- ప్రతిపక్ష ఎంపీల ప్రశ్నలకు పెమ్మసాని ధీటైన జవాబు
- తన శాఖలో అడిగిన వాటిపై సవివరంగా సభ ముందు..
- పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో గుంటూరు గళం
- తమిళనాడు, పశ్చిమబెంగాల్ నాయకుల నోట మాట రాలేదు
అమరావతి(చైతన్యరథం): పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుల ప్రశ్నలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధీటైన సమాధానమిచ్చారు. ఉపాధి హామీ పథకం నిధుల కేటాయింపులు, ఎన్డీయే పాలనలో జరుగుతున్న అభివృద్ధి, గ్రామమీణాభివృద్ధి శాఖకు కేటాయిస్తున్న నిధులను గణాంకాలతో సభ ముందు ఉంచడంతో విస్తుపోవడం వారి వంతయింది. ఒకానొక దశలో తరు వాత ప్రశ్న ఏం అడగాలా? అన్న ఆలోచనలో పడిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే సీనియర్ నాయకుల ప్రశ్నాస్త్రాలకు ఒంటిచేత్తో సమాధానమిచ్చి గుంటూరు మిర్చి ఘాటును రుచిచూపారు. కేరళకు చెందిన అలప్పుజ కాంగ్రెస్ ఎంపీ కె.సి.వేణుగోపాల్, తమిళనాడు పెరంబదూర్ లోక్‌సభకు చెందిన డీఎంకే ఎంపీ టి.ఆర్ .బాలు, తిరువల్లూరుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్, హిమాచల్‌ప్రదేశ్ కు చెందిన ఎంపీ అనురాగ్ సింప్‌ా ఠాకూర్ వంటి హేమాహేమి సీనియర్ నాయకులు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ప్రశ్నాస్త్రాలు సంధించారు. పెమ్మసాని స్పందిస్తూ గణాంకాలతో ఉన్నది ఉన్నట్లు సంక్షిప్తంగా వివరించారు.
ఉపాధి హామీకి ఎన్నడూ లేని విధంగా ఖర్చు
తమిళనాడుకు చెందిన పార్లమెంట్ సభ్యుడు టి.ఆర్.బాలు మాట్లాడుతూ ఏడాది కేడాది ఉపాధి హామీ నిధులు తగ్గించేస్తూ ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు ఏం చెప్పదలు చుకుందో వివరించాలని కోరారు. దీనికి పెమ్మసాని సమాధానమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 2006 – 07 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమావేశంలో రూ.11 వేల కోట్ల ను కేటాయించారు. అధికారం నుంచి దిగిపోయే సమయానికి రూ.33 వేల కోట్లు బడ్జెట్ ను కేటాయించింది. ఎన్డీయే ప్రభుత్వం ఆగమనం తరువాత ఆ కేటాయింపులను రూ.87 వేల కోట్ల వరకు తీసుకు వెళ్లింది. 2021లో రూ.61 వేల కోట్ల అంచనాలతో ప్రవేశ పెట్టిన బడ్జెట్ అనంతరం కరోనా మహమ్మారి వ్యాప్తి తరువాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరో రూ.50 వేల కోట్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.1.10 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేసింది. అనంతరం పలు రాష్ట్రాల వినతుల మేరకు రివైజ్డ్ బడ్జెట్ కింద మరో రూ.10-20 వేల కోట్లను అదనంగా అదే ఏడాదిలో కేటాయించడం ఎన్డీయే ప్రభుత్వానికి చెందుతుందని ఆ బడ్జెట్లో ప్రవేశపెట్టిన రివైజ్డ్ గణాంకాల వివరా లను వివరించారు.
అలాగే ఎన్డీయే ప్రభుత్వం హయాంలో కనీస వేతనం రూ.110 లకు పడిపోయిందన్న బాలు విమర్శలకు పెమ్మసాని ధీటుగా స్పందించారు. ‘‘యూపీఏ ప్రభు త్వం ఉండగా రూ.100లను కనీస వేతనంగా చెల్లించింది. అయితే ఎన్డీయే వచ్చిన తరువాత ఆ వేతనాన్ని సీపీఐ ప్రకారం ప్రతి ఏడాది 7 శాతం పెంచుతూ ఇప్పటివరకు 43 శాతం వరకు పెంచింది. ఎన్డీయే హయాంలో రూ.100లకు తగ్గుతుందని చెప్పడం పూర్తిగా అవాస్తవమని సమాధానమిచ్చారు. అలాగే ఉపాధి హామీ నగదును సరైన సమ యానికి ఇవ్వడం లేదని మాట్లాడడం కూడా సరికాదు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా నగదు పంపిణీ అనేది ఒక డైనమిక్ వేలో జరుగుతున్న ప్రోగ్రాం. రూ.230 కోట్లను ఖర్చుపెట్టి నోడల్ అకౌంట్స్ లేదా వ్యవసాయ కూలీల బ్యాంకు ఖాతాలకు పంపించబోతున్నాం. ఇప్పటిదాకా కేవలం రూ.700 కోట్లు మాత్రమే పెండిరగ్ ఉంది. అవన్నీ దశల వారీగా జమ అవుతూనే ఉంటాయని పెమ్మసాని చెప్పారు.
