- ఎవరి కళ్లలో ఆనందం చూడటానికి ఈ ప్రకటనలు… ఎంతకాలమీ బెదిరింపులు?
- ప్రైవేటు ల్యాబ్ రిపోర్టు ప్రామాణికం కాదంటూనే వారికి ఎలా మెయిల్ పెట్టారు?
- కేసును సిఐడికి ఇవ్వకుండా ఏ హోదాలో ఎక్లిప్స్ తో ఉత్తర,ప్రత్యుత్తరాలు చేశారు?
- ఐపిఎస్ అధికారి అయిన మీకు సెక్షన్ 290, 294, 506, 590ల గురించి తెలియదా?
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
గత మూడేళ్లుగా జగన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడటం కోసం రూల్ ఆఫ్ లా ను పక్కనబెట్టి తాడేపల్లి ప్యాలెస్ సేవలో తరిస్తున్న సిఐడి చీఫ్ సునీల్ కుమార్ సడన్ గా గురువారం రాష్ట్ర సచివాలయంలో మీడియా ముందుకు వచ్చి అశ్లీల వీడియోను బయటకు తెచ్చిన ప్రతిపక్షాలపై కేసులు పెడతామని సంకేతాలు ఇవ్వడం దిగజారిపోయిన ఆయన వైఖరికి అద్దంపడుతోంది. ఒక సీనియర్ పోలీసు అధికారిగా మోరల్ కోడ్ ఆప్ కాండక్ట్ కు కట్టుబడి నిష్పాక్షికంగా మాధవ్ వ్యవహారంలో దర్యాప్తు చేయకపోగా, నిజానిజాలను వెలికితీసిన ప్రతిపక్షాన్ని బెదిరించడం ఆయన నిజస్వరూపాన్ని తెలియజేస్తోంది. విలేకరుల సమావేశంలో మాధవ్ ఇచ్చిన స్టేట్ మెంట్ వివరాలు, రాష్ట్ర ప్రజానీకం, మహిళాలోకంలో నెలకొన్న ప్రశ్నలను మీ ముందుంచుతున్నాం.
సిఐడి చీఫ్ సునీల్ కుమార్‌కు సూటి ప్రశ్నలు
1). అమెరికాకు చెందిన ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ సంస్థ అనేది ఒక ప్రైవేట్ ల్యాబ్, దానికి ఏవిధమైన అధికారిక గుర్తింపు,అనుమతి లేని సంస్థ, దాని నివేదికను పరిగణనలోకి తీసుకోలేము.
ప్రశ్న: ఎక్లిప్స్ ఫోరెన్సిక్ సంస్థ ప్రైవేట్ ల్యాబ్ అని, దానికి అధికారిక గుర్తింపు లేదని చెబుతున్న సునీల్ కుమార్ ఆ సంస్థ ఇచ్చిన నివేదికపై వివరణ కోసం ఏవిధంగా సంప్రదింపులు చేశారు?
2). ఎక్లిప్స్ ల్యాబ్స్ కు చెందిన జిమ్ స్టాఫర్డ్ పంపినట్లుగా సిఐడి సునీల్ కుమార్ విడుదల చేసిన ఈ-మెయిల్ లేఖలో రిఫరెన్స్ లో ‘‘ మీ పేరుపై సర్క్యులేషన్ అవుతున్న ఫేక్ సర్టిఫికేట్ గురించి’’ అని ఉంది.
ప్రశ్న: సునీల్ కుమార్ జిమ్ స్టాఫర్డ్ కు లేఖరాసేటప్పుడే ఫేక్ సర్టిఫికేట్ గురించి అని లేఖ రాయడం వెనుక అంతర్యమేమిటి? దీనినిబట్టి జిమ్ స్టాఫర్డ్ కు క్లారిఫికేషన్ కు కోసం సునీల్ కుమార్ పంపిన నివేదికలో వారే మార్పులు చేయలేదన్న గ్యారంటీ ఏమిటి? (సునీల్ కుమార్ విలేకరుల సమావేశంలో ఫుల్ స్టాఫ్, కామాలు మార్పినప్పటికీ అర్థాల మారతాయి అని చెప్పడం గమనార్హం.)
3). జిమ్ స్టాఫర్డ్ రాసినట్లు సునీల్ కుమార్ విడుదల చేసిన లేఖలో ఒరిజినల్ రిపోర్టు ఎటాచ్ చేసినట్లుగా స్పష్టంగా ఉంది.
ప్రశ్న: జిమ్ స్టాఫర్ట్ పంపిన ఆ ఒరిజినల్ నివేదికను సునీల్ కుమార్ మీడియాకు ఎందుకు విడుదల చేయలేదు.
