- వెనుకబడినవర్గాల సొంతిల్లు తెలుగుదేశం
- బిసి నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు జగన్ కుట్ర
- బిసి కులాల సమస్యలపై అధ్యయానికి ప్రణాళిక
- టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
- కేంద్ర కార్యాలయంలో సాధికార కమిటీ కన్వీనర్లతో యువనేత భేటీ
అమరావతి : టిడిపి-బిసిలది విడదీయరాని బంధమని, బల హీనవర్గాల పునాదులపైనే తెలుగుదేశంపార్టీ ఆవిర్భ వించిందని తెలుగుదేశంపార్టీ జాతీయప్రధాన కార్య దర్శి నారా లోకేష్ అన్నారు. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన బీసీ సాధికారకమిటీ కన్వీనర్లతోపార్టీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ గురువారం సమావేశమయ్యారు. బీసీల్లో ఉన్న అన్ని కులాలకు ప్రాతినిధ్యం, కులాల వారీగా సమస్యల అధ్యయనంపై ప్రణాళిక, జగన్ పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, ఉద్యమ కార్యాచరణ, సాధికార కమిటీల ఏర్పాటు, బలోపేతం పై సమావేశంలో చర్చించారు. కార్యక్రమానికి అతిధు లుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీసీ సెల్‌అధ్యక్షుడు కొల్లు రవీంద్ర,శాసనమండలి సభ్యుడు దువ్వారపు రామారావు, హెచ్‌ఆర్‌డి విభాగం చైర్మన్ రామాంజనేయులు, పొలిట్‌బ్యూరో సభ్యుడు టిడి జనా ర్ధన్, 54బిసి సాధికార కమిటీ కన్వీనర్లు హాజరయ్యా రు.ఈసందర్భంగా లోకేష్ మాట్లాడుతూ బడుగు, బల హీనవర్గాల అభివృద్ధికి పాటుపడిన అంబేద్కర్, మహా త్మా పూలేస్ఫూర్తితో ఎన్టీఆర్ తెలుగుదేశంపార్టీని స్థాపిం చారని అన్నారు. బిసిల సమస్యలపై అధ్యయనానికి ప్రత్యేకకమిటీ ఏర్పాటుచేస్తామని తెలిపారు.
బిసిల సొంతిల్లు తెలుగుదేశం
బీసీల సొంత ఇల్లు లాంటిది తెలుగుదేశం పార్టీ. 40 ఏళ్ల టిడిపి చరిత్రలో బీసీలకు అత్యున్నత స్థానం కల్పించింది. రాజకీయ, ఆర్థిక, విద్య, రంగాలలో బీసీ లకు ప్రాధాన్యత ఇచ్చాం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలుతో లక్షలాదిమంది బీసీ యువతని రాజకీయ నాయకులుగా పదవులు కట్టబెట్టిన ఘనత తెలుగుదే శానిదే.34% రిజర్వేషన్లు 26ఏళ్లపాటు అమల్లో ఉండా నికి కారణం టిడిపి. బీసీ రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గ డానికి కారణం జగన్‌రెడ్డి. బీసీ ద్రోహి జగన్‌రెడ్డి వలన 16,800 మంది బీసీలు ఎన్నికల్లో పోటీ చేసే అవకా శం కోల్పోయారు.ఎన్టీఆర్ బాటలో చంద్రబాబు తెలుగు దేశం జెండాని బీసీలకు అండగా నిలిపారు. చంద్రబా బు బీసీ కమిషన్ ఏర్పాటు చేసారు. బీసీలకు సబ్ ప్లాన్ తీసుకొచ్చింది తెలుగుదేశమే. ఒక్కఛాన్స్ పేరుతో జగ న్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారు. బాబాయ్‌పై గొడ్డ లి వేటు వేసినట్టే వెనుక బడిన తరగతులకు వెన్నుపోటు పొడిచారు. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అంటూ బిల్డప్ ఇచ్చిన జగన్‌రెడ్డి బీసీల బ్యాక్‌బోన్ విరిచేసాడు. నిధులు ఉన్న వెయ్యి ముఖ్య పదవులు తన బంధువులకు, తన సామాజిక వర్గానికి ఇచ్చుకొని నిధులు లేని 56 కార్పొ రేషన్లు బీసీలకు ఇచ్చాడు జగన్‌రెడ్డి.
