- గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమనడం సిగ్గుచేటు
- తప్పుడు రాతలు రాస్తే జనం ఉమ్మేస్తారు
- జలవనరులశాఖ అధికారులతో సమీక్షలు చేసి ఈ ప్రభుత్వం సాధించింది ఏమిటి?
అమరావతి: ఈ ప్రభుత్వ అసమర్థత ఏది బయటపడ్డా దాన్ని చంద్రబాబు, టీడీపీకి అంటగట్టడం జగన్ పార్టీ, ఆయన మీడియాకు అలవాటైపోయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడానికి టీడీపీ ప్రభుత్వమే కార ణం అంటూ సాక్షి పత్రికలో వచ్చిన కథనా న్ని ఆయన తీవ్రంగా ఖండిరచారు. జగన్ పత్రిక సాక్షి సిగ్గు విడిచేసి తప్పుడు రాతలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ంలోని ప్రాజెక్టుల నిర్వహణను జగన్ ఎప్పు డో గాలికొదిలేశారని శనివారం ఒక ప్రకట నలో అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.ప్రాజె క్టుల గేట్లు మరమ్మతులకు నోచుకోవడం లేదని రైతులు, మీడియా గగ్గోలుపెట్టినా జగన్ పట్టించుకోలేదు. గతంలోనే గుండ్లక మ్మ ప్రాజెక్టు గేటు ఒకటి ఊడిరది.. ఇప్పు డు మరొకటి ఊడిరది.గేట్లకు కనీసం గ్రీజ్ కూడా పెట్టడం లేదు. తిని ప్యాలెస్‌లో పడు కుని బయటకు రాకుండా,ఏ ప్రాజెక్టు ఎలా ఉందో చూడకుండా గుడ్డెద్దుబోయి చేలో పడ్డట్టు ఇంకా చంద్రబాబుపై మీ ఏడుపులు ఎందుకు.? క్యూసెక్కుకు, టీిఎంసీకి తేడా తెలియని వాళ్ళను నీటిపారుదల మంత్రుల నుచేస్తే ఇలాంటి ఉత్పాతాలే దాపురిస్తాయి.
ప్రాజెక్టుల తీరుపై అధికారులతో సమీక్షలు చేసి మీరు పీకింది ఏంటి? టీ, సమోసాల కు ఇచ్చిన ప్రాధాన్యత ఒక్క టీఎంసీ నీటిని కాపాడటంపై పెట్టండి. అసలే వర్షాలులేక ప్రాజెక్టులు నిండుకున్నాయి. ఇప్పుడు జగన్ సోమరిపోతు తనంతో గేట్లు ఊడి నీళ్లన్నీ వృథా అవుతున్నాయి. గతంలో కూడా పులి చింతల ప్రాజెక్టు రాజశేఖర్‌రెడ్డి పూర్తి చేశా డని సాక్షిలో రాశారు. కానీ గేటు కొట్టుకు పోవడానికి మాత్రం చంద్రబాబే కారణం అని రాశారు. ఇప్పుడు కూడా 2008లో రాజశేఖరరెడ్డి గుండ్లకమ్మను పూర్తి చేశార ని రాశారు. కానీ గేటు కొట్టుకుపోవడానికి మాత్రం చంద్రబాబు అని రాశారు. అన్న మయ్య గేటు కొట్టుకుపోయి రెండేళ్లు అయి నా సరైన మరమ్మతులు లేవు.తప్పుడు రాత లు రాస్తే ప్రజలు ఉమ్మేస్తారని జగన్ మీడి యా గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా గుండ్ల కమ్మ ప్రాజెక్టులో మిగిలిన గేట్లకు మరమ్మ తులతో పాటు, రాష్ట్రంలోని ఇతర ప్రాజె క్టుల నిర్వహణపైనా సీఎం సమీక్షలు చేసి పనులు చేపట్టాలి. ప్రభుత్వ తీరు మారక పోతే ప్రాజెక్టుల వద్ద ఆందోళన చేపడతా మని అచ్చెన్నాయడు హెచ్చరించారు.