- స్మగ్లర్లను రాష్ట్రం నుండి తరిమేస్తాం
- గంజాయి మాఫియా వెనుక ఎమ్మెల్సీ అనంతబాబు
- అక్రమ సొమ్ముతో కట్టిన జగన్ ప్యాలెస్‌లు జప్తు చేస్తాం
- జగన్ తిన్నది మొత్తం కక్కిస్తాం
- విశాఖ తూర్పు శంఖారావం సభలో యువనేత లోకేష్
విశాఖపట్నం: టీడీపీ`జనసేన ప్రభుత్వం వచ్చాక గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. గంజాయి స్మగ్లర్లను రాష్ట్రం నుంచి తరిమికొడతా మన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఆదివారం జరిగిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా వెనుక వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు లాంటివాళ్లు ఉన్నారని ధ్వజమెత్తారు. ఏజెన్సీలో గంజాయి సాగును ప్రోత్సహించి అన్ని ప్రాంతాలకు పంపిణీ చేయిస్తున్నారు. జీవితాలను నాశనం చేస్తున్నారు. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయిపై యుద్ధం ప్రకటించాలని స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కోరుతున్నారు.
యుద్ధం కాదు.. ఉక్కుపాదం మోపుతాం అని లోకేష్ ఉద్ఘాటించారు. యువగళం పాదయాత్రలో భాగంగా చంద్రగిరిలో మేం ఆగినప్పుడు ఓ తల్లి వచ్చి నన్ను కలిసింది. తనకు ముగ్గురు కూతుర్లు ఉన్నారని, పదో తరగతి చదువుతున్న పెద్ద కూతురిని గంజాయికి అలవాటు చేసి వైకాపా నాయకులు శారీరకంగా వాడుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన వద్ద డబ్బులు లేవని, తన కూతురును వేలూరు సీఎంసీకి తీసుకెళ్లాలని, ఆదుకోవాలని కోరింది. ఆదుకోకపోతే పెద్ద కూతురును చంపడం మినహా తనకు గత్యంతరం లేదని, లేకపోతే మిగతా ఇద్దరు కూతుళ్ల జీవితం నాశనం అవుతుందని వాపోయింది. ఇలా ఒక్కో కుటుంబాన్ని కలిశాను. లక్షల కుటుంబాలను ఈ ప్రభుత్వం నాశనం చేస్తోంది. దీనికంతటికి కారణం గంజాయి.. దాని వెనక ఉన్న అనంతబాబు. దళిత డ్రైవర్ ను కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గుడు అనంతబాబు. గంజాయి వెనుక ఎవరు ఉన్నారో వారందరినీ తరిమి, తరిమి కొడతామని లోకేష్ హెచ్చరించారు.
తాడేపల్లి కొంపలో టీవీలు పగులుతున్నాయి
గత 7 రోజులుగా ఉత్తరాంధ్రలో నేను పర్యటిస్తున్నా. ఇక్కడ నేను ఒకటే చూశా. ఉత్తరాంధ్ర యూత్ పవర్ అదిరిపోయింది. ఉత్తరాంధ్ర గర్జనకు తాడేపల్లి కొంపలో టీవీలు పగులుతున్నాయి. పోరాటల గడ్డ, పౌరుషాల పురిటిగడ్డ ఈ ఉత్తరాంధ్ర. విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. ఏపీ ఆర్థిక రాజధాని అంటారు. మేం విశాఖను జాబ్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా మారిస్తే జగన్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. చంద్రబాబు హయాంలో విశాఖ మోస్ట్ హ్యాపనింగ్ సిటీ. జగన్ వచ్చిన తర్వాత విశాఖపట్నం విషాద పట్నంగా మారింది. మేం నెలకో ఐటీ కంపెనీ తీసుకువస్తే.. ఇప్పుడు రోజుకో కుంభకోణం, భూకబ్జా, మర్డర్, కిడ్నాప్ జరుగుతోంది. సొంత పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులనే వైకాపా నాయకులు కిడ్నాప్ చేసే పరిస్థితి. ఎందుకు కిడ్నాప్ చేశారో ఎంపీ చెప్పాలి? ఇప్పుడు హైదరాబాద్ కు పారిపోయి బతుకుతూ మాకు నీతులు చెబుతున్నారు. విశాఖలో వైకాపా నాయకుల భూకబ్జాలకు అడ్డుపడుతున్నాడని ఎమ్మార్వో రమణయ్యని అతి కిరాతకంగా చంపేశారు. ఎవరు ప్రశ్నించినా ఇదే పరిస్థితి అని లోకేష్ విమర్శించారు.