బిసిల నాయకత్వాన్ని దెబ్బతీసే కుట్ర
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బీసీ నాయకత్వాన్ని దెబ్బతియ్యడానికి జగన్ రెడ్డి అనేక కుట్రలు చేసాడు. జగన్‌రెడ్డి అరాచక, అవినీతి పాలనను ప్రశ్నిస్తున్నారని టిడిపి బీసీ నేతలైన కింజరాపు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు,బీదా రవిచంద్రయాదవ్, కొల్లు రవీంద్రలపై తప్పుడు కేసు లు బనాయించి అక్రమంగా జైలులోపెట్టించిన శాడిస్ట్ ముఖ్యమంత్రి జగన్. 26 మంది బీసీ సామాజిక వర్గా లకు చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని అత్యంత దారుణంగా హత్య చేయించిన జగన్‌ఫ్యాక్షన్ రెడ్డి..బీసీలకి రక్షణ కల్పిస్తాడా? ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదంగా మారిన రాక్షసుడుతో మనం పోరాడుతు న్నప్పుడు మనలో ఐకమత్యం అవసరం.
పదవులన్నీ సిఎం సొంత సామాజికవర్గానికే
టిడిపి హయాంలో 16 యూనివర్శిటీలకు గాను 9 చోట్ల బిసిలకు అవకాశమిచ్చాం. ఇప్పుడు అంతా సిఎం సొంత సామాజికవర్గానికి చెందినవారే. ఈ ప్రభుత్వం వర్సిటీ వీసీల్లో 83%, ప్రభుత్వ సలహదా రుల్లో 71%, ప్రభుత్వ న్యాయవాదులు 30 మంది ఉంటే 16(53%) సొంత సామాజికవర్గమే. సలహా దారులుగా బీసీలు పనికి రారా? ఉత్తరాంధ్రలోనూ మీ పెత్తనమేనా? ఆర్థికమంత్రి ఒక రెడ్డికి…టిటిడి చైర్మన్ బాబాయ్ సుబ్బారెడ్డికి…10కి పైగా పదవులు తన దోపిడీల గురువు విజయసాయిరెడ్డికి కట్టబెట్టి.. యాద వులకు సామాజిక అన్యాయంచేశాడు జగన్‌రెడ్డి. తెలు గు దేశం ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకమ్కెన రాష్ట్ర ఆర్ధిక మంత్రి పదవితో పాటు, టిటిడి ఛ్కెర్మన్ పదవులను యాదవులకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడుకే దక్కుతుంది. వాల్మీకి/ బోయలను ఎస్టీ ల్లో చేర్చేందుకు టిడిపి సర్కారు కేంద్రానికి తీర్మానం పంపింది.అధికారంలోకివస్తే వాల్మీకుల్నిఎస్టీల్లో చేర్చేం దుకు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేస్తాన ని చెప్పిన జగన్‌రెడ్డి ఆ ఊసే ఎత్తడంలేదు. మూడు న్నర ఏళ్ల తరువాత కమిషన్ కొత్త డ్రామా మొదలు పెట్టారు. మనం చేసిన మేలు చెప్పండి.. జగన్‌రెడ్డి బీసీలకు చేసిన కీడు మనవాళ్లకి వివరించండి. మళ్లీ మనం వస్తున్నాం..బీసీల ప్రభుత్వం వస్తోంది.. సమ స్యలన్నీ పరిష్కారం అవుతాయని భరోసా ఇవ్వండి.
అన్యాయాన్ని ఎదుర్కోవడానికే సాధికార కమిటీలు
రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులు, అన్యాయాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా బీసీ సాధికార కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. బీసీల్లో అన్ని కులాలకూ అవకాశాలు కల్పించేందుకు సాధికా రిక కమిటీలు ఏర్పాటుచేశాం. కమిటీలు పూర్తిస్థాయి లో ఏర్పాటు చెయ్యాలి. మీ కులాలకి జరుగుతున్న అన్యాయం, దాడులపై మీరంతా ఒక్కటై పోరాడితే.. మీ ముందుండి తెలుగుదేశం నడిపిస్తుంది. రాబోయే ది వెనబడినతరగతుల వారిని అన్నిరంగాల్లో ముందు కు తీసుకొచ్చిన తెలుగుదేశం ప్రభుత్వమే. మీ కులాల వారీగా ఎదురవుతున్న సమస్యలపై నివేదికలు సిద్ధం చేయండి. ఇతర బీసీ సోదరులతో సామరస్యంగా మెలుగుతూ మీ కమ్యూనిటీకి తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా మేలు చేసే ప్రణాళికలు రెడీ చేయండి.
