టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మహానాడులో బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తూ మేనిఫెస్టో ప్రకటించడం పట్ల తెలుగు దేశం పార్టీ బీసీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. సూళ్లూరుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్, పూలే చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, పార్లమెంటు నియోజకవర్గ దేవాంగ సాధికార కన్వీనర్ మునిరాజ, రజక సాధికార కమిటీ సభ్యులు రమణయ్య, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు రాము, దొరవారిసత్రం మండల బీసీ నాయకులు పామంజి శ్రీనివాసులు, మీజూరు వెంకటేశ్వర్లు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.