ప్రజలకు పంచి పెడతాం
ఈరోజు నేను సింహాద్రి అప్పన్న ఆలయానికి వెళ్లి పూజలు చేశాను. ఎప్పుడు వచ్చినా నేను స్వామివారిని దర్శించుకుంటా. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అప్పన్న స్వామిని కోరుకున్నా. అన్ని ప్రాంతాల నుంచి దర్శనం కోసం భక్తులు ఇక్కడకు వస్తారు. నేను కొండ దిగుతున్నప్పుడు ప్రజలను పలకరిస్తే.. ఓ తల్లి నన్ను అడిగింది. మీరు ఎప్పుడు వచ్చినా సింహాచలం వస్తా రు.. జగన్‌రెడ్డి మాత్రం ఎందుకు రారని అడిగారు. ఆ ప్రశ్న మీరు జగన్ గారిని అడగాలి కదా అన్నాను. అప్పుడు ఓ యువకుడు.. జగన్ కు ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడకే వస్తాడు.. దేవాలయాలకు ఎందుకు వస్తాడన్నాడు. జగన్ మీద జనం అభిప్రాయం ఇదీ అని లోకేష్ ఎద్దేవా చేశారు.
జగన్ ఎన్నో పాపాలు చేశాడు..అందుకే నువ్వు అబద్ధాలు చెప్పొద్దు..నిజాలు మాత్రమే చెప్పు అని దేవుడు జగన్ కు చెప్పాడు. ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా తనకు పేపర్, టీవీలు లేవని చెబుతున్నాడు.. నిజమే. పేపర్, టీవీ లేదు..ప్రజల సొమ్ము దోచుకుని పెట్టినవి కాబట్టి అవన్నీ ప్రజలవే. నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంటు లేవు అంటున్నాడు…లక్ష కోట్లు లూటీ చేసి అవి పెట్టుకున్నాడు, అవీ కూడా ప్రజలవే. ఆఖరికి ఇల్లు కూడా లేదని చెప్తున్నాడు…బెంగళూరు, హైదరా బాద్, పులివెందుల, కడప, తాడేపల్లి, రుషికొండపై కట్టిన ఇళ్లన్నీ అవినీతి పునాదులపై ప్రజల డబ్బులతో కట్టిననే. రెండు నెలలు ఆగు జగన్..అక్రమ సొమ్ముతో కట్టిన ఇళ్లన్నీ జప్తు చేసి అమ్మి ప్రజలకు పంచి పెడతామని లోకేష్ స్పష్టం చేశారు.
అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్
జగన్‌ను చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తుకువస్తాడు. కోట్లు ఖర్చు పెట్టి యాత్ర-2 సినిమా చేస్తే..వైసీపీ ఎమ్మెల్యేలే పారిపోతున్నారు. వైకాపా ఎమ్మెల్యేలకు అంతిమ యాత్ర మొదలైందని హెచ్చరికలు జారీ చేస్తున్నా. జగన్ అర్జునుడు, అభిమన్యుడు కాదు..జగన్ సైకో, భస్మాసురుడు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్. జగన్ ఈ మధ్య జోకులు ఎక్కువ వేస్తున్నాడు. అందుకే జోకర్ అయ్యాడు. పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం అంటున్నాడు. లక్ష కోట్ల ఆస్తి, లక్ష రూపాయలు చెప్పులు వేసుకుని తిరిగేవాడు, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు, హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లి, ఇడుపులపాయ, విశాఖలో ప్యాలెస్ లు కట్టుకున్న వ్యక్తి పేదవాడా? రెండు నెలల్లో జగన్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరగబోతోందని లోకేష్ అన్నారు.
ఇసుకాసురుడు జగన్
జగన్ ప్రతిరోజూ ఇసుక తింటున్నాడు. రోజూ 3 కోట్లు ఇసుక ద్వారా సంపాదిస్తున్నాడు. ఐదేళ్లలో రూ. 5400 కోట్లు ప్రజాధనం లూటీ చేశాడు. టీడీపీ హయాంలో ట్రాక్టర్ వెయ్యి ఉంటే.. ఇప్పుడు రూ. 6 వేలు అయింది. ఇప్పుడు ఏ పందికొక్కు ఇసుక తింటున్నాడు? రెండు నెలలు ఓపిక పడితే అంతా కక్కిస్తా. టీడీపీ-జనసేన ప్రభుత్వంలో ఇసుక ధరలు తగ్గిస్తాం. భవన నిర్మాణ కార్మికులకు పని కల్పిస్తాం. గూగుల్ లో 6093 అని కొడితే చాలు.. జగన్ ఫోటోలు వస్తాయి. ఖైదీలంటే ఆయనకు చాలా ప్రేమ. నెలకు రూ.2వేలు ఖైదీలకు ఇస్తాడు. సంక్షేమ హాస్టల్‌లో చదువుతున్న బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు కనీసం కాస్మోటిక్స్ ఛార్జీలు కూడా చెల్లించలేదు. ఖైదీలకు చ్చే రూ.2వేలల్లో సగం కూడా ఇవ్వడం లేదు. బలహీనవర్గాల విద్యార్థులకు హామీ ఇస్తున్నా. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచుతామని లోకేష్ హామీ ఇచ్చారు.
