- ఓటే మన బలమైన ఆయుధం
- ఎన్నికల సమయంలో యువత చురుకైన పాత్ర పోషించాలి
- సాలూరు ప్రజలకు భువనమ్మ పిలుపు
సాలూరు, చైతన్యరథం: త్వరలో రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో తిరుగులేని పోరాటానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, యువత సిద్ధంగా ఉండాలని చంద్ర బాబు సతీమణి భువనమ్మ పిలుపునిచ్చారు. అన్నివర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఎన్నికల కురుక్షేత్రంలో ఓటును ఆయుధం గా వాడాలని భువనమ్మ కోరారు. ప్రజా వ్యతిరేక ప్రభు త్వం ఎన్నికల సమయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరూ వెనకడుగు వేయకూడదని, చేయి చేయి కలుపు కుంటూ ముందుకే దూకాలని, ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో తెలుగుదేశంపార్టీ విజయం సాధించేందుకు కృషి చేయాలని ఆమె కోరారు.
దీనికి మీరంతా సయ్యా? అని కోరిన భువనమ్మకు సాలూరు ప్రజలు, కార్యకర్తలు అమ్మా… మేము సై… అని పెద్దఎత్తున నినదించారు. భువనమ్మ సాలూరు ప్రజలతో మాట్లాడుతూ… వైసీపీ పాలనలో తెలుగుదేశంపార్టీ బిడ్డలను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారని, గత నాలుగున్నరేళ్లుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు.
ప్రభుత్వ అవినీతి, అక్రమాలను నిలదీస్తున్నారనే కోపంతోనే చంద్రబాబు ను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారన్నారు. ఆ సమయంలో రోడ్లమీదకు వచ్చి పోరాడిన మహిళల ను కూడా అక్రమంగా అరెస్టుచేసి స్టేషన్లలో రాత్రి పూట నిర్బంధించారని చెప్పారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం వచ్చింద న్నారు. ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగిం చుకుని ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు.
చంద్రబాబు పాలనను స్వాగతించాలని, చంద్రబాబు పాలన వస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని, రాష్ట్ర యువత భవిష్యత్తుకు గ్యారెంటీ ఉంటుందని అన్నారు. పోలింగ్ సమయంలో అధికారపార్టీ ఎన్ని కుట్రలు పన్నినా వాటిని ఎక్కడికక్కడ ఛేదిస్తూ, యువత ముందుకే వెళ్లాలన్నారు. పోలింగ్ ప్రశాంతంగా, పార దర్శకంగా జరిగేలా చూసుకోవాలి…అని భువనమ్మ కోరారు.