యువగళం పాదయాత్ర ప్రదేశంలో (కోవూరు) టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించాడు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక దళితుడు, ఇద్దరు ముస్లిం యువకుల్ని దారుణంగా చంపిన ఎస్ ఐ కరిముల్లాను మంత్రి తన నియోజకవర్గంలో ఉంచుకోవడం దారుణం. ఉదయగిరి నారాయణ హత్యకేసులో అమాయకుల్ని చంపిన ఎస్.ఐని రక్షిస్తున్న మంత్రి ఏ1 అయితే, శవాన్ని 40మంది పోలీసులతో దహనంచేయించిన జిల్లాఎస్పీ ఏ2, పోస్ట్ మార్టమ్ నివేదిక తారుమారుచేయించిన వైద్యుడు ఏ3, ఎస్.ఐ ఏ4లు.
• ఉదయగిరి నారాయణ మృతిపై టీడీపీ జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తే, కమిషన్ ఎన్నిసార్లు కోరినా జిల్లాఎస్పీ, కలెక్టర్ స్పందించలేదు.
• ఆగ్రహించిన కమిషన్ ఆగస్ట్ 25న జిల్లాఎస్పీ, కలెక్టర్ ఆధారాలతో తమముందు విచారణకు రావాలని ఆదేశించింది.
“ నెల్లూరుజిల్లాలో కందమూరు గ్రామస్తుడైన ఉదయగిరి నారాయణను పొదల కూరు పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురిచేసి చంపిసి, కందమూరు అడవుల్లో చెట్టుకు వేలాడదీసిన ఘటనపై టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య జూలై 06-2022న జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదుచేశారు.
• జాతీయ మానవహక్కుల కమిషన్ జనవరి 23-2023న జిల్లా కలెక్టర్ ఎ స్పీ వివరణ కోరింది. సమాధానంలేకపోతే మే19-2023లో మరలా రిమైండ ర్ పంపించారు. దానికి కూడా సమాధానం లేకపోతే, చివరిగా ఆగస్ట్ 25న జిల్లా కలెక్టర్, జిల్లాఎస్పీలు నేరుగా తమ ముందు హాజరుకావాలని కమిషన్ ఆదేశించింది.
• మా పార్టీ ఇదే వ్యవహారంపై జాతీయ ఎస్సీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసిం ది. ఫిర్యాదుపై ఎస్సీ కమిషన్ వెంటనే స్పందించి, మృతుడి కుటుంబానికి అన్యాయం జరిగిందని, జరిగింది సాధారణ హత్య కాదని నిర్ధారణకు వచ్చింది. 24 గంటల్లో మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, అతని కుటుంబానికి నష్టపరిహారం, 3ఎకరాలపొలం, 30సెంట్ల ఇంటిస్థలం, మృతుడి పిల్లలకు ఉచిత విద్య సౌకర్యం కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు.
• ఉదయగిరి నారాయణది దుర్మార్గమైన హత్య. అతని చావుకి కారణమైన సబ్ ఇన్ స్పెక్టర్ కరిముల్లా గతంలో వెంకటాచలంలో కోవిడ్ సమయంలో ఇద్దరు ముస్లిం యువకుల్ని కొట్టికొట్టి చంపాడు. ఆ దారుణంపై మైనారిటీ కమిషన్ కు ఫిర్యాదుచేశారు.
• ఇద్దరు ముస్లింయువకుల చావుకి కారణమైన ఇన్ స్పెక్టర్ కరిముల్లానే నా రాయణని చంపేశాడు. అతనిచనిపోవడానికి కారణం పోలీసులేనని జాతీ య ఎస్సీకమిషన్ తేల్చినా, జాతీయమానవహక్కుల కమిషన్ జిల్లాఎస్పీ, కలెక్టర్లను తమఎదుట విచారణకురావాలని ఆదేశించినా ప్రభుత్వంలో చలనంలేదు.
