- నరేంద్ర అరెస్టు విషయంలో సిఐడి ప్రకటన అబద్దాల పుట్ట0
- ఎడిజి సునీల్ కుమార్‌ను ఆ పోస్టు నుంచి తొలగించాలి
- నిప్పులు చెరిగిన చంద్రబాబునాయుడు
అమరావతి: ఎపి సిఐడి చీఫ్, అడిషనల్ డిజీ సునీల్ కుమార్‌ను ఆ పోస్టునుంచి వెంటనే తొల గించి.. సిఐడి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. సిఐడి విభాగాన్ని జగన్ జేబు సంస్థగా మార్చి రాజకీయ వేధింపులు, దాడులకు వాడుతున్న సునీల్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టిడిపి మీడియా కో ఆర్డినేటర్ నరేంద్ర అరె స్టుపై సిఐడి ప్రకటన అబద్దాల పుట్ట అని చంద్రబాబు మండిపడ్డారు. ఎయిర్ పోర్ట్‌లో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారం దొరికింది వాస్తవం కాదా.. దానిపై సోషల్ మీడియా పోస్టును పార్వర్డ్ చేస్తే రాత్రికి రాత్రి అరెస్టు చేయడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. ఇదే కేసులో జర్నలిస్ట్ అంకబాబును అరెస్టు చేస్తే.. అది అక్రమమని కోర్టు చెప్పినా..ఇప్పుడు అదే కేసులో నరేంద్రను అరెస్టు చేయడం నిబంధనలు ఉల్లం ఘించడం కాదా అని ప్రశ్నించారు. 41ఎ నోటీసు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సిఐడి కస్టడీ లో నరేంద్రను దారుణంగా హింసించారని..ఇంత దారుణాలకు ఒడిగడుతున్న అధికారులు రేపు అనేది ఉంటుందని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. నరేంద్ర ను టార్చర్ పెట్టిన పోలీసులు తగిన మూల్యం చెల్లిం చుకోకతప్పదని చంద్రబాబునాయుడు హెచ్చరించారు.