తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఈనెల 15వ తేదీన కొండేపి నియోజకవర్గస్థాయి సభ టంగుటూరులో నిర్వహిస్తున్నట్లు కొండేపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి శుక్రవారం తెలిపారు.
కావున నియోజకవర్గంలోని ఎన్టీఆర్ అభిమానులు, టిడిపి శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.