- స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ డిజేబులిటీ సమావేశం కూడా..
- పలు అంశాలపై సమీక్షించనున్న మంత్రి డోలా
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వయోవృద్ధుల, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో సీనియర్ సిటిజన్స్ స్టేట్ కౌన్సిల్ 2 వ సమావేశం, మ.12.గం.లకు స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ డిజేబులిటీ సమావేశం జరుగనుంది. సీనియర్ సిటిజన్స్ స్టేట్ కౌన్సిల్ 2 వ సమావేశంలో వయో వృద్ధుల ఆరోగ్య సంరక్షణ, వృద్ధాశ్రమాల ఏర్పాటు, సామాజిక భద్రత పింఛన్లు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా డిజిటల్ కార్డుల పంపిణీ అంశాలపై సమీక్షిస్తారు. స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ డిజాబులిటీ సమావేశంలో విభిన్న ప్రతిభావంతులకు వైకల్య ధృవపత్రాల జారీ, ప్రధాన మంత్రి దివ్రిషా కేంద్ర (పీఎమ్‌డీకే) స్థాపన, ఉపకరణాల సరఫరా, వివిధ అభివృద్ధి పథకాలు/కార్యక్రమాల్లో 5 శాతం రిజర్వేషన్ల అమలు, వసతి గృహాలు, కళాశాలల్లో విద్య నభ్యసిస్తున్న విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు డీబీటీ మోడ్‌లో పెన్షన్ల పంపిణీ, తదితర అంశాలపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి సమీక్షిస్తారు.