మానసిక వైకల్యంతో సైకోగా మారింది ఎవరో తెలుసుకో ప్యాలెస్ బ్రోకర్!
తండ్రి శవం పక్కన ఉండగానే సంతకాలు సేకరించిన సైకో ఎవరు?
ప్రజా మ్యానిఫెస్టో దెబ్బకు వైసిపి ప్రభుత్వం షేక్
చేసే పనులన్నీ ఫేక్. అందుకే ఫేక్ జగన్ అని పేరు పెట్టా
భూబకాసురుడు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
చెన్నూరు బహిరంగసభలో నిప్పులు చెరిగిన యువనేత లోకేష్
…….
చీకట్లో కోడిగుడ్లు వెయ్యడం, పిల్ల సైకోల్ని పంపడం కాదు జగన్. దమ్ముంటే నువ్వే నేరుగారా తేల్చుకుందామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. చెన్నూరు బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగిస్తూ నిప్పులు చెరిగారు. ప్రసంగం మొదలయ్యాక నమాజ్ విన్పించడంతో కొద్దిసేపు ప్రసంగాన్నిఆపి, తర్వాత ప్రారంభించాను. అనంతరం లోకేష్ మాట్లాడుతూ యువగళం.మనగళం.ప్రజాబలం.
యువగళం దెబ్బకి జగన్ కి 70 ఎంఎం సినిమా కనపడుతుంది. కడప గడ్డ పై యువగళం ప్రజాగర్జన చూసి జగన్ కి నిద్రపట్టడం లేదు. నాకు వస్తున్న ప్రజాదరణ చూసి జగన్ ఓర్చుకోలేకపోతున్నాడు. నాపై కోడిగుడ్లు వేస్తే నీ కడుపు మంట తగ్గదు. ఈనో వాడు జగన్. క్లైమోర్ మైన్లకే భయపడని కుటుంబం మాది. నీ కోడిగుడ్లకు బయపడతాం అని ఎలా అనుకున్నావ్? ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర. అడ్డుకుంటే దండయాత్ర. భయం మా బయోడేటా లో లేదు. కమలాపురం కదం తొక్కింది. కుందూ,పెన్నా, పాపాగ్ని నదుల త్రివేణి సంగమం కమలాపురం. మతసామరస్యానికి ప్రతీక కమలాపురం దర్గా. దక్షణ కాశీ చెన్నకేశవ ఆలయం, సంగమేశ్వర ఆలయం, అగస్త్యేశ్వరాలయం ఉన్న పుణ్య భూమి కమలాపురం. ఎంతో ఘన చరిత్ర ఉన్న కమలాపురంలో పాదయాత్ర చెయ్యడం నాఅదృష్టం అని లోకేష్ చెప్పారు.
జగన్ ది పరదాల బ్రతుకు. మీ లోకేష్ ది యువగళం. నా దారికి అడ్డు రావొద్దు. అడ్డొస్తే మీకు అడ్రెస్ లేకుండా చేస్తా. తాడేపల్లి ప్యాలస్ లో బ్రోకర్ ఒకడు ఉన్నాడు. వాడి పేరు సజ్జల. ఒళ్లు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు. మానసిక వైకల్యం గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి శవం పక్కన ఉండగానే సీఎం అవ్వాలని సంతకాలు సేకరించిన జగన్ కి మానసిక వైకల్యం ఉంది ప్యాలస్ బ్రోకర్. సొంత బాబాయ్ ని లేపేసిన జగన్ కి మానసిక వైకల్యం ఉంది ప్యాలస్ బ్రోకర్. సొంత తల్లిని, చెల్లిని తరిమేసిన జగన్ కి మానసిక వైకల్యం ఉంది ప్యాలస్ బ్రోకర్. మానసిక వైకల్యంతో సైకో గా మారింది జగన్. లండన్ మందులు వాడుతుంది జగన్. ముందు ఆ విషయం తెలుసుకో ప్యాలస్ బ్రోకర్. గుర్తు పెట్టుకో మీ సైకో బ్యాచ్ కి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేది ఈ లోకేష్ మాత్రమే. యువగళం లో కష్టాలు చూసాను… కన్నీళ్లు తుడుస్తాను. మీరు పడుతున్న కష్ఠాల గురించి తెలుసుకొని మీ చంద్రన్న భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారని చెప్పారు.
ప్రజా మ్యానిఫెస్టో దెబ్బకు వైసిపి షేక్
ప్రజా మ్యానిఫెస్టో దెబ్బకి వైసిపి షేక్ అయ్యింది. జగన్ తో సహా వైసిపి నాయకులు అంతా మ్యానిఫెస్టో ఎలా అమలు చేస్తారని అడుగుతున్నారని లోకేష్ వెల్లడించారు. జగన్ నిక్కర్ వేసుకోక ముందే సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసింది టిడిపి. జగన్ అప్పుల అప్పారావు.చంద్రన్న సంపద సృష్టికర్త. వైసిపి అంటే వైన్, మైన్, స్యాండ్, ల్యాండ్ గుర్తొస్తాయి. టిడిపి అంటే పక్కా ఇళ్లు,రూ.2కే కిలో బియ్యం, అన్న క్యాంటిన్ గుర్తొస్తాయి. జగన్ ఫేక్ లీడర్. చంద్రన్న దమ్మున్నలీడర్. జగన్ ఇచ్చిన హామీలు అన్ని ఫేక్. చేసే పనులు అన్ని ఫేక్ అందుకే ఫేక్ జగన్ అని పేరు పెట్టాను. ఫేక్ జగన్ మహిళలను నమ్మించి మోసం చేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. ఇప్పుడు జే బ్రాండ్స్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ లాంటి బ్రాండ్లు తెచ్చి మహిళల తాళిబొట్లు తెంచుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు.
