అమరావతి: తెలుగుదేశం పార్టీ నిర్ణయం మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యే లపై అనర్హత పిటిషన్ ఇచ్చామని, వారిపై చర్యలు తీసుకోవాలని శాసన సభ స్పీకర్‌ను పార్టీ అధినేత చంద్ర బాబు కోరారు. వైకాపాలో చేరిన తెదేపా ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిని అనర్హులుగా ప్రకటించాలని ఇప్ప టికే పార్టీ విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి పిటిషన్ వేశారు. డోలా ఇచ్చిన అనర్హత పిటిషన్‌పై శాసనసభ స్పీకర్… తెదేపా అధినేత అభిప్రాయం కోరారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని చంద్ర బాబు స్పీకర్‌కు తెలియజేశారు. పార్టీ నిర్ణయం మేరకే అనర్హత పిటిషన్ ఇచ్చా మని, చర్యలు తీసుకోవాలి స్పీకర్‌కు బదులిచ్చారు.