4). మీడియాలో సర్క్యులేషన్ అవుతున్న వీడియో అసలైనది కాదు, ఆ వీడియో సర్క్యులేషన్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న: మీరు విడుదల చేసిన జిమ్ స్టాఫర్డ్ లేఖలోనే ఆ వీడియో అన్ అథెంటిక్ అండ్ అన్ ఎడిటెడ్ అని ఉన్న మాట వాస్తవం కాదా? దీనిని బట్టే అది నిజమైనది అని తేలిపోలేదా.. ఇంకా అధికారపార్టీ నేతను రక్షించడానికి ఇంకా ఎన్ని తప్పులు చేయాలనుకుంటున్నారు? ఒక పోలీసు అధికారిగా సమాజానికి చేటు కలిగించే ఒక వీడియో బయటకు వచ్చినపుడు ఆధారాలను సేకరించి దానిపై సత్యశోధన చేసి నిజానిజాలు నిగ్గుతేల్చాల్సిన బాధ్యత మీపై లేదా? అవేమీ చేయకుండా వీడియో సర్క్యులేట్ చేసిన వారిపై చర్య తీసుకుంటామని బెదిరించడం ఏమిటి?
5). ఈ కేసులో బాధితులెవరూ తమకు ఇబ్బంది తలెత్తిందని ఫిర్యాదు చేయలేదు?
ప్రశ్న: సిఆర్ పిసి – 1973 ప్రకారం ఒక క్రిమినల్ నేరాన్ని వ్యక్తికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా హాని కలిగించే గాయంగా పరిగణించబడుతుంది. ఇటువంటి వీడియోలు బయటకు వచ్చినపుడు ఐపిసి సెక్షన్ 290 (పబ్లిక్ న్యూసెన్స్), 294 (ఎగ్జిబిషన్ ఆఫ్ అబ్ సీన్ యాక్ట్), 506 (క్రిమినల్ ఇంటిమినేషన్), 590 (ఎక్స్ పోజింగ్ అబ్ సీన్ ఆబ్జెక్ట్స్, అబ్ సీన్ వర్డ్స్ యాక్ట్ టు ఉమెన్), ఐటి సెక్షన్ కింద ప్రకారం సుమోటోగా కేసు నమోదుచేసి విచారణ జరపాలని సీనియర్ పోలీసు అధికారి అయిన మీకు తెలియదా?
6). జిమ్ స్టాఫోర్డ్ ఇచ్చిన ధృవీకరణ పత్రం కూడా అసలైనది కాదు. దీన్ని స్వయంగా జిమ్ క్లిఫర్డ్ ఆ అంశాన్ని ధృవీకరించారు.
ప్రశ్న: మీరు చెప్పేదే నిజమైతే స్టాఫోర్డ్ పంపినట్లుగా మీరు చెబుతున్న ఈ మెయిల్ కింద భాగంలో ఒరిజినల్ రిపోర్టు జతచేస్తున్నట్లుగా ఉంది. ఆ నివేదిక ఎందుకు బయటపెట్టలేదు?
7). పోతిన ఎక్లిప్స్ ల్యాబ్ ను ఫోరెన్సిక్ నివేదిక కావాలని అడగలేదు.
ప్రశ్న: ఫోరెన్సిక్ సంస్థను ఎవరైనా బిపి, సుగర్ ఫలితాలు కావాలని అడుగుతారా? ఒక వీడియో పంపి అది నిజమైనదో, కాదో చెప్పాలని నిర్ణీత రుసుం చెల్లించి అడగడం ఫోరెన్సిక్ నివేదిక కోరినట్లు కాదా?
8).రాజమౌళి సినిమా లో పులులు సింహాలును ఫోన్ ద్వారా తీసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపితే అది ఒరిజినల్ గానే చెబుతారు? మహిళ – పురుషుడి మధ్య జరిగిన అసలు వీడియో సంభాషణను తనిఖీ చేస్తే మాత్రమే అది అసలైనదా లేక మార్ఫింగ్ చేశారా అని చెప్పగలం.
ప్రశ్న: ఏదేని ప్రాంతంలో హత్య లేదా అవాంఛనీయ సంఘటన జరిగినపుడు ఎవరూ ఫిర్యాదు చేయలేదు కదా అని వదిలేయడం బాధ్యతను విస్మరించడం కాదా? చిన్న క్లూ దొరికి శోధించి నిజాలు నిగ్గుతేల్చాల్సిన మీరు..మహిళల ఆత్మగౌరవంతో కూడి ఒక వీడియో బయటకు వస్తే ఒరిజినల్ వీడియో కోసం కనీస ప్రయత్నం చేయకపోగా, వీడియో లేదనే సాకుతో నిందితులను కాపాడాలని చూడటం దారుణం కాదా?
మాధవ్ కేసును సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా లేని ఈ కేసులో మీ అంతట మీరుగా ఎక్లిప్స్ ల్యాబ్ ను ఏ కేసు ఆధారంగా, ఏ హోదాలో క్లారిఫికేషన్ అడిగారు, మీ వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు? నిబంధనల ప్రకారం డీజీపీ అనుమతి లేకుండా సిఐడి కేసు స్వీకరించదు. మీరు ఏ హోదాలో ఎక్లిప్స్ సంస్థను క్లారిఫికేషన్ కోరారు?
ఇటువంటి ఒక ఘటన నాలుగుగోడల మధ్య జరిగినా శిక్షార్హమే అవుతుంది, సుమోటోగా స్వీకరించాలని సీనియర్ పోలీసు అధికారులు చెబుతండా.. మీ విద్యుక్త ధర్మాన్ని పాటించకుండా ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టమని ఏ రూల్ మీకు చెబుతోంది?