• మార్కాపురం నియోజకవర్గం తలమళ్ల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలోని చిన్నచెరువు, పెద్దచెరువుకు మూసి వాగు నుండి నీరు లిఫ్ట్ ఏర్పాటు చేయాలి.
• దీనివల్ల గ్రామంలోని రైతులు వరిపంట పండించడానికి అవకాశమేర్పడుతంది.
• గ్రామంలో పూర్తిస్థాయిలో సైడ్ డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి.
• చుట్టుప్రక్కల గ్రామాలన్నిటికీ నీటి కుళాయిలు ఉన్నాయి. మా గ్రామానికి లేవు.
• మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చిన్ననీటి వనరులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
• గత టిడిపి ప్రభుత్వ హయాంలో నీరు – ప్రగతి కార్యక్రమం కింద రూ.18,265 కోట్లు వెచ్చించాం.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తలమళ్ల చెరువులకు నీరు అందేలా చర్యలు తీసుకుంటాం.
• గ్రామంలో ఇంటింటికీ కుళాయిలు అందజేసి, స్వచ్చమైన తాగునీరు అందజేస్తాం.
• రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.