- శరత్ అక్రమ అరెస్ట్ జగన్ కుట్రలో భాగమే
- జనంలో ఎదురుగాలి గ్రహించే నీచ రాజకీయాలు
- డీఆర్‌ఐని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను భయపెట్టే కుయుక్తులు
- ఉడత ఊపులకు బెదిరేది లేదు
- జగన్‌రెడ్డిపై మండిపడ్డ ప్రత్తిపాటి, కొల్లు, ఆనంద్‌సూర్య, అంగర
అమరావతి(చైతన్యరథం): టీడీపీని రాజకీయంగా ఎదుర్కోలేకనే తప్పుడు కేసులతో వేధింపులకు గురిచేసి భయపెట్టేందుకు జగన్‌రెడ్డి కుట్రలు పన్నుతున్నాడని ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌పై రాష్ట్ర ప్రభుత్వ ఆధీనం లోని డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్‌ఐ) పెట్టిన తప్పుడు కేసే ఇందుకు నిదర్శనమన్నారు. తన పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్న వాస్తవం తెలిసే, జగన్‌రెడ్డి దిక్కుతోచని స్థితిలో టీడీపీ నాయకు లు, వారి కుటుంబసభ్యులపై అక్రమ కేసులు నమోదు చేయిస్తూ వారిని భయపెట్టేందుకు కుయుక్తులు పన్ను తున్నారన్నారు. అయితే జగన్‌రెడ్డి ఉడత ఊపులకు టీడీపీ నేతలు బెదిరిపోతారనుకోవడం ఆయన భ్రమ మాత్రమే అని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, పార్టీ నాయకులు వేమూరి ఆనందసూర్య, అంగర రామ్మోహన్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
ప్రతిపక్షాల్ని తొక్కేయాలనే: ప్రత్తిపాటి
తొలుత ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ తప్పుడు కేసులతో ప్రతిపక్షనేతల్ని తొక్కేయాలన్న దుర్మార్గపు ఆలోచనల్లో భాగంగానే తన కుమారుడు శరత్‌ను అర్ధ రాత్రి అదుపులోకి తీసుకున్నారని ధ్వజమెత్తారు. విధ్వం సం, విద్వేషాల కలయికగా మారిన వైసీపీ పాలనలో అక్రమ కేసులతో గిట్టనివారిపై కక్షసాధింపులకు పాల్ప డుతున్న జగన్‌రెడ్డి.. ముందు శరత్ చేసిన తప్పేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. చిలకలూరిపేట నియో జకవర్గంలో 5 సార్లు పోటీచేస్తే, 3 సార్లు మంచి మెజా రిటీతో గెలిచాను. చంద్రబాబు అండతో నియోజక వర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాను. ప్రజల్లో ఉండే నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే జగన్‌రెడ్డి ఇలాంటి నీతి మాలిన చర్యలకు పాల్పడుతున్నాడు.
ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం…
చంద్రబాబు నాకు టిక్కెట్ ప్రకటించిన 24 గంట ల్లోనే నా కుమారుడు సహా… కుటుంబసభ్యు లందరిపై తప్పుడు కేసులుపెట్టారు.డీఆర్‌ఐ ఎవరి అధీనంలో పని చేస్తోందో ముఖ్యమంత్రి చెప్పాలి. జగన్‌రెడ్డి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి డీఆర్‌ఐ వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం. చిలకలూరిపేటలో విజయం ఏకపక్షంగా ఉండనుందనే వాస్తవం గ్రహించిన మీదటే డీఆర్‌ఐ వ్యవస్థద్వారా నా కుమారుడు…మా కుటుంబంపై తప్పు డు కేసులు పెట్టారు. ప్రతిపక్ష సభ్యులపై బురద జల్ల డమే ధ్యేయంగా డీఆర్‌ఐ విభాగాన్ని జగన్‌రెడ్డి దుర్వి నియోగం చేస్తున్నాడు. గిట్టనివారు.. ప్రతిపక్ష సభ్యుల పై తప్పుడుకేసులు పెట్టించి,వారిని లొంగ దీసుకోవా లన్న జగన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా డీఆర్‌ఐ పనిచేస్తోంది. నాకు సీటు ప్రకటించిన 24గంటల్లో కేసుపెట్టి, నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. పలు గంటలపాటు ఎక్కడెక్కడో తిప్పి, ఎప్పుడో అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారని పుల్లారావు విమర్శించారు.
సొంత చెల్లినే వదలని వాడు..
తాడేపల్లిగూడెం సభ విజయవంతం కావడంతో దా నిగురించి ప్రజలు చర్చించుకోకూడదన్న దురుద్దే శంతోనే జగన్‌రెడ్డి డీఆర్‌ఐని రంగంలోకి దింపి, నా కుటుంబాన్ని టార్గెట్ చేశాడు. ఇలాంటి పనులు జగన్ రెడ్డికి బాగా అలవాటే కదా! త్వరలో గురజాలలో రా…కదలిరా సభ ఉంది.. అది కూడా భారీస్థాయిలో విజయవంతం కావడం ఖాయం. ఆ సభ తర్వాత మరో టీడీపీ నాయకుడిని టార్గెట్ చేస్తారు. ఇలాంటి డైవర్షన్ రాజకీయాలకోసం జగన్ డీఆర్‌ఐని వాడుకుంటు న్నాడు. తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుల్ని దెబ్బతీయాలన్న ఆలోచన తప్ప, జగన్ రెడ్డికి మరేమీ పట్టడం లేదు. ఎదుటివారిపై పెట్టే తప్పుడుకేసులతో తనకు నష్టం జరుగుతుందని తెలిసినా జగన్‌రెడ్డి ఆగడు.. అది అతని సైకో మనస్తత్వానికి నిదర్శనమం. తోడబుట్టిన చెల్లిని, సొంత బాబాయ్ కూతురినే వేధి స్తున్న వ్యక్తి సామాన్యుల్ని..ప్రతిపక్ష నేతల్నివదిలేస్తాడా? పోలీసులు నా కుమారుడిని 16 గంటలపాటు 6 స్లేషన్లు తిప్పారు. ఎక్కడ ఎవరిని అడిగినా మాకు తెలియదు.. సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు రావాలనే చెప్పారని పుల్లారావు దుయ్యబట్టారు.
ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకనే: అంగర
మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌రావు మాట్లాడు తూ జగన్‌రెడ్డికి ప్రజాస్వామ్యంపై.. ప్రజలపై నమ్మకం లేదన్నారు. అందుకే తప్పుడు కేసులతో ప్రతిపక్షాల్ని దెబ్బతీయడానికి తన ఆధీనంలోని సంస్థల్ని వాడుకుంటున్నాడు.
టీడీపీ-జనసేన పొత్తుని ప్రజలు ఆమోదించారు. తాడేపల్లిగూడెం సభ విజయవంతం కావడంతో జగన్ సహా వైసీపీ నేతలకు ప్యాంట్లు తడుస్తున్నాయి. చెల్లి కొడుకు.. సొంత మేనల్లుడినే దీవించలేని జగన్ .. విద్యార్థులకు మేనమామ అవుతాడా అని అంగర ప్రశ్నించారు.