అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, తెలుగుప్రజల సంక్షేమానికి, పురోగతికి టీడీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు కుదిరి, తిరిగి ఎన్డీయేలో చేరటంపై ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందించారు. ఏపీకి మంచి చేసేందుకే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయన్నారు. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాట పట్టించేందుకు కలిసిన ఆ కూటమిని ప్రజలు చారిత్రాత్మక తీర్పుతో ఆశీర్వదిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. మూడు పార్టీలు కలిసి రాష్ట్రాభివృద్ధిలో సువర్ణాధ్యాయం సృష్టిస్తాయన్నారు. రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు మేం కలిసి బాటలు వేస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి తిరిగి ఎన్‌డీయేలో చేరటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటుచేసి, అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికేందుకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానన్నారు. ఎన్‌డీయేకి టీడీపీని ఆహ్వానిస్తూ జేపీ నడ్డా చేసిన ట్వీట్‌ను చంద్రబాబు రీ ట్వీట్ చేశారు.
అమిత్‌షాకు చంద్రబాబు కృతజ్ఞతలు
ఎన్డీయేలోకి ఆహ్వానించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు చంద్రబాబు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. అంద్రప్రదేశ్‌లో అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయన్నారు. ఆ రాష్ట్రం అభివృద్ధి దేశాభివృద్ధికి కూడా దోహదపడుతుందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధిలో నవశకాన్ని ఆవిష్కరిద్దామన్నారు. అంతకు ముందు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మోదీపై నమ్మకంతో టీడీపీ, జనసేన.. ఎన్డీయేలో చేరాయి. ప్రజల ఆకాంక్షలను బీజేపీ-టీడీపీ-జనసేన నెరవేరుస్తాయి. మోదీ నేతృత్వంలో ఎన్డీయే బలమైన రాజకీయ వేదిక అవుతుందన్నారు.