చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

సాయం అతడే..సమరం అతడే!!

కూటమి గెలుపులో వన్‌ అండ్‌ ఓన్లీ.. లోకేష్‌

by చైతన్యరధం
Jun 10, 2024 at 6:33am
in ముఖ్య వార్తలు
nara lokesh

nara lokesh meets darsi TDP Leaders

Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అడిగిందే తడవుగా ఆపన్నులకు చేయూత
  • కష్టంలోవున్న క్యాడర్‌ను కాపాడుకున్న యువనేత
  • కూటమి గెలుపులో వన్‌ అండ్‌ ఓన్లీ.. లోకేష్‌

అమరావతి (చైతన్య రథం): నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ నేనున్నానని భరోసా కల్పించడంలో యువనేత నారా లోకేష్‌ కృతకృత్యులయ్యారు. భరోసా అన్నది కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపించి సిసలైన ప్రజానాయకుడయ్యారు. ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా.. మంగళగిరి నియోజకవర్గంలో సొంత నిధులతో 29 సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసి పేద ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచారు. యువగళం పాదయాత్రలో తమవద్దకు వచ్చి కష్టాలు చెప్పుకున్న ఆపన్నులకు తనవంతు సాయం అందించి అండగా నిలచారు. 3132 కి.మీ.ల సుదీర్ఘ పాదయాత్రలో ఎంతోమందికి పార్టీపరంగా, వ్యక్తిగతంగా సాయమందించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో మునిరాజప్ప అనే రజక మహిళ యువనేతను కలిసి తమ కష్టాలు చెప్పుకుంది. లోకేష్‌ను కలిసి సమస్యలు చెప్పిందన్న అక్కసుతో అక్కడి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి 2023 ఫిబ్రవరి 27న ఆమె టిఫిన్‌ బడ్డీని ధ్వంసంచేశారు.

వైసీపీ కార్యాలయానికి వచ్చి తన కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబితే వదిలేస్తామన్నారు. నేను చనిపోవడానికైనా సిద్ధమే.. క్షమాపణ చెప్పనని తెగేసి చెప్పిందామె. తర్వాత మునిరాజమ్మ లోకేష్‌ వద్దకు వచ్చి జరిగింది చెప్పడంతో ఆయన వెనువెంటనే స్పందించారు. మునిరాజమ్మ కొత్తషాపు ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక సాయమందించారు. ధర్మవరంలో పాదయాత్ర సందర్భంగా చేనేతలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో రాములమ్మ అనే మహిళ అప్పుల బాధతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, బిడ్డలకు చదువు చెప్పించలేకపోతున్నానని కన్నీరుమున్నీరైంది. దీంతో చలించిపోయిన లోకేష్‌… ఆమె ఇద్దరి బిడ్డల చదువు బాధ్యత తాను తీసుకుంటానని చెప్పి, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ స్కూలులో చేర్పించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా రైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో దళిత మహిళా రైతు రంగమ్మ తన బాధను వెల్లబోసుకుంది. 12 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేయడం వల్ల రూ.30 లక్షల అప్పుకావడంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. అక్కడికక్కడే రంగమ్మకు రూ.లక్ష సాయాన్ని ప్రకటించారు లోకేష్‌. పాదయాత్ర ఆ నియోజకవర్గం దాటక ముందే 2023 ఏప్రిల్‌ 30న ఎమ్మిగనూరు సభలో సంబంధిత చెక్కును రంగమ్మకు అందించారు. దారిపొడవునా ఇలా ఎంతోమందికి యువనేత సాయమందించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను వెనువెంటనే చేయూతనందించే ఈ గుణం, సమస్యలపై వెనువెంటనే స్పందించే తీరు లోకేష్‌ మాటపై ప్రజల్లో అపారమైన నమ్మకాన్ని కలిగించింది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

రూ.119 కోట్లతో టీసీసీ!

అన్నదాతకు కూటమి భరోసా!

కుటుంబసభ్యుడి మాదిరిగా కష్టాల ఏకరువు
పాదయాత్ర సమయంలో కుటుంబసభ్యుడి మాదిరిగా వివిధవర్గాల ప్రజలు యువనేతను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. కమ్యూనిటీ సమస్యలతోపాటు వ్యక్తిగత సమస్యలను సైతం యువనేతకు చెప్పి స్వాంతన పొందారు. పలమనేరులో వైసీపీ నేత సునీల్‌ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న చదువుల తల్లి మిస్బా తల్లిదండ్రులు నసీమా, వజీర్‌ అహ్మద్‌ పుంగనూరు నియోజకవర్గం కల్లూరువద్ద పాదయాత్ర సమయంలో లోకేష్‌ను కలిశారు. లోకేష్‌ను కలిస్తే ఊళ్లో ఉండనివ్వం, ఇతర రాష్ట్రాలకు వెళ్లి బతకాల్సిందేనని వైసీపీ నేతలు బెదిరించినా లెక్క చేయకుండా మిస్బా తల్లిదండ్రులు యువనేత వద్దకు వచ్చారు. వైసీపీ నాయకుడు సునీల్‌ కుమార్తెకి సెకండ్‌ ర్యాంక్‌ వచ్చిందని ప్రిన్సిపల్‌పై ఒత్తిడి చేసి తమ కుమార్తెకు టీసీ ఇచ్చి బయటకి పంపేశారని, ఆ అవమానాన్ని భరించలేక మా కుమార్తె ఆత్మహత్య చేసుకుందని కన్నీరు మున్నీరయ్యారు. మిస్బాకు సంబంధించిన మార్కుల లిస్టులు, డ్రాయింగ్‌ పుస్తకాలు, వివిధ పోటీల్లో మిస్బా సాధించిన విజయాలకు సంబంధించిన సర్టిఫికెట్లు తెచ్చి చూపించినపుడు యువనేత చలించిపోయారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక మీకు న్యాయం చేస్తామని, మిస్బాను పొట్టనబెట్టుకున్న వారిని కటకటాల వెనక్కి పంపుతామని ధైర్యం చెప్పారు.

