అమరావతి (చైతన్య రథం): సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో విచారణను వేగవంతం చేయాలని ఐద్వా ప్రధాన కార్యదర్శి రమాదేవి ఏపీ డీజీపీ హరీష్ గుప్తాకు వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో వివిధ ఘటనలలో మహిళలను వేధించిన కేసుల విచారణ వేగవంతం చేయాలని కోరారు. సినీ నటి జత్వానీ కేసులో బాధ్యులపై విచారణను ప్రారంభించాలన్నారు. గతేడాది ఆగస్టులోనే అన్ని వివరాలు సమర్పించినా విచారణలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆరా తీశారు. గత ప్రభుత్వంలో పోలీసు అధికారులు తీవ్రంగా వేధించారని, అందుకు అన్ని ఆధారాలున్నా…. ఇంకా ఎంత సమయం పడుతుందని అడిగారు. విశాఖలో మహిళను వేధించిన కేసు, ఎన్టీఆర్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం కేసు విచారణ వేగవంతం చేయాలని కోరారు. సినీ నటి జత్వానీ మాట్లాడుతూ ఐద్వా, ఇతర మహిళా సంఘాల నేతలతో కలిసి డీజీపీని కలిశామని.. ఈ కేసు విచారణను వీలైనంత త్వరగా చేపట్టాలని డీజీపీ, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.