చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో సీఎం సలహాదారులతోపాటు కొందరు అధికారులు బరితెగించి వ్యవహరించారన్నది కాదనలేని వాస్తవం. జగన్ కళ్లలో వికృతానందం చూడటానికి సీఐడీ అధికారులు బరితెగించి వ్యహరించారు. చట్టానికి విధేయులుగా ఉండాల్సిన పోలీసులు జగన్‌రెడ్డి పాదపూజకు పోటీ పడ్డారు. చంద్రబాబు అరెస్టు కోసం ఏకకాలంలో మూడు విభాగాల్లో ఫైళ్లను మాయం చెయ్యడం వెనుక కుట్రకోణం లేకపోలేదు.
దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, అంతర్జాతీయంగా పేరున్న చంద్రబాబునే కుట్రలు చేసి అర్ధరాత్రి అరెస్టు చేశారంటే.. ఇక సామాన్యుడి పరిస్థితేంటి? తాడూ బొంగరంలేని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా జైలుకుపంపి అహం చల్లార్చుకున్న జగన్‌రెడ్డి కుట్రకోణం నిగ్గుతేల్చి.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో సీఎం సలహాదారులతోపాటు కొందరు అధికారులు బరితెగించి వ్యవహరించారన్నది కాదనలేని వాస్తవం. జగన్ కళ్లలో వికృతానందం చూడటానికి సీఐడీ అధికారులు బరితెగించి వ్యహరించారు. చట్టానికి విధేయులుగా ఉండాల్సిన పోలీసులు జగన్‌రెడ్డి పాదపూజకు పోటీ పడ్డారు. చంద్రబాబు అరెస్టు కోసం ఏకకాలంలో మూడు విభాగాల్లో ఫైళ్లను మాయం చెయ్యడం వెనుక కుట్రకోణం లేకపోలేదు.
ఫైళ్లు అందుబాటులో వుంటే కేసు నమోదు సాధ్యం కాదు కనుకే.. ఫైళ్లు మాయంచేసి అరెస్టుకు కుట్ర పన్నారు. ఆ కుట్ర కేసులో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని బెదిరించి చంద్రబాబుకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పించారు. ఆ అధికారిని తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించుకొని.. గతంలో జగన్‌ను జైలుకు పంపిన చంద్రబాబును ఇప్పుడు జైలుకు పంపాలని, జగన్‌రెడ్డిని సంతోష పెట్టడానికైనా చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వాలని ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి బెదిరించారు. అలా, ఏ తప్పూ చేయకున్నా బాబు జైలుకెళ్లాల్సి వచ్చింది. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను తారుమారు చేసి కుట్ర పూరితంగా రాజకీయ కక్షసాధింపుతో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేసి 53 రోజులు జైలులో బంధించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడానికి జగన్ ప్రభుత్వం చేయకూడనన్ని తప్పులు చేసింది. చంద్రబాబును అరెస్ట్ చేయడం అక్రమమని ఆనాడే న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు సీఐడీ ఒక్క ఆధారం కూడా చూపలేకపోయింది. అసలు ఈ కేసే అక్రమమని, చంద్రబాబును కుట్రపూరితంగా కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంటర్యూలో వెల్లడిరచారు.
సీఎం సీటులో కూర్చున్న దగ్గరనుంచి కక్షలు కార్పణ్యాలతో రగిలిపోయారు జగన్‌రెడ్డి. నైపుణ్యాభివృద్ధి సంస్థలో నిధులు దుర్వినియోగం జరిగిందంటూ 2021లో కేసు నమోదు చేసి, 2023 చివరిలో చంద్రబాబును అరెస్టు చేశారు. కానీ నిధులు విడుదల చేయడంలోనూ, ఒప్పందాలపై నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీగా వున్న, సంబంధిత శాఖ కార్యదర్శిగా సంతకాలు చేసిన ప్రేమచంద్రారెడ్డిని మాత్రం కేసులో ముద్దాయిగా చేర్చలేదు. 2021లో కేసు నమోదు చేసినప్పుడు చంద్రబాబును నిందితుడిగా చేర్చలేదు. రెండున్నరేళ్ల తర్వాత ఎవరో ఆడిటర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా డైరెక్టుగా అరెస్టు చేశారు. ఈ కేసులో నిజంగా తప్పు జరిగినా, నిధుల దుర్వినియోగం జరిగినా అందుకు ప్రథమంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ ప్రేమచంద్రారెడ్డిని బాధ్యుడిని చేయాలి.
గతంలో జగన్ కంపెనీలకు నిధులు పంపిన వ్యక్తులకు మేళ్లు చేయడంలో నిబంధనలు పాటించలేదన్న కారణంగా అప్పట్లో పలువురు ఐఏఎస్ అధికారులను కూడా అరెస్టు చేశారు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా ఏకంగా మాజీ ముఖ్యమంత్రినే అరెస్టు చేశారు. చంద్రబాబును ప్రధాన నిందితుడుగా భావించి ఉంటే, అందుకు తగిన ఆధారాలు చూపాలి. ఆధారాలుంటే నోటీసులు ఇచ్చి పిలిపించుకొని అరెస్టు చేయాలి. అలా కాకుండా పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి నంద్యాల వెళ్లిన చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటి? అసలు చంద్రబాబుపై ఏపీ సీఐడీ పెట్టిన కేసు కూడా డొల్లతనంతో కూడుకున్నది. సీఐడీ అధికారులు అత్యుత్సాహంతో చంద్రబాబుపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. కానీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్‌ను ప్రయోగించాల్సింది అవినీతి నిరోధక శాఖ
కదా? మరి ఇక్కడ సీఐడీకి ఏం పని?
జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై ప్రత్యేక దృష్టిపెట్టి అప్పటి అధికారుల ఇళ్లకు సీఐడీ అధికారులను పంపించి నానాయాగీ చేయించారు తప్ప ఎక్కడా స్కామ్ జరిగినట్టు నిరూపించలేకపోయారు. అయినా బలమైన ఆధారాలు లభించాయని సీఐడీ అధికారులు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో చంద్రబాబు నంద్యాల పర్యటనలో ఉన్నప్పుడు అర్ధరాత్రి సమయంలో అప్పటి సీఐడీ డీఐజీ కొల్లి రఘురామరెడ్డి బృందం వెళ్లి హైడ్రామా మధ్య ఆయన్ను అరెస్టు చేసింది. కోర్టులో హాజరు పరిచి ఒక దొంగని తరలించినట్లు అర్ధరాత్రి రాజమండ్రి జైలుకు తరలించారు.
2019లో చంద్రబాబు దిగిపోయే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 40 ఇంజనీరింగ్ కాలేజీల్లో స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్లు ఉన్నాయి. దాదాపు 4 లక్షల మందికి శిక్షణ ఇప్పించి 60 వేలమందికి పైగా ఉద్యోగాలు కల్పించారు. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం సైతం ఆ కేంద్రాలను కొనసాగించింది. సీఐడీ చెప్పినట్లు ప్రభుత్వం చెల్లించిన డబ్బంతా తిరిగి చంద్రబాబుకే ఇస్తే ఆ కంపెనీలు నాలుగు లక్షల మందికి శిక్షణ ఇవ్వడం, 60 వేల మందికి ఉద్యోగాలు కల్పించడం ఎలా సాధ్యం. ప్రభుత్వం చెల్లించిన మొత్తంకంటే మూడు రెట్లు విలువైన శిక్షణా పరికరాలను ఇంజనీరింగ్ కాలేజీలకు సరఫరా చేశారు. ‘స్కిల్’ మొత్తం స్కామైయితే శిక్షణా పరికరాలు ఎలా ఏర్పాటు అయ్యాయి?
చంద్రబాబును ఈ కేసులో ఇరికించి అరెస్టు చేయాలన్న కుట్రతో జగన్ సర్కార్ అనేకమంది అధికారులను పిలిచి స్టేట్‌మెంట్ నమోదు చేసింది. అందులో భాగంగానే ఐపీఎస్ పీవీ రమేశ్ నుంచీ సీఐడీ 161 స్టేట్‌మెంట్ తీసుకుంది. పీవీ రమేశ్ స్టేట్‌మెంట్‌నూ సీఐడీ మార్చేసింది. సీనియర్ ఐఏఎస్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను మాయంచేసి, తమ సొంత స్టేట్‌మెంట్‌నే కోర్టులకు సమర్పించారు. తాను ఇచ్చిన స్టేట్‌మెంట్ ద్వారా చంద్రబాబును అరెస్టు చేశారన్న విషయాన్ని పీవీ రమేశ్ ఆనాడే ఖండిరచడం జరిగింది. తప్పుడు పద్ధతుల్లో స్టేట్‌మెంట్ తారుమారు చేసి ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసేందుకు జగన్‌రెడ్డి అవలంబించిన తప్పుడు పద్ధతులను ఇప్పుడు బయటకు తీసి కుట్ర పన్నిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ కోరుతున్నారు. 2013-14లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషనుకు ఒక ఎండీని నియమించి, బడ్జెట్ కేటాయించారు. ఆ సమయంలో సీమెన్స్ ఇండియా వాళ్లు వచ్చి ఏపీలో నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రూ.3,000 కోట్లు పెట్టుబడులు పెడతామని చెప్పారు. సీఎస్‌ఆర్ నుంచి ఖర్చు చేస్తామన్నారు.
నిర్వహణ ఖర్చుల కోసం మరో 10 శాతం మొత్తాన్ని బడ్జెట్ నుంచి ఖర్చు చేయాలి. ఈ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం ఉంది. గవర్నర్ ఆమోదించారు. ఫైనాన్సు బిల్లు ఆమోదం పొందాక రూ.270 కోట్లు విడుదలయ్యాయి. అన్నీ చట్టబద్దంగా నిబంధనల మేరకు జరిగితే ఇంకెక్కడ తప్పు జరిగినట్లు? గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ఫైళ్లు మాయం చెయ్యడం ఎలా సాధ్యం? స్కిల్ డెవలప్మెంట్ కేసు అక్రమం కాకపొతే ఫైళ్లు మాయం చేయాల్సిన అవసరమేంటి? చంద్రబాబు ఏ తప్పు చెయ్యలేదని ఆయనకు అనుకూలంగా నిలిచే సాక్ష్యాలు ఆ మూడు శాఖల్లోని ఫైళ్లను, ఆ సాక్ష్యాలను ఒక్కసారిగా ఎలా మాయం అయ్యాయి? ఎవరు మాయం చేసారు? వంటి అనేక అంశాలపైనా విచారణ చేపట్టి.. దొంగ సాక్ష్యాలను కోర్టుల ముందుంచి చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన పాపాత్ములుపై కఠిన చర్యలు తీసుకోవాలి. సమర్థవంతమైన, నిజాయితీగల అధికారులతో విచారణ చేపట్టి చంద్రబాబు అక్రమ అరెస్టు కుట్ర కోణాన్ని నిగ్గు తేల్చాలి.