అమరావతి,చైతన్యరథం: అనంతపురంలో సాప్ట్ వేర్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డిపై తాడిపత్రి సెబ్ పోలీసుల దాడిని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఖండిరచారు. అక్రమ మద్యం సరఫరా చేసే వారిని వదలి అమాయకులపై ప్రతాపం చూపటం ఏంటని ప్రశ్నించారు. ముద్దాయి ఎవరో తెలియకుండా పోలీసులు దాడి చేసి గాయపర్చటం సెబ్ పనితీరుకు అద్దం పడుతోందన్నారు. గాయపడిన చంద్రశేఖర్ రెడ్డికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని, ఘటనకు భాద్యులైన సెబ్ పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.