- అడ్డుకోవాలన్న సీఐడీ అభ్యర్థన తిరస్కరణ
- చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా
- క్వాష్ పిటిషన్‌పై తీర్పు వచ్చిన తరువాతే విచారణ చేపడతామని స్పష్టీకరణ
- డిసెంబర్ 8 లోగా కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు నోటీసులు
న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటి షన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచా రణ జరిగింది. డిసెంబర్ 8 లోపు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు నోటీసు లు జారీ చేసింది. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలన్న సీఐడీ అభ్యర్థనను తోసిపుచ్చింది. స్కిల్ డెవ లప్‌మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పువచ్చినతరువాత టీడీపీ అధి నేత బెయిల్ రద్దు కేసు వింటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయ ర్యాలీ లు,సభలు, సమావేశాలు నిర్వహించకుండా చంద్రబాబును కట్టడి చేయాలన్న సీఐడీ అభ్యర్ధనను సుప్రీం తిరస్కరించింది. స్కిల్ కేసు గురించి మాత్రమే చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యలు చేయరాదని సుప్రీం తేల్చిచెప్పింది. ఇరుపక్షాలూ స్కిల్ కేసు గురి ంచి బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయరాద ని పేర్కొంది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి చంద్ర బాబుకు అనుమతినిచ్చింది. అలాగే మధ్యం తర బెయిల్ సమయంలో ఏపీ హైకోర్టు విధించిన షరతులను కొనసాగించాలన్న సీఐడీ అభ్యర్ధనకు కూడా న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఈ నెల 20వ తేదీన ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయగా, దానిని సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది