- పవన్ చేసిన వ్యాఖ్యలో ఏ తప్పూ లేదు!
- చంద్రబాబును నడిరోడ్డపై కాల్చాలన్నదెవరు?
- ప్రజాసమస్యలపై జనసేనతో కలసి పోరాడతాం
- మంగళగిరిలో ఓడినా ప్రజలమధ్యే ఉన్నా
- మీలా పరదాల చాటున దాక్కోలేదు!
- టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
మంగళగిరి : మేము అధికారంలో ఉన్నపుడు దసపల్లా భూము లు కొట్టేశామని తప్పుడు ప్రచారం చేసిన జగన్ అండ్ కో గత మూడేళ్లుగా విశాఖపట్నంలో వందలాది ఎక రాలు కబ్జా చేశారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం సిగ్గు న్నా విశాఖ భూకుంభకోణాలపై సిబిఐ విచారణ జరి పించాలని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్ డిమాండ్‌చేశారు. తాడేపల్లి పట్టణం లో సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ.. విశాఖలో భూ ములు కొట్టేసిన వైసిపి నేతలు ఆ తప్పులు కప్పిపుచ్చు కునేందుకే మూడు రాజధానుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. విశాఖలో ఎంపీ ఎంవీ వీ సత్యనారాయణ, విజసాయిరెడ్డి కలిసి వందల ఎక రాల భూములు కొట్టేశారు. ఇద్దరికీ వాటాలు కుదరక పోవడంతో అన్ని అక్రమాలు భయపడుతున్నాయని అన్నారు.
పవన్ వ్యాఖ్యల్లో తప్పులేదు
అసభ్యంగా మాట్లాడితే చెప్పుతీసుకొని కొడాతా నన్న పవన్ వ్యాఖ్యాల్లో తప్పేముంది? జగన్ కుటుంబ సభ్యులపై మేం ఏనాడు అసభ్యకరంగా మాట్లాడలేదు. మా తల్లిపై మంత్రులు అసభ్యంగా మాట్లాడితే జగన్ అడ్డుకోకపోగా ఎగతాళిగా నవ్వారు. ఇది సభ్యతా? ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళితే ప్రభుత్వం, మంత్రులు అమానుషంగా వ్యవహరించారు. రాజ్యాంగాన్ని, ప్రతిపక్షాలకు ఉన్న హక్కులను కాపాడుకునేందుకే చంద్రబాబు పవన్? కల్యాణ్నియ కలిశారు.
ప్రజాసమస్యలపై కలిసి పోరాడతాం
ప్రజా సమస్యపై అన్ని పార్టీలను కలుపుకొని పోరాడటం టీడీపీకి కొత్తేమీ కాదు. గతంలో ఎమ్మిగనూరులో ముస్లిం అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, సీపీఐ రామకృష్ణతో కలిసి పోరాడాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, ప్రజాసమస్యలపైన పవన్తో¸ కలిసి పోరాడుతాం. తాడేపల్లి ప్యాలెస్ పిల్లిని అధికారం నుంచి దించే వరకు పోరాడుతాం. కరోనా కన్నా ప్రమాదకరమైనది జగనోరా వైరస్. జగనోరా వైరస్ అధికారం నుంచి వైదొలగితేనే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పట్ నుంచి ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు ఒక అటెంప్టివ్ మర్డర్ కేసుతో సహా 15 అక్రమ కేసులు నాపై బనాయించారు. కేసులు టీడీపీకి కొత్త కాదు.
నాటి సిఎంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిందెవరు?
అమరావతి రైతులపై వైసీపీ ఎంపీ భరత్ దాడి చేయడమే కాకుండా.. చెప్పు చూపించారు. గతంలో జగన్ చంద్రబాబుపై నడిరోడ్డుపై కాల్చి చంపాలని, చెప్పు, చీపుర్లతో కొట్టాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆరోజు మా నాయకుడు మీలా వ్యవహరించి ఉంటే.. జగన్ ఏపీలోనే అడుగుపెట్టేవాడు కాదు. రైతుల్ని అవమానించిన వారికి శాపమే తగులుతుంది. పిల్లి లాగా షాపులు మూసి జగన్ దాక్కొన్ని తాడేపల్లి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
మంగళగిరిలో ఓడినా ప్రజలమధ్యే ఉన్నా
మంగళగిరి నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీచేసి స్వల్పమెజార్టీతో ఓడిపోయా. ఎన్ని కల్లో ఓడిపోయినప్పటికీ ప్రజలమధ్యే ఉంటూ చంద్ర బాబునాయుడు ఆదేశాల మేరకు సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాలు మంగళగిరి నియోజకవర్గంలో కొనసా గించాం.అన్నా క్యాంటీన్ ఏర్పాటుచేసి పేదవాడి ఆకలి తీరుస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్వర్ణకారులను ఆదుకునేందుకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాం. సంఘం ద్వారా బ్యాంక్ లింకేజీ, ఇన్స్‌రెన్స్‌లు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేప ట్టాం.మంగళగిరి నియోజకవర్గంలో యువతీయవకు లు పెళ్లి చేసుకుంటే టీడీపీ తరపున పెళ్ళికానుక అం దించాం. క్రిస్మస్? సమయంలో ఫాస్టర్లు, సంక్రాంతికి పురోహితులకు, రంజాన్? సమయం లో ఇమామ్? మౌజన్లటకు గౌరవంగా టీడీపీ బట్టలు పెట్టాం.
నాడు అమరావతికి మద్దతు ఇవ్వలేదా?
గతంలో అసెంబ్లీ, ప్లీనరీ, పాదయాత్రలో అమరా వతిని రాజధానిగా జగన్ ఒప్పుకొని, 30,000 ఎక రాలు ఉన్న ప్రాంతాంలో రాజధాని కట్టాలని చెప్పి.. ప్రస్తుతం మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ని ఒప్పించి రాజధాని ఇక్కడే ఏర్పాటు చేసేలా చేస్తానని ఆర్కే చెప్పి సిగ్గులేకుండా సీఎం ప్రయత్నాన్ని అడ్డు చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదు. రాజధాని ఒకే ప్రాంతాంలో ఉండాలి.. పరిపాలన వికేంద్రీకరణ జరగాలన్నది చంద్రబాబు ఆలోచనా విధానం. అందు లో భాగంగానే కర్నూలు, కడపలో ఎయిర్‌ఫోర్టుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం. నెల్లూరులో ఎయిర్ఫో రర్ట్ నిర్మాణానికి భూసేకరణ చేసి.. నిధులు కేటా యించాం. అభివృద్ధి వికేంద్రీకరణ, అభివృద్ధి చేయ లేకే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల కోసం భూములిచ్చిన అమరావతి రైతులను జగన్ అవమానిస్తున్నారు. జగన్ రెడ్డి ఇసుక కుంభకో ణంలో రెండు కోట్లు, మద్యం కుంభకోణంలో రోజుకు మరో 2కోట్ల చొప్పున దోచుకుంటున్నారు. కుంభకో ణాల్లో తక్కువ వచ్చిన వాటాలు రోజూ జగన్‌రెడ్డి లెక్కి స్తూ టార్గెట్ రీచ్ అవ్వాలని వార్నింగ్ ఇస్తున్నారు. దున్నపోతు ప్రభుత్వా న్ని ప్రజలే చైతన్యవంతులై తరమికొట్టాలని లోకేష్ పిలుపునిచ్చారు.