ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం సందర్భంగా యర్రంగొండపాలెం పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వాహనశ్రేణిపై జరిగిన వైసీపీ గూండాల రాళ్ల దాడిలో గాయపడి మృతి చెందిన టీడీపీ కార్యకర్త రాజయ్య కుటుంబ సభ్యుల్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు.
రాజయ్య మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఈ సందర్భంగా రాజయ్య పార్టీకి చేసిన సేవలు కొనియాడారు. పార్టీ తరపున రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు. పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని అధైర్యపడొద్దని రాజయ్య కుటుంబ సబ్యులకు చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.