అమరావతి: సమాజ హితం, రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని ప్రజలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ శుక్రవారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మనిషి మనుగడకు మూలం, ప్రగతికి సంకేతం సూర్యభగవానుడు. అటువంటి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నాం. ఇది కేవలం ప్రకృతిలో జరిగే మార్పు మాత్రమే కాదు. మన జీవితంలో కూడా ప్రగతితో కూడిన మార్పు రావాలనే సందేశాన్ని సంక్రాంతి పండుగ ఇస్తుంది.
రాష్ట్రంలో గత 5 ఏళ్ల విధ్వంస పాలనతో ప్రతి ఒక్కరి జీవితం చీకటి మయం అయ్యింది. ఆరు గాలం శ్రమించి రైతులు పండిరచిన పంటలకు మద్దతు ధరల్లేవు. నిత్యావసర వస్తువుల ధరలు పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీశాయి. ఉపాధి, ఉద్యోగాలు లేని కుటుం బాలు, అస్తవ్యస్తమైన రోడ్లు, భయపెడుతున్న ఆర్టీసీ చార్జీలు గ్రామాల్లో పండుగ శోభను దెబ్బతీశాయి. నేడు ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా పండుగ జరుపుకోలేని దుస్థితిలోకి ప్రభుత్వం ప్రజలను నెట్టి వేసింది. ప్రతి పేద కుటుంబం పండగలను ఆనం దోత్సాహాలతో జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో నాటి తెలుగుదేశం హయాంలో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ కానుకలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వాటిని కూడా రద్దు చేసి పండుగ సంతోషాలను ప్రజలకు దూరం చేసింది.
ప్రభుత్వ విధ్వంసకర, విద్వేష విధానాలతో ఉపాధి కూడా దొరక్క యువత రోడ్డున పడిరది. మహిళలకు రక్షణలేకుండా పోయింది.బడుగు బల హీనవర్గాల సంక్షేమాన్ని అటకెక్కించారు. ఈ చీక ట్లు పోయేలా, ఈ సంక్రాంతి నుంచి కొత్త కాంత్రి ప్రజల జీవితాల్లో వచ్చేలా మన అడుగులు పడాల ని ఆకాంక్షిస్తున్నా. బంధువులు,మిత్రులు, కుటుంబ సభ్యులు అంతా కలుసుకునే సంక్రాంతి పండుగ సమయం కొత్త మార్పుకు బాటలు వేయాలి.
సమాజ హితం, రాష్ట్ర ప్రగతి గురించి ఆలో చించి సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని కోరు తున్నా. 5ఏళ్ల రాతి యుగపాలనకు ముగింపు పలు కుతూ… స్వర్ణయుగానికి నాంది పలికేలా ప్రజలం తా సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని ఆకాంక్షిస్తు న్నా. మీ, మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అడుగులు వేసేందుకు ఇది సరైన సమయం. రండి! కదలి రండి! రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మేము చేసే పోరాటంలో భాగస్వాములవ్వండి. చేయి చేయి కలిపి స్వర్ణయుగం వైపు పయనిద్దా మని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. తెలుగు ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.