స్కేల్ ఏఐ గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ ట్రెవర్ థాంప్సన్‌తోనూ మంత్రి నారా లోకేష్ దావోస్‌లో భేటీ అయ్యారు. స్కేల్ ఏఐ భాగ స్వామ్యంతో ఆర్‌టీఐహెచ్‌లో ఏఐ భద్రత, ఎవాల్యుయేషన్/ గవర్నె న్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడంలో చేయూత అందించాలని కోరా రు. పబ్లిక్ డేటాసెట్‌లు, ప్రభుత్వ ఏఐ అప్లికేషన్‌ల కోసం ఎలఎల్ ఎం బెంచ్ మార్కింగ్, రెడ్-టీమింగ్, ఏఐ గవర్నెన్స్‌పై దృష్టి సారించడానికి స్కేల్ ఏఐ సీల్ ప్లాట్‌ఫామ్‌ను అందించండి. విశా ఖపట్నంలో స్కేల్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయండి. అప్లైడ్ ఏఐ డెలివరీ, అడ్వాన్స్‌డ్ టాలెంట్ డెవలప్‌మెంట్, విద్యా సహకారాన్ని సమగ్రపరచడంలో సహకారం అందించండి. రాష్ట్రం లో ఏఐ లిటరసీ, జియోస్పేషియల్ ఏఐ, కంప్యూటర్-విజన్ టాలెంట్ పైప్‌లైన్‌లను ప్రోత్సహించేందుకు భాగస్వామ్యం వహిం చాలని విజ్ఞప్తి చేశారు. ట్రెవర్ థాంప్సన్ స్పందిస్తూ ప్రపంచంలో అతి ముఖ్యమైన నిర్ణయాల కోసం నమ్మకమైన ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం.
ఏఐ డేటా మౌలిక సదుపాయా లు, మోడల్ ఎవాల్యుయేషన్, అప్లైడ్ ఏఐ సాఫ్ట్‌వేర్‌పై దృష్టి సారిస్తు న్నట్లు చెప్పారు. స్కేల్ ఏఐ ప్రధానంగా అమెరికా నుంచి అంతర్జాతీయంగా ప్రభుత్వ సంస్థలు, వ్యాపార సంస్థల క్లయింట్లతో కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఎంటర్‌ప్రైజ్/గవర్నమెంట్ ఏఐ అడాప్షన్, పబ్లిక్ సెక్టార్/ఏఐ సేఫ్టీ, ఎకోసిస్టమ్ పార్టనర్ షిప్‌లపై తాము సేవలందిస్తున్నట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. శాన్ ఫ్రాన్సిస్కో (యూఎసఏ) కేంద్రంగా పనిచేస్తున్న స్కేల్ ఏఐ సంస్థ 29 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగి ఉంది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్, యూఎస్ ఆర్మీ, ఇతర ఫెడరల్ ఏజన్సీలకు స్కేల్ ఏఐ సేవలు అందిస్తోంది. స్కేల్ ఏఐ కస్టమర్లలో అంతర్జాతీయంగా పేరొందిన మెటా, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ, గూగుల్, ఎన్ విడియా వంటి టెక్ సంస్థలు, ఏఐ ల్యాబ్ లు ఉన్నాయి. ఆటోమోటివ్, టెక్, లాజిస్టిక్స్, ఆర్థిక సేవల రంగాల్లోని ఫార్చ్యూన్ 500 సంస్థలకు స్కేల్ ఏఐ సేవలు అందిస్తోంది.














