- రెండు నెలల తర్వాత విహారీ ఏపీ తరుపున ఆడాలని ఆహ్వానిస్తున్నా
- టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
అమరావతి, చైతన్యరథం: జగన్మో హన్‌రెడ్డి జమానాలో ఆడుదాం ఆంధ్రా అంటే ఏమో అనుకున్నా… క్రీడాకారుల జీవితాలతో చెలగాటమాడటం అని కొత్త గా తెలిసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.జట్టులో 17వ ఆటగాడిగా ఉన్న తిరుపతి వైసిపి కార్పొరేటర్ పుత్రరత్నాన్ని పద్ధతి మార్చు కోవాలని మందలించడమే ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి చేసిన మహాపరాధమా అని ప్రశ్నించారు. భారత్ తరపున 16టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, ఆంధ్రా రంజీ జట్టుకు ఏడేళ్లు ఏకధాటి కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం వైసిపి వీధి నాయకుడి పంతం ముందు దిగదుడుపే అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడు శరత్‌చంద్రారెడ్డిని ఆంధ్రా క్రికెట్ అసోసి యేషన్ అధ్యక్షుడిగా నియమించి నపుడే ఎసిఎ పరువు బంగాళాఖాతంలో కలిసి పోయిందన్నారు. తాలిబాన్లను తలదన్నే వైసిపి విధ్వంసకపాలనలో ఇప్పటివరకు పరిశ్రమలు పక్కరాష్ట్రాలకు వెళ్లిపోవడం చూశాం… ఇప్పుడు అంబటిరాయుడు, హనుమ విహారి వంటి కొమ్ములుతిరిగిన క్రీడాకారులు కూడా పారిపోతున్నారని చెప్పారు. వైకాపా నాయకులకు తిక్కరే గిందంటే అంతర్జాతీయస్థాయి క్రికెటర్ అయినా ఇంటికి పోవాల్సిందేనని,… గట్లుంటది మనోళ్లతోటి అంటూ ఎద్దేవా చేశారు.
క్రికెటర్ హనుమ విహారి చేదు నిష్క్రమణ ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. రెండు నెలల్లోనే ఏపీ తరపున ఆడాలని విహారిని ఆహ్వానించారు. హనుమ విహారి,అతని జట్టుకు రెడ్ కార్పెట్ స్వాగ తం పలుకుతామని, ఆంధ్రా క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీని గెలవడానికి ప్రతి సహా యం అందిస్తామని లోకేష్ అన్నారు.