టిడిపి అధికారంలోకి రాగానే ఎస్సీ కార్పొరేషన్ ను బలోపేతం చేసి నిధులు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి ఎస్సీ కాలనీ వాసులు లోకేష్ ను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ వారికి తీరని ద్రోహం చేశారని విమర్శించారు.
ఎస్సీ లకు చెందాల్సిన రూ. 28 వేల కోట్ల నిధులను ఇతర పథకాలకు మళ్లించారని ధ్వజమెత్తారు. పేదలకు సెంటు పట్టా పేరుతో 7 వేల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. టిడిపి అధికారంలోకి రాగానే దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటినీ పరిష్కరించి, ఇళ్ళు లేనివారికి గృహాలు మంజూరు చేస్తామని వెల్లడించారు.