• వినుకొండ నియోజకవర్గం సత్యనారాయణపురం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• గ్రామంలో స్మశానవాటిక లేక అంత్యక్రియలు చెరువుల, పొలాల్లో చేయాల్సి వస్తోంది.
• గ్రామంలోని మురుగునీటి కాల్వలు లేవు. వర్షాకాలం వస్తే దోమలబెడద తట్టుకోలేకపోతున్నా.
• పొలాలకు వెళ్లేందుకు దారి లేక రైతులు, కూలీలు ఇబ్బంది పడుతున్నారు.
• గ్రామంలో శుభకార్యాలు జరుపుకోవడానికి కమ్యూనిటీ హాలు నిర్మించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• వైసిపి నాయకులకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజాససమస్యలపై శ్రద్ధలేదు.
• జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామాలను పూర్తిగా గాలికొదిలేశారు.
• పంచాయతీలకు చెందిన కేంద్రం విడుదల చేసిన రూ.9 వేల కోట్లు వైసిపి ప్రభుత్వం దొంగిలించింది.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామసీమల అభివృద్ధికి పెద్దపీట వేస్తాం.
• రోడ్లు, డ్రైనేజి, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తాం.
• సత్యనారాయణపురంలో స్మశానవాటికకు స్థలం కేటాయిస్తాం.
• పొలాలకు వెళ్లే పుంతరోడ్ల నిర్మాణం చేపట్టి రైతుల ఇబ్బందులను తొలగిస్తాం.