• సబ్ ఇన్ స్పెక్టర్ కరిముల్లాను ఇంకా సర్వీస్ లో కొనసాగించడం, అతన్ని పొదలకూరు ఎస్.ఐ.గా ఉంచిన మంత్రి ఈకేసులో ఏ1 అవుతాడు. చంపిన వారికంటే, వారికి మద్ధతిస్తున్న మంత్రే ప్రధాననిందితుడు. నారాయణ హత్యకేసులో మంత్రి ఏ1 అయితే, మృతుడి శవాన్ని 40మంది పోలీసుల తో తగలబెట్టించిన జిల్లాఎస్పీ ఏ2 అవుతాడు. పోస్ట్ మార్టమ్ నివేదికను నిర్దాక్షణ్యంగా మార్చిన వైద్యుడు ఏ3 అవుతాడు. ఎస్.ఐ కరిముల్లా ఏ4 అవుతాడు. వీరందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కోరుతున్నాం.
• గతంలో జిల్లాఎస్పీగా విజయరావు ఉన్నప్పుడు కావలిలో కరుణాకర్ అనే దళితుడిని దారుణంగా చంపేశారు. వైసీపీనేతలు జగదీశ్ రెడ్డి, సురేశ్ రెడ్డి వల్లే తానుచనిపోతున్నానని కరుణాకర్ లేఖరాసి చనిపోయాడు. అప్పు డు కూడా టీడీపీ నేతలు జరిగినదారుణంపై జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసి, కరుణాకర్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూశాం.
• కరుణాకర్ చావుకి కారణమైన ఇద్దరుముద్దాయిలు ఒడిశాలో ఉంటే ఖాజా వలి అనే ఎస్.ఐ అక్కడికెళ్లి అరెస్ట్ చేశాడు. ముద్దాయిల్ని అరెస్ట్ చేసినందు కు ఖాజావలిని వీ.ఆర్ కు పంపించారు. పాతఎస్పీ వైసీపీనేతలకు గులాంగి రీ చేశాడు.
• కరుణాకర్ చనిపోయేముందు రాసినలేఖలో తనఇల్లు తాకట్టులోఉంది.. విడిపించండి అనికోరాడు. దానిపై టీడీపీనేతలు రవించంద్ర, సుబ్బానాయు డు 9.50లక్షలు డబ్బుకట్టి, ఇల్లువిడిపించారు. ఆపదలో ఉన్న కరుణాకర్ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకెళ్లిన నాపైన, రవిచంద్రపైన కేసులు పెట్టారు. భర్తచనిపోతే భార్యాపిల్లల్ని ఆదుకోవడం మేంచేసిన నేరమా?
• ప్రభుత్వంలో క్రిమినల్ ప్రొసిడ్యూర్ కోడ్ (సీ.పీ.సీ), వైసీపీ ప్రొసిడ్యూర్ కోడ్ వచ్చింది. జిల్లా మంత్రికి కొట్టేవాళ్లు, చంపేవాళ్లే ముద్దు. ఎస్.ఐ కరిముల్లా ఇద్దరుముస్లిం, ఒకదళిత యువకుడిని చంపినా అతన్ని మంత్రి తన నియోజకవర్గంలోనే పెట్టుకున్నాడు.
• జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది చంపినా లెక్కలేదు. మంత్రికూడా ఆయన బాటలోనే నడుస్తున్నాడు. దళితుడిని చంపిన సబ్ ఇన్ స్పెక్టర్ ను కఠినంగా శిక్షించాలి. అతనికి మరణశిక్ష వేయాలి. జాతీయమానవహక్కుల కమిషన్ నివేదికను ప్రభుత్వం వెంటనే పరిశీలించాలి. కరిముల్లాతో పాటు, అత న్ని ప్రోత్సహించిన మంత్రిపై, జిల్లాఎస్పీ, డాక్టర్ పై హత్యానేరం కింద సెక్ష న్లు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవాలి.
• వైసీపీ ప్రభుత్వం దళితులు, గిరిజనులు, మైనారిటీలనే చంపుతోంది. ఇలా ఎంతమందిని చంపుతారని ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రం అరాచక రాజ్యంగా మారింది.