అనుకున్న దానికంటే ఎక్కువగానే నిధుల కేటాయింపు
కాంగ్రెస్ ఎంపీ సెంథిల్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ తగ్గుతూ వస్తుందని, దాని పర్యవసానం ఆ పథకం మరుగునపడే అవకాశం ఉందని వ్యాఖ్యానించగా పెమ్మసాని వివరణ ఇస్తూ ‘‘ప్రతి ఏడాది శాఖకు చెందిన రాష్ట్ర, కేంద్ర కార్యదర్శులు చర్చించుకుని, గత ఏడాది పనులను పరిశీలించి రాబోయే బడ్జెట్ అంచనా లు సిద్ధం చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లో 20 కోట్ల జనాభాకు రూ.10 వేల కోట్లను రాష్ట్రం అడిగింది. అలాగే తమిళనాడులో 7 కోట్ల జనాభాకు రూ.10 వేల కోట్లను అడిగింది. రెండు రాష్ట్రాలలో 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి గత సంవత్సరం బడ్జెట్ కంటే రూ.500 కోట్లను అదనంగా అడగగా, తమిళనాడు మాత్రం గత సంవత్సర బడ్జెట్ కంటే రూ.2500 కోట్లను అధికంగా అడిగింది. అయినప్పటికీ స్పందించిన ప్రధానమంత్రి మోదీ ఆమోదించి తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అడిగిన విధంగా బడ్జెట్‌ను కేటా యించారని వివరించారు.
జాబ్ కార్డుల రద్దు రాష్ట్రాల బాధ్యత
అనంతరం జాబ్ కార్డుల రద్దు అంశంపై ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా పెమ్మసాని బదులిస్తూ జాబ్‌కార్డు రద్దు అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండదు..అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో జరుగుతుందని చెప్పారు. అవి పూర్తిగా కొన్ని కారణాలపై ఆధారపడి ఉంటాయని వివరించారు. నకిలీ ధృవపత్రాలు, బోగస్ దరఖాస్తుదారులు ఒక పంచాయతీ నుంచి మరో పంచాయతీకి వలసలు, ఆయా గ్రామాలు పట్టణీకరణం చెందినప్పుడు లేదా సంబంధిత వ్యక్తి మరణించడం వంటి కారణాల వల్ల జాబ్ కార్డ్ అనేది రద్దు చేయబడుతుందని తెలిపారు.
గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపుల్లో 57 శాతం
మరో ఎంపీ కె.సి.వేణుగోపాల్ పార్లమెంట్‌ను ప్రశ్నిస్తూ జాబ్ కార్డ్ రద్దు పేరుతో 4.5 కోట్ల కార్డులను రద్దు చేయడం వల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోయాయో తెలుసా? ఈ రద్దుకు ఆధార్ సీడిరగ్ కార్డు కూడా ఒక కారణం అయిందా? యావత్ బడ్జెట్ కేటాయింపుల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకానికి ఎంత కేటాయిస్తున్నారు? అని అడిగారు. ఆ ప్రశ్నకు దీటుగా స్పందించిన పెమ్మసాని గారు ‘‘ఆధార్ సీడిరగ్ వల్ల జాబ్ కార్డు రద్దు అవడం జరగదు. పైగా దీనివల్ల లబ్ధిదారులకు వారి వారి బ్యాంకు ఖాతాల్లో నగదు నేరుగా జమ కావడానికి దోహదపడుతుంది. కార్డు రద్దు గురించి చెప్పాలంటే ఇంతకు మునుపు నేను చెప్పిన పలు కారణాల వల్ల తప్ప కార్డు రద్దులో కేంద్ర ప్రభుత్వం ప్రమే యం ఉండదు అని మరోసారి ఆయన గుర్తు చేశారు. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జె ట్ కేటాయింపులో పథకం కోసం ఎంత శాతం నిధులను కేటాయిస్తున్నారని, 1.43 కోట్ల జాబ్ కార్డులను రద్దు చేశారని వేణుగోపాల్ విమర్శించే ప్రయత్నం చేశారు. దీనికి స్పందిస్తూ కేటాయింపుల్లో 57 శాతం నిధులను ఉపాధి హామీ పథకానికి కేటాయిస్తున్నా మని పెమ్మసాని సమాధానం ఇచ్చారు. అలాగే 2023 – 24 సంవత్సరానికి 20 లక్షల కార్డులు అదనంగా నమోదైనట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయని వివరించారు.