- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అగ్రరాజ్యానికి యువగళం రథసారధి
- 25నుంచి ఐటీ మంత్రి లోకేష్ అమెరికా పర్యటన
- ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు
- 29న ఐటీ సర్వ్ సినర్జీలో లోకేష్ కీలకోపన్యాసం
అమరావతి (చైతన్య రథం): ఐదేళ్లపాటు పడకేసిన పారిశ్రామికరంగాన్ని తిరిగి గాడిలోపెట్టి, పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈనెల 25నుంచి వారంపాటు అమెరికాలో పర్యటించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించి రాష్ట్రంలోని కోట్లాది యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే పర్యటన ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా 29న లాస్ వేగాస్లోని సీజర్స్ ప్యాలెస్‌లో ఐటీ సర్వ్ అలయెన్స్ సంస్థ ‘‘సినర్జీ’’ పేరిట నిర్వహించే కీలకమైన వార్షిక సమావేశానికి మంత్రి లోకేష్ విశిష్ట అతిధిగా హాజరుకానున్నారు. సమావేశానికి ఐటీ సేవల పరిశ్రమ నుంచి 3వేల చిన్న మరియు మధ్యతరహా పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. సినర్జీ 2024 అనేది ముఖ్యంగా ఐటీలో ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, కీలక వాటాదారులను ఒకచోట చేర్చడానికి రూపొందించిన ప్రధాన సదస్సు. యుఎస్ మాజీ అధ్యక్షులు జార్జి డబ్ల్యు బుష్, బిల్ క్లింటన్, సెక్రటరీ హిల్లరీ క్లింటన్, స్టీవ్ ఫోర్బ్స్, కెవిన్ ఓ లియరీ, షీలా బెయిర్ (ఎఫ్‌డీఐసీ చైర్), జాక్ కాస్ (ఓపెన్ ఏఐ)వంటి గౌరవనీయ స్పీకర్లను సినర్జీ హోస్ట్ చేస్తుంది. ఏపీ ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రిగా పాలనలో సాంకేతికను జోడిరచి డిజిటల్ విధానాలను అమలు చేస్తున్న మంత్రి లోకేష్‌ను విశిష్ట అతిధిగా ఆహ్వానిస్తున్నట్లు సినర్జీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సాంకేతిక రంగాల్లో కీలక వ్యక్తిగా, డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, స్టార్ట్-అప్‌లకు మద్దతివ్వడంలో మీ చొరవ ఆర్థికాభివృద్ధిలో ఒక బెంచ్‌మార్క్‌ను ఆవిష్కరించిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పాలనలో సాంకేతికత పాత్ర, యువత, వ్యవస్థాపకుల సాధికారతపై సినర్జీ సమావేశంలో మీరిచ్చే విలువైన సందేశం ఔత్సాహితులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఐటి సర్వ్ అలయెన్స్ సంస్థ మంత్రి లోకేష్‌కు పంపిన ఆహ్వానపత్రంలో పేర్కొంది. అమెరికా కాలమానం ప్రకారం రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన వివరాలిలా ఉన్నాయి.
అక్టోబర్ 25న శాన్ఫ్రాన్సిస్కోలో ఒరాకిల్ ప్రతినిధులతో భేటీ. అనంతరం పెట్టుబడిదారులు, ఎంటర్‌ప్రెన్యూర్స్‌తో సమావేశం. 26న పత్ర, సినర్జీస్, బోసన్, స్పాన్ ఐఓ, క్లారిటీ సంస్థల ప్రతినిధులతో భేటీ. అనంతరం భారత కాన్సులేట్ జనరల్‌తో భేటీ అవుతారు. ఎడోబ్, స్కేలర్, జనరల్ అటమిక్స్ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. 27న ఆస్టిన్లోని పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. 28న తిరిగి శాన్ఫ్రాన్సిస్కో రెడ్‌మండ్‌లో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో భేటీ అవుతారు. 29న లాస్‌వెగాస్‌లో నిర్వహించే ఐటి సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరవుతారు. అమెజాన్, రేవాచర్, సేల్స్ ఫోర్స్, పెప్సికో ప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం ఐటి సర్వ్ సినర్జీ సదస్సులో కీలకోపన్యాసం చేస్తారు. 30న శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్యాంపస్ సందర్శిస్తారు. అనంతరం స్టార్టప్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్‌తో భేటీ అవుతారు. ఇండియన్ సిజి, కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ సమావేశానికీ హాజరవుతారు. అనంతరం సేల్స్ ఫోర్స్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు. 31న జార్జియా కుమ్మింగ్స్‌లోని శానిమౌంటేన్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 1న న్యూయార్క్‌లో పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహిస్తారని మంత్రిత్వశాఖ అధికార్లు వెల్లడిరచారు.