తిరిగి విదేశీ విద్య పథకం తెస్తాం
డిగ్రీ కాలేజీల్లో చదివివేవారికి రూ.8వేలు, ఇంజనీరింగ్ కు 32 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తున్నారు. ఆయన పిల్లలు మాత్రం విదేశాల్లో చదవొచ్చు. పేద పిల్లలు మాత్రం విదేశీ చదువులకు దూరంగా ఉండాలి. టీడీపీ తీసుకువచ్చిన విదేశీ విద్య పథకాన్ని దూరం చేశాడు. రెండు నెలలు ఓపిక పడితే జగన్ మూసేసిన విదేశీ విద్య పథకాన్ని తిరిగి ప్రవేశపెడతాం. విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో మోసం చేస్తున్నాడు..వీటిని రద్దు చేసి గతంలో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని తీసుకొస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద డైరెక్ట్‌గా కాలేజీలకే డబ్బులు వేస్తామని లోకేష్ చెప్పారు.
100 సంక్షేమ పథకాలు రద్దు చేశారు
జగన్ రెడ్డి కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్. బల్ల పైన బులుగు బటన్ నొక్కి అకౌంట్ లో రూ.10 వేసి, బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ తో రూ. వంద లాగేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఇంటిపన్ను, చెత్తపన్ను పెంచి బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి బాదుడే బాదుడు. నిత్యావసర ధరలు పెంచి బాదుడే బాదుడు. బూమ్ బూమ్, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ తో లిక్కర్ రేట్లు పెంచి బాదుడే బాదుడు. రేపు వాలంటీర్ వాసు వచ్చి గొట్టం తీసుకువచ్చి పీల్చమంటాడు. పీల్చే గాలిపైనా పన్ను వేస్తాడు ఈ సైకో జగన్. ఇక జగన్ కటింగ్ మాస్టర్.. అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుకలు, విదేశీ విద్య, పండుగ కానుకలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, నిరుద్యోగ భృతి, వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు రావాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ కూడా కట్. ఇలా 100 సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని లోకేష్ దుయ్యబట్టారు.
ఎన్టీఆర్‌తోనే సంక్షేమం మొదలు
టీడీపీ`జనసేన ప్రభుత్వం వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారని వాలంటీర్లు వచ్చి చెబుతున్నారు. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగివచ్చే లోగా నిజం గడప కూడా దాటదు. అలానే ఉంటాయి జగన్ ప్రభుత్వం చెప్పే మాటలు. అసలు ఏపీకి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్ అని వారికి చెప్పాలి. ఎన్టీఆర్ రూ.2కే కేజీ బియ్యం, రూ.50కే హార్స్ పవర్ మోటార్ అందజేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. చంద్రబాబు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. పసుపు కుంకుమ, పండుగకానుక, చంద్రన్న బీమా, పెళ్లికానుక, విదేశీ విద్య లాంటి 100 సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు తీసుకువచ్చారని లోకేష్ వివరించారు.
ప్రజల కష్టాలు తీర్చేందుకే సూపర్ -6
ప్రజలు పడుతున్న కష్టాలు చూసి చంద్రబాబు-పవన్ కలిసి సూపర్ -6 హామీలు ప్రకటించారు. మొదట హామీ.. ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేం తీసుకుంటాం. ప్రతి ఏటా డీఎస్సీ ఏర్పాటుచేస్తాం. పద్ధతి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఉద్యోగం రాని వారికి అప్పటివరకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. రెండో హామీ.. స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం, ఇంటికి ఒక్కరుంటే రూ.15వేలు, ఇద్దరుంటే రూ.30వేలు, ముగ్గురుంటే ఏడాదికి రూ.45 వేలు మన ప్రభుత్వం ఇస్తుంది. మూడడో హామీ.. రైతుల్ని ఆదుకునేందుకు ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తాం. నాలుగో హామీ.. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతోంది మన ప్రభుత్వం. నాలుగో హామీ.. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు ప్రతి నెల రూ.1,500 ఇస్తాం, ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఆరో హామీ.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని లోకేష్ చెప్పారు.
ఉత్తరాంధ్ర శని జగన్
అసలు ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్. మూడు రాజధానులు పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. విశాఖను దోచుకునేందుకు మూడు కుటుంబాలకు లైసెన్స్ ఇచ్చారు. బొత్స సత్యనారా యణ, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కుటుంబాలు కలిసి దోచుకుంటున్నాయి. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు. ఇప్పుడు ఆ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని జగన్ చూస్తున్నారు. భూములు కొట్టేయడానికి చూస్తు న్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వంలో ప్రైవేటీకరణ చేయకుండా రాష్ట్రమే విశాఖ ఉక్కును కొనుగోలు చేస్తుందని లోకేష్ హామీ ఇచ్చారు.
