- బీసీల ఆకాంక్షలకు, చంద్రబాబు ఆలోచనల జోడింపు
- యనమల నేతృత్వంలో 15 మంది సభ్యుల కమిటీ కసరత్తుతో డిక్లరేషన్
- బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం, బీసీ కులగణన సహా పలు అంశాలు
- జగన్ దుర్మార్గపు పాలనలో దెబ్బతిన్న బీసీలను తిరిగి ఉన్నతస్థానానికి తీసుకెళ్లటమే ధ్యేయం
- 5న జరిగే సభకు బీసీలు
- భారీ సంఖ్యలో తరలిరావాలని కొల్లు పిలుపు
అమరావతి(చైతన్యరథం): టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ నెల 5వ తేదీన పార్టీ తరఫున బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బలహీన వర్గాల అభ్యున్నతి, రక్షణే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ‘జయహో బీసీ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, బీసీ నాయకులు, స్థానిక ప్రజల అభిప్రా యాలు, ఆకాంక్షలు తెలుసు కుందన్నారు. వాటన్నిం టినీ క్రోడీకరించి, పార్టీ అధినేత ఆలోచనలను జోడించి బీసీల కోసం టీడీపీ ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించనుందన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం బీసీ నేతలతో కలిసి కొల్లు రవీంద్ర విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన నాగార్జున విశ్వవిద్యాలయం సమీపం లో నిర్వహించే బీసీ మహాసభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని వెల్లడించారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీసంఖ్యలో బీసీ సోదర, సోదరీమణులు హాజరై బీసీ మహాసభను విజయవంతం చేయాలని కోరారు.
ఎన్టీఆర్ తోనే రాజకీయాల్లో గుర్తింపు…
బలహీనవర్గాలతో మమేకమై, వారి కష్టసుఖాలు తెలుసుకొని వారికి ఏం చేయాలో.. ఏం చేస్తే వారు ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగగలరో ఆలోచించిన తర్వాతే టీడీపీ తరుపున బీసీలకు ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించబోతున్నాం. టీడీపీ ప్రకటించే బీసీ డిక్లరేషన్ స్వయంగా బలహీనవర్గాలు తయారుచేసుకు న్నదే. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీసీలకు మంచి గుర్తింపు వచ్చిందనేది కాదనలేని వాస్తవం. ఆనాడు మహాను భావుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీనవర్గాలకు 24 శాతం రిజర్వేషన్లు కల్పించారు. బీసీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకుల పాఠశా లలు ఏర్పాటు. చేశారు. ఆయన బాటలోనే చంద్రబాబు నాయుడు బీసీల్ని రాజకీయంగా మరింత పైకి తీసుకురావాలనే సదుద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 34 శాతానికి పెంచారు.. ఆదరణ పథకం తీసుకొచ్చి, బీసీ యువతకు ఆర్థికంగా అండగా నిలిచారు. బీసీ విద్యార్థులు, బీసీ యువత కోసం అనేక పథకాలు అమలుచేశారని కొల్లు చెప్పారు.
బీసీలపై కక్షగట్టిన జగన్…
జగన్రెడ్డి అధికారంలోకి వచ్చీ రాగానే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో బీసీలకు అమలు చేసిన అన్ని పథకాల్ని రద్దుచేశారు. దాదాపు 30కి పైగా బీసీల పథకాల్ని రద్దు చేయడమే గాక, బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారన్న అరుసుతో పై అక్కసుతో ఈ ముఖ్యమంత్రి ఎందరో బీసీలను పొట్టన పెట్టుకున్నాడు. తెలుగుదేశం పక్షాన నిలుస్తున్నారన్న అక్కసుతో బీసీలపై కక్ష కట్టిన జగన్ రెడ్డి… టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడినే తప్పుడు కేసులతో జైలుకు పంపాడు. నాపై, అయ్యన్నపాత్రుడిపై, యనమల రామకృష్ణుడిపై తప్పుడు కేసులు పెట్టి వేధించాడు. గ్రామ, మండలస్థాయి బీసీ నాయకుల్ని, కార్యకర్తల్ని కిరాతకంగా చంపించాడు. 57 నెలల జగన్ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయం, వంచన మాటల్లో వర్ణించలేనిది. ఇవన్నీ సాటి బీసీ సోదరులకు తెలియచేసి, పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా బీసీ నాయకుల అభిప్రాయాలు సేకరించి, వారి ఆలోచనలు తెలుసుకున్నాం. మండల స్థాయిలో 850 జయహోరా బీసీ సమావేశాలు నిర్ణయించాం. ఆ సమావేశాలకు హాజరైన ప్రతి బీసీ సోదరుడి అభిప్రాయం తెలుసుకున్నామని కొల్లు తెలిపారు.
యనమల నేత్రత్వంలో కమిటీ
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం నిర్వహించిన జయహోూ బీసీ కార్యక్రమానికి బలహీనవర్గాల నుంచి అనూహ్యమైన స్పందన వ్యక్తమైంది. సదరు కార్యక్రమం ద్వారా తెలుసుకున్న అంశాలన్నింటినీ క్రోడీకరించి, అధినేత చంద్రబాబు ఆలోచనలను జోడించి, బీసీ డిక్లరేషన్ రూపొందించటం కోసం సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడి నేత్రత్వంలో 15 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రూపొందించిన బీసీ డిక్లరేషన్ను 5వ తేదీన చంద్రబాబు ప్రకటిసారు. రాష్ట్రసాయిలో బీసీలకు జాతీయస్థాయి చేయూత ప్రకటించబోతున్నా 6/17 ప్రకటన, విచ్చేయుచున్న చంద్రబాబుకి బీసీల తరఫున కొల్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
తాడేపల్లి ప్యాలెస్ కంపించాలి…
5న మంగళగిరి సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న బహిరంగ ప్రదేశంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే జయహెూ బీసీ డిక్లరేషన్ మహాసభకు బీసీలంతా ప్రభంజనంలా తరలిరావాలి. బీసీల నినాదాలతో తాడేపల్లిప్యాలెస్ కంపించిపోవాలి. డిక్లరేషన్లో ప్రధానంగా 6 నుంచి 7 అంశాలుంటాయి. బీసీల్లోని అన్నివర్గాలకు అండగా నిలిచేలా టీడీపీ బీసీ డిక్లరేషన్ ఉంటుంది. అలానే మా పార్టీ తరుపున ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్ కూడా ఉంటాయి. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పాటు, ఎన్నికల కోసం జగన్ రెడ్డి చేస్తున్న బీసీ కులగణన మాదిరి కాకుండా… బీసీలకు ఉపయోగపడేలా, వారు మెచ్చేలా చిత్తశుద్ధితో టీడీపీ ప్రభుత్వం కులగణన ఎలా చేపట్టనుందో కూడా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం డిక్లరేషన్ ద్వారా ప్రకటిస్తామని కొల్లు తెలిపారు.