- గంగపట్నంలో వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో 100 కుటుంబాల చేరిక
- మే 13 పోలింగ్ తర్వాత విజయసాయి రెడ్డి ఢల్లీికే పరిమితం
- వైసీపీ నాయకులకు మాటలు ఎక్కుడ, పని తక్కువ
- పార్టీలో చేరిన వారికి మా అండ ఎప్పుడూ ఉంటుంది – ప్రశాంతిరెడ్డి
కోవూరు, చైతన్యరథం: వచ్చే ఎన్నికల్లో గెలిచేది ఎన్డీయే కూటమి ప్రభుత్వమేనని నెల్లూరు పార్లమెంట్ ఎన్‌డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో రామచంద్రానాయుడు, చ్తెతన్య నాయుడు ఆధ్వర్యంలో దాదాపు 100 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతిరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వేమిరెడ్డి మాట్లాడుతూ… పార్టీలో చేరినవారికి తప్పకుండా తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు. బుధవారం 3 ప్రాంతాల్లో చేరికల కార్యక్రమాల్లో పాల్గొన్నామని, చేరికలు చూస్తుంటే వచ్చేది కూటమి ప్రభుత్వమేనని స్పష్టం అవుతోందన్నారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ కూడా ఉందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మద్దతు ఉంటుందన్నారు. ఇదే నియోజకవర్గంలో ఇఫ్కోకు సంబంధించి వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకుని కంపెనీలు తెస్తే యువతకు స్థానికంగా ఉపాధి లభిస్తుందన్నారు.
కంపెనీలు ఏర్పాటు చేయాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. కోవూరు ఎమ్మెల్యేకు ఓటమి ఖాయమైందని, అందుకే అర్థంపర్థం లేని కామెంట్స్ చేస్తున్నారన్నారు. వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి మే 13 న పోలింగ్ అయిన వెంటనే ఢల్లీి వెళ్లిపోతారని, ప్రజలెవరికీ అందుబాటులో ఉండరన్నారు. తాము మీ ఇంటి మనుషులుగా ఎప్పుడూ అండగా ఉంటామన్నారు.
అనంతరం ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ.. పల్లెలు పట్టణాలు అయ్యే అవకాశం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో పార్టీలో చేరినవారికి సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. వైసీపీ నాయకులు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేలు అయినవారు నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ప్రజలకు కనీసం తాగునీటి సదుపాయం లేకుండా చేశారని దుయ్యబట్టారు. ఈ నియోజకవర్గ సమస్యలకు పరిష్కారం కావాలంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడుని గెలిపించుకోవాలన్నారు. ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు హరిరెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.