అమరావతి :- విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనలో బాధిత మత్స్యకార కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఆర్థికసాయం ప్రకటించింది. బోట్లు కోల్పోయిన వారికి రూ. లక్ష పాక్షికంగా దెబ్బతింటే రూ. 50,000, కళాసీలకు రూ. 5000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక బాధితులకు కొత్తబోట్లు అందిస్తామని పేర్కొన్నారు.