- నీవా బ్రాంచ్ కెనాల్ పనులకు శంకుస్థాపన
- నారావారిపల్లెలో స్కిల్ కేంద్రం, అభివృద్ధి పనులు
- పండుగ వేళ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
చిత్తూరు(చైతన్యరథం): సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు నారావారిపల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమైన ప్రాజెక్టులకు ప్రారంభించడం తో పాటు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారు. ముందుగా ప్రజారోగ్య ప్రాజెక్టు సంజీవనిని చిత్తూరు జిల్లాకు విస్తరిస్తూ డిజినెర్వ్ సెంటర్ సేవలను ప్రారం భించారు. గత ఏడాది కుప్పంలో పైలెట్గా ప్రారంభిం చిన డిజి నెర్వ్ సెంటర్ డిజిటల్ హెల్త్ రికార్డుల సేవలను చిత్తూరు జిల్లాకు కూడా విస్తరించారు. తదుపరి దశలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది, ఇందులో భాగంగా మంగళవారం నారా వారిపల్లెలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సంజీవని ప్రాజెక్టును విస్తరించేలా డిజినెర్వ్ సెంటర్ సేవలను ప్రారంభిం చారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం కుటుంబ సభ్యులతో సహా నారావారిపల్లెకు వెళ్లిన సీఎం మంగళవారం స్వగ్రామంతో పాటు తిరుపతిలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
నారావారిపల్లెలో రూ.4.27కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే స్వగ్రామంలో యువత నైపుణ్యాలు పెంచేలా రూ.1.4 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, రూ.77 లక్షలతో ఎ.రంగంపేట – భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకూ నిర్మించిన నూతన రహదారిని సీఎం ప్రారంభించారు. అనంతరం 30 పడకల నుంచి 50 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ప్రారంభించారు. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో రూ.45 లక్షలతో నిర్మించిన పేషెంట్ అటెండెంట్ అమినిటీస్ కాంప్లెక్సును ప్రారంభించారు. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో రూ.7.5 కోట్లతో నిర్మించిన యూత్ హాస్టల్, రూ.5 కోట్లతో నిర్మించిన మహిళా హాస్టల్కు ప్రారంభోత్సవం చేశారు.
నీటి తరలింపు ప్రాజెక్టుకు శంకుస్థాపన
నారావారిపల్లె సమీపంలో రూ.126 కోట్లతో నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్కు, మూలపల్లి చెరువు సహామరో 4చెరువులకు నీటినితరలించే పను లకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.10లక్షల వ్యయంతో చేపట్టనున్న పశువుల వసతి నిర్మాణానికి కూడా శంకుస్థాపన నిర్వహించారు. ఎస్వీ యూనివర్సిటీలో పరిశోధనఆవిష్కరణలకు ఊతం ఇచ్చేలా రూ.6కోట్లతో కేంద్రీకృత పరిశోధనా ల్యాబ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.5.03 కోట్లతో అకడమిక్ బిల్డింగ్ 2వ అంతస్తు నిర్మాణానికి, రూ.2.91 కోట్లతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ సహా ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.















