గత తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన ఇళ్లను ఇప్పటి వరుకు లబ్దిదారులకు కేటాయించకపోవడం దారుణం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి , టీడీపీ నేత హరిప్రసాద్ లు అన్నారు. శనివారం కడప నగర శివారులోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గృహాల వద్ద వారు సెల్ఫీ ఫోటోలు తీసుకొని మంత్రి అంజద్ బాషకు సెల్ఫీ తీసుకొని ఛాలెంజ్ విసిరారు. ఇళ్లకు రంగులు మార్చారు తప్ప లబ్దిదారులకు ఇళ్లను కేటాయించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్టు ఉంది వైసీపీ ప్రభుత్వ తీరు అని అన్నారు.
కడప నియోజగవర్గంలో గత తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించిన దాదాపు 2, 500 పూర్తైన ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. లబ్దిదారులు కట్టిన డబ్బులను ఇప్పటి వరకు వారికి చెల్లించలేదన్నారు. పేదలకు ఇస్తున్న స్థలాలను కూడా మంత్రి అంజద్ బాష వారి అనుచరులు అమ్ముకుంటున్నారని అని అన్నారు. మంత్రి అంజద్ బాష అండదండలతో వారి అనుచరులు భూ కబ్జాలు చేసి ఫ్లాట్లు వేసి అమ్ముకుంటున్నారు అని అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న పేద ప్రజల స్థలాలను కూడా లబ్దిదారులకు కేటాయించకుండా మంత్రి అనుచరులు స్వాధీనం చేసుకున్నారు, మంత్రి అంజద్ బాషకు కబ్జాల మీద ఉండే శ్రద్ధ పేదల లబ్దిదారులకు ఇళ్లను కేటాయించడంలో లేదన్నారు.