టిడిపి హయాంలోనే బిసిలకు అధిక నిధులు
రాష్ట్ర జనాభాలో 52శాతం అంటే సుమారు 2 .70కోట్ల మందికి పైగా బీసీలే. జగన్ పాలనలో అడు గడుగునా బీసీలు అన్యాయానికి గురవుతున్నారు. టిడి పి హయాంలో బిసి సబ్ ప్లాన్‌కు రూ.28804 కోట్ల ఖర్చు చేశాం. ఒక్క 2018-19లోనే బీసీ సంక్షేమానికి రూ.11వేల కోట్లు ఖర్చు చేశాం. జగన్‌రెడ్డి 2019-20లో రూ.15,061 కోట్లు కేటాయించి.. అందులో రూ.10,478 కోట్లను అమ్మఒడి, ఆసరా, చేయూత, వాహన మిత్ర అంటూ దారి మళ్లించాడు. 5.5 లక్షల మంది నాయీ బ్రాహ్మణులుంటే 38వేల మందికి, 15 లక్షల మంది రజకుల్లో 82వేల మందికి, 13 లక్షల మంది టైలర్లలో లక్ష మందికి మాత్రమే చేదోడు పథకాన్ని ఇవ్వడం మోసం కాదా?
జగన్ పాలనలో అడుగడుగునా అన్యాయమే
ఆదరణ పథకంతో కుల వృత్తులపై ఆధార పడిన వారికి అండగా నిలిచాం. ఆదరణ పథకం ద్వారా 124 కుల వృత్తులకు చెందిన వారికి రూ.964 కోట్ల విలువైన 341రకాల పనిముట్లను 90%సబ్సిడీతో టీడీపీ ప్రభుత్వం అందించింది. ఆదరణ పథకాన్ని నిలిపివేశారు. లబ్దిదారుల వాటా రూ.47 కోట్లు దారి మళ్లించారు. టిడిపి హయాంలో నాయి బ్రాహ్మణ ఫెడ రేషన్ ద్వారా రిజిస్టర్ అయిన 1.23లక్షల మందిలో ఒక్కొక్కరికి రూ.2లక్షల రుణం అందించాం. నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఇచ్చే రూ.10 లక్షల గ్రూప్ రుణాలను రద్దు చేశారు. మత్స్యకారుల వలలు, పడవ లకు టిడిపి ఇచ్చిన 90 శాతం సబ్సిడీ రద్దు చేశారు. మత్యకారసహకార సంఘాలను నిర్వీర్యంచేసేలా జీవో నెం:217తెచ్చారు. రాష్ట్రంలో 20 లక్షల మంది ఉంటే కేవలం లక్ష మందికే మత్స్యకార భరోసా. 3.50 లక్షల మంది చేనేతలు ఉంటే.. నేతన్న నేస్తం పేరుతో 81వేలమందికే సాయం.గత ప్రభుత్వ హయంలో అందే రూ.50వేల సాయాన్ని ఎగ్గొట్టారు. సబ్సిడీలు ఎత్తేసారు. బీసీ భవన్ నిర్మాణాన్ని ఆపే సారు. టిడిపి హయాంలో విదేశీవిద్య ద్వారా బీసీ యువతకు రూ. 10లక్షల ఆర్థికసాయం చేశాం. టిడిపి ప్రభుత్వం బీసీ వధువులకు పెళ్లికానుకగా రూ.35వేలు అందించింది. టిడిపి హయాంలో స్వయం ఉపాధి యూనిట్లు, ఆదరణ పనిముట్లకు రూ.4 వేల కోట్లు ఖర్చుచేశామని లోకేష్ తెలిపారు.