జగన్ చాలా అద్భుతంగా 2023-24 ఆర్థికసంవత్సరంలో కూడా తన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడని, 2019కి ముందు ఏ మాయమాటలతో ప్రజల్ని మోసగించాడో, మరలా అంతకుపదింతలు జనాన్ని మోసగిస్తూ, 2024ఎన్నికల్లో కూడా లబ్ధిపొందాలని చూస్తున్నాడని, తమను నిలువునామోసగించి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ తమ నమ్మకం కాదు.. తమపాలిట పెద్దవిలన్ అని ప్రజలు వాపోతున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం కొత్తగా రూ.5,500కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై వేస్తున్నందుకు కృతజ్ఞతగా ఇంటింటికీ జగన్ ముఖచిత్రంతో కూడిన స్టిక్కర్లు అంటించుకోవాలా? అని ప్రశ్నించారు. ‘‘తన బాదుడేబాదుడులో భాగంగా జగన్ మరోసారి ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం వేస్తున్నా డు.
4ఏళ్లలో ట్రూఅప్ ఛార్జీలు, శ్లాబ్‌ల మార్పు, ఛార్జీలపెంపు, తదితర మార్గాల్లో రూ.15వేల కోట్లభారాన్ని జగన్ ఇప్పటికే ప్రజలపై వడ్డించాడు. తాజాగా ఈ ఆర్థికసంవత్సరంలో మరో రూ.5,500కోట్ల విద్యుత్ ఛార్జీల బాదుడికి జగన్ రంగం సిద్ధంచేశాడు. మరలా ప్రజలు తనకు అవకాశమివ్వరని భావించే, తన అవినీతి దాహం తీర్చుకోవడం కోసం ప్రజలపై తన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తూ, తాజాగా ఈ సంవత్సరంలో నెలకు రూ.460కోట్లచొప్పున, సంవత్సరానికి రూ.5,500కోట్ల విద్యుత్ ఛార్జీలబాదుడుకి సిద్ధమ య్యాడు.
మార్చి 01, 2023న ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్ మెంట్ (ఎఫ్.పీ.పీ.సీ.ఏ) వారు ఇచ్చిన ఆర్డర్ కాపీలోని వివరాలు ఇలాఉన్నాయి. 2021-22ఆర్థికసంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి విపరీతంగా ఖర్చుచేసినట్టు, దానికి సంబంధించి వినియోగదారుల నుంచి వసూలు చేసిన దానికి, ప్రభుత్వం చేసిన కొనుగోళ్లకు మధ్య చాలా తేడా వచ్చినందుకు రూ.3,082కోట్ల తేడా వచ్చినందున ఆ భారాన్ని వినియోగదారులపై మోపాలని నిర్ణయించారు. పాలకుల కమీషన్ల కక్కుర్తి, విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతి, అసమర్థపాలన వల్ల 2021-22 సంవత్సరంలో వచ్చిన రూ.3,082కోట్ల నష్టాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో వినియోగదారులనుంచి వసూలుచేయాలని నిర్ణయించారు.
ఈ మొత్తాన్ని వినియోగదారులనుంచి వసూలుచేయడానికి నాలుగుక్వార్టర్ల కాలాన్ని ప్రామా ణికంగా పెట్టుకున్నారు. ఏప్రియల్, మే, జూన్ ఒక క్వార్టర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ రెండో క్వా ర్టర్, అక్టోబర్ నవంబర్, డిసెంబర్ కాలాన్ని 3వ క్వార్టర్ గా, జనవరి, ఫిబ్రవరి, మార్చిని 4వ క్వార్టర్ గా విభజించి రూ.3082కోట్ల వసూలుకి సిద్ధమయ్యారు. తొలి క్వార్టర్ లో యూనిట్ కి 20పైసలు, 2వక్వార్టర్ లో యూనిట్ కి 63పైసలు, 3వ క్వార్టర్ లో యూనిట్ కి 57పైసలు, 4వ క్వార్టర్లో యూనిట్ కి 66పైసలు పెంచాలని నిర్ణయించారు. 4 క్వార్టర్లకు కలిపి ఒక్కో యూనిట్ కి సరాసరిన ఈ సంవత్సరం మొత్తమ్మీద 51పైసల చొప్పున భారంవేస్తున్నాడు సైకో జగన్. దానివల్ల వినియోగదారులపై రూ.3,082కోట్ల భారం పడుతోంది.’’ అని వివరించారు.
