శాన్‌ఫ్రాన్సిస్కో/యూఎస్‌ఏ (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని ఓప్స్ ర్యాంప్ (ops
ramp) సీఈవో వర్మ కూనపునేని కి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ శాన్‌ఫ్రాన్సిస్కోలో వర్మ కూనపునేనితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఏపీలో స్మార్ట్ సిటీలు, డిజిటల్ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్‌ల కోసం ఐటీ మౌలిక సదుపాయాల ఆధునీకరణకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఏఐ ఓప్స్ శిక్షణ, ఇంటర్న్ షిప్‌లు, ఆర్ అండ్ డి సహకారం కోసం ఏపీ టెక్ అకడమియాతో భాగస్వామ్యం వహించండి. స్కేలబుల్ ూaaూ మోడల్స్ ద్వారా ఐటీి కార్యకలాపాల నిర్వహణతోపాటు ఏపీలో ూవీజులు, స్టార్టప్‌లను ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనిపై ఓప్స్ ర్యాంప్ సీఈవో వర్మ మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థకు 500కు పైగా సంస్థలు కస్టమర్లుగా ఉన్నాయన్నారు. వీటిలో ఫైనాన్స్, హెల్త్‌కేర్, రిటైల్, టెక్నాలజీలో పాటు ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఉన్నాయి. భారతదేశంలోని బెంగళూరు, హైదరాబాద్‌లో ప్రధాన కేంద్రాల ద్వారా ఏఐ ఓప్స్, క్లౌడ్ నేటివ్ మానిటరింగ్‌లో ఆవిష్కరణలను ముందుకు తెస్తున్నామని తెలిపారు. ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని వర్మ పేర్కొన్నారు.












