విజయవాడ: టిడిపి కార్యకర్తపై వైసిపి మాజీ మంత్రి కొడాలి నాని పిఎ లక్ష్మోజీ దాష్టీకానికి నిరసనగా నిరాహారదీక్ష చేపట్టిన టీడీపీ పామర్రు ఇన్ఛార్జి వర్ల కుమార రాజాను తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు టిడి జనార్దన్ మంగళవారం పరామ ర్శించారు. విజయవాడ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమార్ రాజా ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసిన జనార్దన్.. అధికారపార్టీ జులుంపై పోరాటం కొనసాగించాలని పార్టీ యావత్తు మీకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. మూడు రోజులు నిరాహార దీక్ష చేయగా, పొలీసులు భగ్నం చేసిన విషయం విదితమే.