అనిల్ కుమార్ యాదవ్ ప్రమాణంచేసినంతమాత్రాన ఆయన చేసిన దోపిడీ మాయమవుతుందా? మంత్రి, మాజీమంత్రి అవినీతిని లోకేశ్ బాబు ఆధారాలతో సహా బయటపెట్టాడు. ఉత్తుత్తి ప్రమాణాలతో ప్రజల్ని నమ్మించే ప్రయత్నంచేయకుండా, జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి సీబీఐ విచారణ జరిపించుకొని మీ నిజాయితీని నిరూపించుకోండి.
• అనిల్ కుమార్ యాదవ్ దేవుడిపై ప్రమాణం చేస్తాను… నా నిజాయితీని నిరూపించుకుంటాను అంటున్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వెంటనే ప్రమాణం చేస్తారు. అలా చేసి ఎంతదోచుకున్నారో ప్రజలకు తెలుసు.
• అనిల్ కుమార్ యాదవ్, అతని బినామీలు నాలుగేళ్లలో ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులుకొన్నారో, ఎన్నిఆక్రమించారో లోకేశ్ చిట్టా బయటపెట్టారు. సర్వేపల్లిలో మంత్రిపాపాలచిట్టా బయటపెట్టాడు. నెల్లూరులో మాజీమంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే అవినీతిచిట్టా బయటపెట్టాడు. లోకేశ్ అవినీతిచిట్టా బయటపెట్టిన వారికి నీతి, నిజాయితి ఉంటే ఉత్తుత్తిప్రమాణాలతో ప్రజల్ని నమ్మిం చే ప్రయత్నంచేయకుండా వారిఅవినీతి, దోపిడీపై వారే సీబీఐ విచారణ కోరాలి.
• సీబీఐ విచారణ కోరాలంటే రెండేమార్గాలు.. ఒకటి రాష్ట్రప్రభుత్వం కోరడం.. రెండోది న్యాయస్థానాలు ఆదేశించడం. రాష్ట్రంలో అధికారంలో మీరే ఉన్నా రు కాబట్టి, ముఖ్యమంత్రిని ఒప్పించి మంత్రి, మాజీమంత్రి సీబీఐ విచారణ కోరి, వారిసచ్ఛీలతను నిరూపించుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం.
• ప్రభుత్వపెద్దలు చేసిన అవినీతిపై మీరు వేసే సిట్లు.. మీ కోసమే పనిచేస్తా యి. ప్రజలకోసం పనిచేయవని అందరికీ తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నప్పు డు చంద్రాబాబు 6లక్షలకోట్లు కొట్టేశాడని మీరు, మీనాయకుడే కూశారు. ఆనాడుకూసిన కూతలన్నీ ఏమయ్యాయి…అధికారంలోకి వచ్చాక ఏం నిరూపించారు?
• జగన్మోహన్ రెడ్డి తండ్రిఅధికారంలో ఉన్నప్పుడు రూ.43వేలకోట్ల అవినీతికి పాల్పడ్డాడని కేంద్రదర్యాప్తుసంస్థలే తేల్చాయి. ఆ ఆస్తే ఇప్పుడు రూ.2, 3 లక్షల కోట్లు అయ్యిఉంటుంది. దానికి ప్రజలకు సమాధానం చెప్పండి. జగన్ , అతనిప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు నిజాయితీపరులు అయితే, రా ష్ట్రం ఇంతగా ఎందుకు దిగజారుతుంది? ”
• లోకేశ్ బయటపెట్టిన మీపాపాల, అవినీతిచిట్టాను నిరూపించుకోండి.. దమ్ముంటే, గతంలో చంద్రబాబుపై, టీడీపీ ప్రభుత్వంపై మీనాయకుడుచేసిన అవినీతి ఆరోపణల్ని నిగ్గుతేల్చండి. అంతేగానీ ఉత్తుత్తిప్రమాణాలు, సిట్ ల తో ఒరిగేదేంలేదు. సీబీఐ విచారణకోరి మీ నిజాయితీని మీరే నిరూపించుకోండి. లోకేశ్ ఆధారాలతో సహా మీ అవినీతిని బయటపెట్టాక కూడా సిగ్గులేకుండా తప్పించుకునే ప్రయత్నంచేస్తారా? ” అని ప్రశ్నించాడు.