అమరావతి: ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి ఐసిఎంఆర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి విజ్జప్తిచేశారు. ఈ మేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ సెక్ర టరీకి, ఐసిఎంఆర్ కి లేఖరాశారు. లేఖ సారాం శం ఇలా ఉంది. ఎ.కొండూరు మండలంలో పెద్ద సంఖ్యలో ప్రజలు కిడ్నీ సమస్యల బారిన పడుతు న్నారు. ఈ కారణంగా ఈ ప్రాంతంలోని గిరిజన, దళిత, వెనుకబడిన వర్గాల ప్రజలు తీవ్ర అనారో గ్యం పాలవుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఒక పరిశోధనా బృందాన్ని పంపి క్షేత్ర స్థాయిలో పరిశోధన చేయాలి. పెరిగిన సమస్య తీవ్రత దృష్ట్యా సమగ్ర పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల ప్రాణాలు తీస్తున్న కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపాలని చంద్రబాబు నాయుడు కోరారు.
ఆరుగురు యువకుల
మృతి కలిచివేసింది
సూర్యలంక బీచ్ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు
బాపట్ల సూర్యలంక బీచ్ లో విహారానికి వెళ్లి విజయవాడ సింగ్ నగర్ కు చెందిన ఆరుగురు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మృతులంతా పేద కుటుంబాలకు చెందిన వారని గురువారం ఆయన ట్వీట్ చేశారు. చేతికి అందివస్తారనుకున్న పిల్లలను కోల్పోయిన ఆ యువకుల కుటుంబాలకు జరిగిన నష్టం అపారమన్నారు. పండుగ వేళ బిడ్డలను కోల్పోయిన ఆ కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పర్యాటక కేంద్రాల వద్ద ప్రభుత్వం తగు రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు కోరారు.