అమరావతి(చైతన్యరథం): విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిసి గురువారం పలువురు దాతలు విరాళాలు అందజేశారు. ఏపీ స్టేట్ ప్రైవేట్ ఐటీఐ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.సుధాకర్ రూ.10 లక్షలు.
శ్రీసాయి వెంకటేశ్వర ఎడ్యుకేషన్ నిర్వాహకులు వి.సతీష్ రూ.10 లక్షలు. జంగారెడ్డిగూడెంకు చెందిన విద్య వికాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రిన్సిపల్ పి.సతీష్, కరస్పాండెంట్ వి.శ్రీనివాసరావు రూ.5 లక్షలు.
సాయిరమ సివిల్ కన్స్ట్రక్షన్స్ అధినేత గోవిందరావు రూ.5 లక్షలు.
ఎస్.పబ్లికేషన్స్ నిర్వాహకులు ఎమ్.శేషావలి రూ.3 లక్షలు.
గుంటూరుకు చెందిన కండే మహాలక్ష్మి, కండే రాకేష్ రూ.25వేలు.
గోపాలపురం నియోజకవర్గం చిన్నాయగూడెంకు చెందిన కందుల సతీష్ రూ.20వేలు.
ఆర్.శివ నాగిరెడ్డి రూ.10,116.
కాగా వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాలు అందజేసిన దాతలకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.