అమరావతి,హైదరాబాద్: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. హయగ్రీవ సంస్థ భూముల వ్యవహారంలో మాజీ ఎంపీపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. కేసును కొట్టేయాలని హైకోర్టులో ఎంవీవీ సత్యనారాయణ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈలోపు అరెస్ట్ నుండి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కేసు ఎఫ్‌ఐఆర్ దశలో ఉన్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.