ప్రజలే వెలగపూడి కుటుంబం
ఇక్కడి ఎమ్మెల్యే, మాస్ మహారాజా వెలగపూడి రామకృష్ణ నిరంతరం ప్రజల్లో ఉంటారు. అందుకే మీరు ఆశీర్వదించారు. 3సార్లు మంచి మెజార్టీతో గెలి పించారు. సెక్యూరిటీ ఉండదు, హంగులు ఉండవు, బుల్లెట్‌తో వీధివీధి తిరుగుతారు. ప్రజలే ఆయన కుటు ంబం. ఎక్కడా ఇలాంటి వ్యక్తి ఉండరు. హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు, రామకృష్ణబాబు కలి సి 7రోజుల్లో నగరాన్ని పునరుద్ధరించారు. కరెంట్, పాలు, కూరగాయలు అందజేశారు. విశాఖకు పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చారు. ఇక్కడి ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా చేశాం. ఎల్‌ఈడీ వీధిదీపా లు, రిటైనింగ్ వాల్స్ నిర్మించాం. ఇండోర్ స్టేడియం శాంక్షన్‌చేశాం.సింహాచలంభూముల్లో పట్టాలు ఇచ్చాం. వాటర్ ట్యాంకులు కట్టాం. పీహెచ్‌సీలు ఏర్పాటు చేశాం, ఆర్కే బీచ్, హుడా పార్క్‌ను అభివృద్ధి చేశాం. మత్య్సకారులను తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుంది. వలలు, బోట్లు, ఐస్‌బాక్స్‌లు, మోపెడ్‌లు అందించాం. అవినీతి అంటే ఏమిటో తెలియనివ్యక్తి రామకృష్ణబాబు. ఇప్పటికీ డబ్బా ఫోన్ వాడుతున్నారు. ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటారు. ఇప్పుడు కొత్త యాక్టర్ వచ్చాడు. మీ కుటుంబ సభ్యులను ఎవరు కిడ్నాప్ చేశారు, మీకే రక్షణ లేదు.. ప్రజలకేం రక్షణ కల్పిస్తారని ఆయనను ప్రజలు అడగాలి. టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్‌పై రేప్ కేసు పెట్టారు. ఎవరిని రేప్ చేయ బోయాడు? వెలగపూడిపై ఎన్నో కేసులు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో వెలగపూడిని మంచి మెజార్టీతో గెలిపించాలి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని లోకేష్ చెప్పారు.
అభివృద్ధి చేస్తాం
ఆరిలోవలో జూనియర్ కాలేజ్, మద్దిలపాలెం` హనుమంతవాక ఫ్లైఓవర్ కడతాం. భూగర్భ డ్రైనేజీ నిర్మిస్తాం. మత్స్యకార గ్రామాలను దత్తత తీసుకుంటాం. జగన్ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తామన్నారు. మనం వచ్చిన రెండేళ్లలోనే పూర్తిచేస్తాం. ఆగిపోయిన మినీ స్టేడియం, స్టేడియం పనులు పూర్తిచేస్తాం. విమ్స్ ఆసు పత్రిని అభివృద్ధి చేస్తాం, పంచ గ్రామాలు, సింహాచలం భూముల సమస్యలను పరిష్కరిస్తాం. 2019లో విశాఖ ప్రజలు మమ్మలి ఆదిరించారు. అందుకే నిరుపేద కుటుం బాలకు పక్కా గృహాలు నిర్మిస్తామని హామీ ఇస్తున్నా. షేర్ వాల్ టెక్నాలజీతో ఇళ్లు నిర్మిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. మనకు వచ్చే మెజార్టీల్లో టాప్-3లో విశాఖ ఈస్ట్ ఉండాలని లోకేష్ పిలుపు ఇచ్చారు.
టీడీఆర్ బాండ్లలో అవినీతి
టీడీఆర్ బాండ్లలో ఎంపీ విజయసాయిరెడ్డి అవినీతి కి పాల్పడుతున్నారు. విజయసాయిరెడ్డి ఇక్కడ భూము లు కొట్టేశారు. ఈస్ట్ జాలరిపేటలో, బిలాల్ కాలనీలో, మధురవాడ దగ్గర టీడీఆర్ బాండ్ల పేరుతో వైకాపా నాయకులు వేలాది కోట్లు దోచుకున్నారు. దసపల్లా భూములు కొట్టేశారు. రేపు విచారించి వడ్డీతో సహా కక్కిస్తాం.