టిడిపి అధికారంలోకి రాగానే పేద చర్మకారులకు సబ్సిడీ రుణాలను అందజేసి ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం కర్నూలు బస్టాండు సమీపంలో చెప్పులు కుడుతున్న చర్మకారుడు నాగన్నను కలిసిన యువనేత లోకేష్, ఆయన కష్టాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చర్మకారుడు నాగన్న మాట్లాడుతూ నేను దివ్యాంగుడిని, ప్రతిరోజు ట్రైసైకిల్ పై పందిపాడునుంచి కర్నూలు వచ్చి చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తున్నా. రోజంతా పనిచేస్తే రూ.400 వస్తాయి. పెరిగిన నిత్యవసరాలు, విద్యుత్ బిల్లులతో వచ్చే సంపాదన ఏ మూలకు సరిపోవడం లేదు.
గత నెలలో రూ.3,500 కరెంటు బిల్లు వచ్చింది, నాకువచ్చే రూ.3వేల పించనుకు మరో 500 కలిపి కరెంటు బిల్లు కట్టాను. నాకు నలుగురు బిడ్డలు ఉన్నారు. ఆడపిల్లకు పెళ్లిచేసి పంపించాను, ముగ్గురు మగపిల్లలు ఆటోతోలుకుని జీవనం సాగిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. నాగన్న కష్టాన్ని విని లోకేష్ చలిల్ఞ్చిపోయారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజలు బతకడమే కష్టంగా మారింది.
ఇప్పటివరకు 8సార్లు విద్యుత్ చార్జీలు పెంచి రాష్ట్రప్రజల నడ్డివిరిచారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యవసరాల ధరలను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు ఉపశమనం కలిగిస్తాం. మరో ఏడాది ఓపిక పట్టండి. రాబోయే చంద్రన్న ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అని లోకేష్ భరోసా ఇచ్చారు.