- గొంతు నొక్కాలనుకుంటే..యువగళం జనగళమై నినదించింది
- తప్పుడు కేసులు పెట్టినా వెన్ను చూపలేదు
- వైసీపీ అరాచకాలు ఎండగడుతూ మాటల తూటాలు
- 2024 కూటమి గెలుపులో యువగళం ప్రభావం
అమరావతి (చైతన్యరథం): యువగళం పాదయాత్రకు లభిస్తు న్న అనూహ్య స్పందనతో అనాటి ప్రభుత్వ పెద్దల్లో వణుకు మొదలైంది. భీమవరం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో వైసీపీ ముష్కర మూకలు, పోలీసులు కలిసి పసుపు సైనికులను రెచ్చగొట్టి.. తిరిగి వారిపైనే తప్పుడు కేసులు బనాయించారు. భీమవరంలో యువగళం పాదయాత్రపై సోడా సీసాలు, రాళ్లతో దాడి చేసిన వైసీపీ మూకలు.. తిరిగి 40 మంది యువగళం వాలంటీర్లపై నాన్ బెయిలబుల్ కేసులు బనా యించి రాజమండ్రి జైలుకు పంపారు, గన్నవరం నియోజక వర్గంలో విదేశాల్లో ఉన్న వారితో సహా 46 మంది కీలక నాయ కులపై తప్పుడు కేసులు పెట్టడం అప్పటి అధికార పార్టీలో యువగళం పై నెలకొన్న భయానికి అద్దంపట్టింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యువనేత ప్రచార రథం మొదలు.. నిలబడే స్టూల్ వరకు అన్నీ లాగేసి గొంతునొక్కే ప్రయత్నం చేశారు. యువనేత లోకేష్ ఏ మాత్రం వెన్ను చూపకుండా కోట్లాదిమంది ప్రజల గొంతుకనే తన గళంగా వినిపిస్తూ రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగారు.
ప్రతి 20 కిలోమీటర్లకూ ఒక కేసు
కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభం మొదలు తంబళ్లపల్లి నియోజకవర్గం వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తంగా 25 పోలీసు కేసులు నమోదయ్యాయి. ఇందులో యువనేత లోకేష్పై మూడు కేసులు నమోదు చేశారు. ప్రచార రథం, సౌండ్ సిస్టమ్, మైక్, స్టూల్తో సహా అన్నింటినీ పోలీసులు సీజ్ చేశారు. ఎంతలా వేధించినా, ఎన్ని తప్పుడు కేసులు బనాయించినా క్రమశిక్షణకు మారుపేరైన లోకేష్ నేతృత్వంలో యువగళం బృందాలు మొక్క వోని పట్టుదలతో ముందుకు సాగాయి. యువగళాన్ని స్వాగతి స్తూ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించడం, రాళ్లు రువ్వ డం, కవ్వించడం నాటి -అధికార పార్టీ మానలేదు. యువగళం వెనకడుగు వేయలేదు.
అడ్డంకులు సృష్టించినా అడుగు ముందుకే..
ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి తూర్పుగోదావరి వరకు యువ గళం పాదయాత్రను అడ్డుకునేందుకు అధికార పార్టీ చేయని కుట్రలు లేవు. యజ్ఞంలా సాగుతున్న యువగళాన్ని అడ్డుకోవడం వైసీపీ ముష్కర మూకల వల్ల కాలేదు. చైతన్యానికి మారుపేరైన విజయవాడ వంటి నగరంలో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తెల్లవారుజాము వరకూ ఎదురుచూడటం యువనేత లోకేష్పా నెలకొన్న అభిమానం, నమ్మకానికి అద్దం పట్టింది. యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటకముందే -రాష్ట్రంలో 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతునిచ్చిన అభ్యర్థులు విజయ దుందుభి మోగించడంతో అధికార పార్టీకి అప్పుడే కౌంట్ డౌన్ మొదలైంది.
మాటల తూటాలు.. గెలుపు బాటలు
యువనేత లోకేష్ తాను పాదయాత్ర నిర్వహించే అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభలు నిర్వహించి తూటాలతో నాటి అరాచక పాలకులకు కంటిమీద కునుకు లేకుండా మాట ల చేశారు. యువగళం పాదయాత్ర సాగిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70 చోట్ల యువనేత లోకేష్ బహిరంగ సభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో జగన్రెడ్డి పాలనా వైఫల్యాలు, దోపిడీ విధానాలను ఎండగట్టడమే గాక ప్రతి బహిరంగసభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల అవినీతిని ఆధారాలతో సహా బట్టబయ లు చేయడంతో అధికార పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టాయి. సమాధానం చెప్పలేని అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూష ణలతో ఎదురుదాడికి దిగారు. అయినా తగ్గేది లేదంటూ లోకేష్ సై అంటే సై అన్నారు. యువగళం పాదయాత్ర ప్రభావం 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఓట్ల వర్షం కురిపించి 94 శాతం స్ట్రయిక్ రేటుతో 164 సీట్లు గెల్చుకునేలా చేసింది.















