విశాఖ (చైతన్యరథం): రుషికొండ బీచ్‌కు బ్లూఫాగ్ గుర్తింపును పునరుద్ధరించారు. ఈ మేరకు గుర్తింపు పత్రాన్ని బ్లూ ఫాగ్ సంస్థ ప్రతినిధులు విశాఖ జిల్లా కలెక్టర్‌కు శనివారం అందించారు. రాష్ట్రంలో బ్లూఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్‌గా విశాఖలోని రుషికొండకు పేరుంది. అంతటి ప్రాధాన్యమున్న గుర్తింపు గతంలో తాత్కాలికంగా రద్దయింది. బీచ్ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూఫ్లాగ్ బీచ్‌గా 2020లో ధ్రువీకరించారు. ఈ గుర్తింపును డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (ఎస్‌ఈఈ) సంస్థ అందిస్తుంది. కొంతకాలంగా బీచ్‌లోకి శునకాలు రావడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం. వ్యర్థాలు పేరుకుపోవడం, నడక మార్గాలు దెబ్బతినడం వంటివి చోటుచేసుకున్నాయి. మూత్రశాలలు, దుస్తులు మార్చుకునే గదులు సరిగా లేవు. నిర్వహణ అధ్వాన్నంగా ఉన్న చిత్రాలతో కొందరు డెన్మార్క్ సంస్థకు ఫిర్యాదు చేయటంతో బ్లూ ఫాగ్ గుర్తింపు రద్దు చేశారు.
బ్లూఫాగ్ గుర్తింపు రద్దు కావడంతో రుషికొండ బీచ్ పరిశుభ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. బ్లూఫాగ్ హోదా కొనసాగేలా చర్యలు తీసుకుంది. బీచ్‌పై అభ్యంతరాలు వచ్చిన అంశాలపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బీచ్ వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. బీచ్ పరిశుభ్రతపై పర్యటకులకు అవగాహన కల్పించే దిశగా చర్యలు. తీసుకోవాలని సూచించింది. బీచ్‌కు బ్లూఫాగ్ గుర్తింపు రద్దుకు బాధ్యులుగా పలువురు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు సైతం వేసింది. పర్యటక శాఖ తీసుకున్న అనేక చర్యల కారణంగా రుషికొండ బీచ్‌కు తిరిగి బ్లూఫాగ్ గుర్తింపు మళ్లీ లభించింది.