కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రవేటికరించేందుకు వ్యతిరేకిస్తూ వామపక్ష నేతలతో కలిసి టిడిపి మంగళగిరిలోని అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. టిడిపి నాయకులు మాధవరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నట్లు గుర్తుచేశారు. లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఫ్యాక్టరీని వేల కోట్ల రూపాయలకు కారు చౌకగా పెట్టుకోదారులకు అమ్మడానికి మోడీ ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు.