హిందూపురం,చైతన్యరథం: తెదేపా, జనసేన పొత్తు కొత్త శకానికి నాంది అని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. గురువారం సత్య సాయి జిల్లా హిందూపురంలో జరిగిన తెదేపా-జనసేన సమన్వయ సమావేశం లో ఆయన మాట్లాడుతూ… ‘‘రాష్ట్రం మొత్తం ఇన్ని సీట్లు… అన్ని సీట్లు కాదు తెదేపా-జనసేన గెలవాలి. నేను, పవన్ కల్యాణ్ ముక్కుసూటిగా మాట్లాడుతాం.
ప్రభుత్వం అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధా నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్‌లో అభి వృద్ధి శూన్యం. రాష్ట్రంలో పరిపాలన మొత్తం నేర స్థులు, హంతకుల చేతుల్లో ఉంది. పరిపాలన ఇష్టా రాజ్యంగా సాగుతోంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కలిసిపోరాడాలి.రాష్ట్రంలో ఒక్క హిందూ పురంలో తప్పఎక్కడా అభివృద్ధి జరగడంలేదు. ప్రతిపక్షంలో ఉండే అభివృద్ధి పనులు చేస్తున్నాం. పరిపాలన చేతకాక 3రాజధానులు అంటూ కాల యాపన చేస్తున్నారు’’అని బాలకృష్ణ విమర్శించారు.
హిందూపూరం ప్రభుత్వ ఆసుపత్రి సందర్శరన
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గురువారం హిందూ పూర్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి లో సౌకర్యాలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవ ని రోగులు బాలకృష్ణకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలకృష్ణ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను నిలదీశా రు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లా డుతూ హిందూపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో అనేక సమస్యలు ఉన్నాయని, వైద్య పరికరాలు లేవని, ఉన్న వాటిని వాడుకోలేదని విమర్శించారు. గతం లో తాను ఇచ్చిన వెంటిలేటర్లు నిరు పయోగంగా ఉన్నాయని, టీడీపీ హయాంలో ఆస్పత్రి శుభ్రంగా ఉండేదని,ఇప్పుడు అలా లేదని బాలకృష్ణ అన్నారు. కనీసం సీలింగ్ కూడా సరిగాలేదని,ఇవాళ ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రైవేటు ఆస్పత్రి యాజ మాన్యాలు అంటున్నాయన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద ఇచ్చిన నిధులను కూడా వేరే స్కీమ్‌లకు డైవర్ట్ చేశారన్నారు. 460 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం వేరే స్కీమ్‌లకు తర లించిందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఫైన్ కూడా కట్టిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాల కల్ప నకు శాశ్వత పరిష్కారం ఇంకో 4 నెలల్లో వస్తుం దని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.