2023 జూలై 7న ఒంగోలులో జరిగిన జయహో బీసీ సదస్సులో వైసీపీ ముష్కరుల చేతిలో బలైన రేపల్లెకు చెందిన అమర్నాథ్‌ గౌడ్‌ అక్క హేమశ్రీ, లోకేష్‌ను కలిసి తమ ఆవేదనను చెప్పుకుంది. నన్ను ఏడాదిన్నరగా వైసీపీ కీచకులు ఏడిపిస్తుంటే, నా తమ్ముడు ప్రశ్నించినందుకు పెట్రోల్‌ పోసి తగులబెట్టేశారు. తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని సృష్టించారు. కేసు కూడా సరిగా నమోదు చేయలేదు, బీసీలు ఏమీ చేయలేరు, ప్రశ్నించలేరనే ఈవిధమైన అకృత్యాలకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంలో లోకేష్‌ స్పందిస్తూ… ఇలాంటి మరో చెల్లికి, అక్కకి జరగకుండా చూసే బాధ్యతను ఈ లోకేష్‌ తీసుకుంటాడు. అధికారంలోకి వచ్చాక అమర్నాథ్‌ గౌడ్‌ హత్య వెనుక ఎంతటి వాడు ఉన్నాసరే తీసుకొచ్చి జైల్లో పడేస్తాం. అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో బీసీ రక్షణ చట్టం తెస్తామని ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఈ హామీని మ్యానిఫెస్టోలో పొందుపర్చారు. ఆయావర్గాలకు యువనేత కల్పించిన భరోసాతోనే ఎన్నికల్లో ఓట్లవర్షం కురిపించింది.

యువనేత బలం, బలగం టిడిపి కార్యకర్తలే
సుదీర్ఘ పాదయాత్ర చేసినా, రాష్ట్రవ్యాప్తంగా శంఖారావం వంటి కార్యక్రమాలతో సుడిగాలి పర్యటన చేసినా తనకోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలే యువనేత లోకేష్‌ బలం, బలగం. యువగళం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన 400మంది వాలంటీర్లు క్రమశిక్షణగల సైనికుల్లా పనిచేశారు. యువగళం పాదయాత్రను ఏవిధంగానైనా భగ్నం చేయాలని వైసీపీ తొత్తులుగా మారిన పోలీసులు ఒకవైపు, వైసీపీ ముష్కరమూకలు మరోవైపు ఎంత రెచ్చగొట్టినా వాలంటీర్లు ఎంతో ఓర్పుతో సేవలందించారు. అదేవిధంగా తమను నమ్ముకున్న కార్యకర్తలకు యువనేత లోకేష్‌ కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఒకవైపు పాదయాత్ర చేస్తూనే క్షేత్రస్థాయిలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్యాడర్‌కు యువనేత అండగా నిలిచారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం మినగల్లు గ్రామానికి చెందిన సీనియర్‌ టీడీపీ కార్యకర్త చిట్టిబోయిన పెద్ద వెంగయ్యని వైసీపీ నేతలు అత్యంత దారుణంగా హతమార్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా అనంతసాగరంలో నిర్వహించిన బహిరంగసభలో మృతుడు భార్య ధనలక్ష్మమ్మకి 16-6-2023న రూ.5లక్షలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. గూడూరు నియోజకవర్గం చిట్టమూరులో వెంకటరమణ అనే కార్యకర్త కుటుంబసభ్యులు యువనేత నారా లోకేష్‌ను కలిశారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మృతుడి భార్య నాగమణి ఆవేదన వ్యక్తం చేయడంతో కార్యకర్తల సంక్షేమ నిధినుంచి సాయం అందించారు. ఇలా దేశంలో మరెక్కడా లేనివిధంగా కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఐదేళ్లలో రూ.130 కోట్ల సాయం అందించారు. లోకేష్‌ ఇచ్చిన ఈ భరోసాతోనే ఎన్నికల కురుక్షేత్రంలో అరాచక ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడి పార్టీని విజయతీరాలకు చేర్చారు.

Previous Post

భారీగా కొలువుదీరిన మోదీ సర్కార్‌

Next Post

అక్షర సూరీడుకి అంతిమ వీడ్కోలు

మరిన్ని వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ
ఆంధ్రప్రదేశ్

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం
ఆంధ్రప్రదేశ్

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!
ఆంధ్రప్రదేశ్

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist