరించాడు. అయితే ప్రస్తుతం తన భాగాన్ని కూడా దాడిశెట్టి వెంకటేశ్వర్లు తన కొడుకుల పేర్లపై ఆన్ లైన్‌లో ఎక్కించాడని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు.
అంగన్‌వాడీ పోస్టుకు ఎంపికైన మహిళపై వైసీపీ నేత దాడి
` ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఇంటర్యూలో తన విద్యార్హత, కుల రిజర్వేషన్ ప్రాతిపదికన తనకు అంగన్‌వాడీ టీచర్ పోస్టు ఇచ్చారని, అంగన్‌వాడీ కేంద్రానికి వెళితే వైసీపీ నాయకుడు తమ్మినేని ఆదిరెడ్డి జుట్టుపట్టుకుని కొట్టి అంగన్‌వాడీ కార్యాలయం 20 రోజులు మూయించాడని పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం కనుమల చెరువు గ్రామా నికి చెందిన కేతావతు కుమారిబాయి ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన భార్యకు అంగన్‌వాడీ పోస్టును వచ్చేలా చేసుకున్నాడని, అతనిపై చర్యలు తీసుకుని అంగన్‌వాడీ పోస్టును ఇప్పించాలని వేడుకుంది.
` ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్న వెలగచెర్ల గ్రామానికి చెందిన అనుగోలు దామోదర్ ప్రభుత్వ భూములను అక్రమంగా ఆయన భార్య పేరుపై ఎక్కించుకోవ డమే కాకుండా తాను సాగుచేసుకుంటున్న భూమిని కబ్జా చేయాలని చూస్తున్నాడని అన్నమ య్య జిల్లా పెనగలూరు మండలానికి చెందిన కొప్పుల వెంకటరమణ ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా చంపుతానని బెదిరిస్తున్నాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
` దళితుల అభివృద్ధికి 1987లో ప్రభుత్వం ఇచ్చిన భూములు నేటికీ తమ పేర్లపై ఆన్ లైన్ కాలేదని దాంతో ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు అందడంలేదని రాజంపేట మండలం ఆకేపాడు గ్రామానికి చెందిన పలువురు విజ్ఞప్తి చేశారు. పట్టాదారుల భూముల వివరాలు ఆన్‌లైన్‌లో ఎక్కించి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు మంజూరు చేయాలని కోరారు.
` గత ప్రభుత్వంలో తమకు అన్యాయంగా పింఛన్లు తొలగించారంటూ పలువురు గ్రీవెన్స్‌కు పోటెత్తారు. వారిలో వృద్ధులు, వికలాంగులు అధికంగా ఉన్నారు. తమకు పింఛన్ లు ఇచ్చి ఆదుకోవాలని వేడుకున్నారు.