చంద్రబాబు నాయుడు సిఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని కురుపాం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ జగదీశ్వరి అన్నారు. కొమరాడ మండలం చోళ్ళపదం గ్రామంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని కన్వీనర్ శేఖర్ పాత్రుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రజలు సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని కోరుకుంటున్నారన్నారు.
ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో సామాన్యుల బతుకు భారంగా మారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓట్లు వేసి చంద్రబాబు సిఎం చేయాలని కోరారు. రాష్ట్రం అభివృద్ధివైపు నడవాలంటే చంద్రబాబే సిఎం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.