- రుస్తుం, భారత్ మైకా మైన్లో సోమిరెడ్డి నిరసన
- నిబంధనలకు విరుద్దంగా మైన్ నిర్వహణ
- రోజుకు రూ.4 కోట్ల వైసీపీ గూండాల దోపిడి
నెల్లూరు,చైతన్యరథం: రుస్తుం, భారత్ మైకా మైన్ లో వైసీపీ గుండాల దోపిడీని నిరసిస్తూ మైన్‌లోనే కూర్చొని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నిరసన తెలిపారు. ఎటువంటి పత్రాలు లేకుండా, ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అధికార పార్టీ బందిపోటు దొంగలు 21 రోజులు గా రోజుకు 2 వేల టన్నుల క్వార్ట్జ్ ను వెలికితీత తీస్తున్నారని, రోజుకు రూ. 4 కోట్ల భారీ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు జోక్యం చేసుకొని అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకొమని ఈనెల 7 వ తేదినా ఆర్డర్స్ ఇచ్చినా, ఇంత వరకు అధికారులు అక్రమ మైనింగ్ ఆపకపోవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి కి,మంత్రులకు ఇందులో వాటాలు వున్నాయి కాబట్టే మైన్స్, పోలీసులు అధికారులు ముందుకు రావడం లేదన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏ1 ముద్దాయి, పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఏ2 గా ఉన్నారన్నారు. మంత్రి కాకాని వైసీపీ నాయకుడు పేర్నేటి శ్యాం ప్రసాద్ రెడ్డి పై చర్యలు తీసుకొని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఇప్పటివరకు దోపిడీ చేసిన నగదును వారి వద్ద నుంచి వసూలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ లో పబ్జి ఆడుతున్నాడని, కేజిఎఫ్ మైనింగ్ ను తలపించేలా ఇక్కడ దోపిడీ జరుగుతుందన్నారు