• కావలి నియోజకవర్గం సిద్దనపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో దాదాపు 65ఏళ్లుగా మంచినీటి సమస్య ఉంది.
• ప్రతిరోజు 2కిలోమీటర్ల దూరం వెళ్లి నీరు తెచ్చుకోవాల్సివస్తోంది. మా గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించాలి.
• మా గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించాలి.
• గ్రామంలో విద్యుత్ స్థంభాలు శిథిలావస్థకు చేరాయి, కొత్తవి ఏర్పాటు చేయాలి.
• గ్రామంలో పశు వైద్యశాల లేక పశువుల కాపరులకు ఇబ్బంది ఉంది. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామంలో పశువుల వైద్యశాల నిర్మించాలి.
• విద్యుత్ ఛార్జీలు భారంగా మారాయి, తగ్గించే చర్యలు తీసుకోవాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• వైసిపి ప్రజాప్రతినిధులకు దాచుకోవడం, దోచుకోవడం తప్ప ప్రజాసమస్యలపై శ్రద్ధలేదు.
• సంక్షేమంపై లక్షల కోట్లు ఖర్చుచేస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటున్న ముఖ్యమంత్రి గ్రామాల్లో గుక్కెడు నీళ్లివ్వలేకపోవడం దారుణం.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేసి, 24/7 స్వచ్చమైన తాగునీరు అందిస్తాం.
• గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజి, ఇతర మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం.
• గోపాలమిత్ర వ్యవస్థను పునరుద్దరించి, పశుపోషకులకు ఇబ్బంది లేకుండా చేస్తాం.
• జగన్మోహన్ రెడ్డి పెంచిన విద్యుత్ ఛార్జీలతోపాటు అడ్డగోలు పన్నులన్నింటినీ సమీక్షించి, ప్రజలకు ఉపశమనం కలిగిస్తాం.