ఏపీ. ఈ.ఆర్. సీ యాక్ట్ లో కొన్ని సవరణలుచేస్తూ ఇంకా బాదడానికి ఈ ముఖ్యమంత్రి ఏకంగా గెజిట్ నోటిఫికేషన్లు ఇచ్చేస్థాయికి వచ్చేశారన్నారు. గెజిట్ ద్వారా ఏపీ.ఈ.ఆర్.సీ.లో 4వ అమెండ్ మెంట్ తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం, నెలానెలా ఆటోమేటిగ్గా బాదుడు భారం ప్రజలపై పడేలా చట్టంలో మార్పులుచేశారన్నారు. గెజిట్ నోటిఫికేషన్ పేజీనెం-4లో ఏ నెలకు ఆనెల అదనంగా యూనిట్ కి 40పైసలు అదనపు భారం ప్రజలపై మోపుతూ, వసూలు చేసుకునేలా చట్టసవరణ చేశారన్నారు. ఈ ఏప్రియల్ నెలనుంచే రూ.5,500 కోట్ల విద్యుత్ ఛార్జీలభారాన్ని (నెలకు రూ.460కోట్లు) ప్రజలపై వేసేందుకు జగన్ సర్వంసిద్ధం చేశారన్నారు. ఇలా బాదుళ్లతో ప్రజల్ని చావగొడుతున్నందుకు జగనే మానమక్మం అనాలా? ప్రజలు జగనే మా విలన్ అంటున్నారు తప్ప, మా నమ్మకం నువ్వే జగన్ అని కాదన్నారు.
చంద్రబాబు 2014-19మధ్యలో పైసా విద్యుత్ భారం ప్రజలపై మోపలేదన్నారు. పైగా విద్యుత్ కొరతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించారన్నారు. కానీ జగన్ వచ్చాక రైతులకు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ లభించడంలేదన్నారు. పైగా వేలకోట్లభారాన్ని విద్యుత్ ఛార్జీలపేరుతో ప్రజలపై వేశారని మండిపడ్డారు. ఈ విధంగా ప్రజల్ని విద్యుత్ ఛార్జీల భారంతో పీక్కుతింటున్న జగన్‌ను ఛీకొట్టక, బ్రహ్మరథం పడతారా? రూ.5,500కోట్ల భారం ఎలామోపుతారని, తాము ఎలా బతకాలని స్టిక్కర్లు వేయడానికి వచ్చే వైసీపీనేతలు, కార్యకర్త లు, వాలంటీర్లను ప్రజలు చొక్కాపట్టుకొని నిలదీయాలన్నారు. ఈ సరికొత్త బాదుడుపై మంత్రి పెద్దిరెడ్డి ఏంసమాధానం చెబుతారని నిలదీశారు. ఎప్పుడు బటన్ నొక్కి జగన్‌ను ఇంటికి సాగనంపుదామా అని ప్రజలు ఎదరుచూస్తున్నారన్నారు. వచ్చే నెల వచ్చే కరెంట్ బిల్లులు ప్రజలకు కచ్చితంగా షాక్ కొట్టేలానే ఉంటాయని, ప్రజలు నేరుగా బిల్లులు పట్టుకోకుండా జాగ్రత్తపడాలన్నారు. ఈ ఎండాకాలంలో కూలర్లు, ఏ.సీలతో సేదతీరుదామని భావిస్తున్న ప్రజలకు పాతరోజుల్లో మాదిరి తాటాకు విసనకర్రల్ని నమ్ముకునే పరిస్థితి జగన్ కల్పించారని ఆయన ఎద్దేవాచేశారు.