మీ సమస్యలు తెలుసుకున్న తరువాత మీ అన్న చంద్రన్న భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు. మహాశక్తి పథకం కింద ఆడబిడ్డ నిధి, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. తల్లికి వందనం, ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు దీపం పథకం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఉచిత ప్రయాణం, మహిళలకు ఉచిత ప్రయాణం. జగన్ మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచితే.మీ అన్న చంద్రన్న టికెట్ లేకుండా చెయ్యబోతున్నారని వివరించారు.
యువత భవితను నాశనం చేసిన జగన్
ఫేక్ జగన్ యువత భవిష్యత్తును నాశనం చేసాడని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.
నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. ఫేక్ జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అన్ని నకిలీవే. పుండు మీద కారం జల్లినట్టు ఇప్పుడు ఏకంగా మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని వెల్లడించారు.
అబద్దాలు చెప్పడం జగన్ కున్న జబ్బు లక్షణం
జగన్ కి ఒక జబ్బు ఉంది. మైథోమానియా సిండ్రోమ్ తో జగన్ బాధపడుతున్నాడు అని లోకేష్ పేర్కొన్నారు. ఈ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అబద్దాలు చెప్పడం ఈ జబ్బు లక్షణం. మైథోమానియా సిండ్రోమ్ వలనే జగన్ నేను పేదవాడ్ని అంటూ పదే పదే అబద్దం చెబుతున్నాడు. లక్ష కోట్లు ఆస్తి ఉన్నా, లక్ష రూపాయల చెప్పులు వేసుకొని తిరుగుతున్నా, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగుతున్నా పేదవాడ్ని అంటూ అబద్దం చెబుతాడు.
బెంగుళూరు లో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో మరో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నా పేదవాడ్ని అని చెబుతాడు. సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత టివి, ఛానల్ ఉన్నా పేదవాడ్ని అని చెబుతాడు. మైథోమానియా సిండ్రోమ్ వలన జగన్ అబద్దాలు చెబుతూ అబద్దంలోనే బ్రతికేస్తాడు. పేదలు పడుతున్న బాధలు యువగళం లో చూసాను. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదాయాన్ని రెట్టింపు చేసి పేదరికం లేని రాష్ట్రం చేస్తామన్నారు.
కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టర్
ఫేక్ జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్ అని లోకేష్ విమర్శించారు. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. ఫేక్ జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు.
ఫేక్ జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. ఫేక్ జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ ఫేక్ జగన్ అని ధ్వజమెత్తారు.
జగన్ కడపకు పట్టిన శని
జగన్ కడప బిడ్డనని బిల్డప్ ఇస్తున్నాడు. ఆయన కడప బిడ్డ కాదు కడపకి పట్టిన శని అని లోకేష్ ఆరోపించారు. పులివెందుల బస్ స్టాండ్ తప్ప సీఎం గా నువ్వు సొంత జిల్లాకి చేసింది ఏంటో చెప్పే దమ్ముందా జగన్? 2014 లో కడప జిల్లా ప్రజలు టిడిపి కి ఇచ్చింది ఒకే సీటు అయినా జిల్లాని అభివృద్ధి చేసాం. పులివెందులకు నీళ్లు ఇచ్చాం. 10 కి 10 సీట్లు ఇస్తే జగన్ ఏం చేసాడు? స్టీల్ ప్లాంట్ పూర్తి చేసాడా? ఒక్క ప్రాజెక్టు కట్టాడా? ఉన్న ప్రాజెక్టులు నాశనం చేసాడు. అన్నమ్మయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఈ రోజు వరకూ బాధితులకు న్యాయం జరగలేదు. వర్ధంతి, జయంతికి తప్ప జగన్ కడప జిల్లాకి వచ్చింది లేదు. ఇక్కడ సమస్యలు పట్టించుకుంది లేదు.
యువగళం లో నేను సమస్యల పై పోరాడిన తరువాత దున్నపోతు ప్రభుత్వం నిద్ర లేచింది. గండికోట నిర్వాసితులకు నాలుగేళ్ల తరువాత పరిహారం ఇస్తామని అధికారులు ఇప్పుడు హడావిడి చేస్తున్నారు. అది యువగళం దెబ్బ. నాలుగేళ్లు పసుపు రైతుల కష్టాలు జగన్ కి కనపడలేదు. ఇప్పుడు హడావిడి గా పసుపు కొంటాం అంటూ హడావిడి చేస్తున్నారు అది యువగళం పవర్ అని వెల్లడించారు.
బాబాయిని చంపిందెవరు?
కడప గడ్డ పై నిలబడి అడుగుతున్నా హూ కిల్డ్ బాబాయ్?అని లోకేష్ ప్రశ్నించారు. బాబాయ్ ని లేపేసిన జగన్, అవినాష్ నారాసుర రక్త చరిత్ర అని దొంగనాటకాలు ఆడారు. ఇప్పుడు అది జగనాసుర రక్త చరిత్ర అని తేలిపోయింది. అరెస్ట్ నుండి తప్పించుకోవడానికి అవినాష్ నాన్నని జైలుకి పంపాడు, తల్లికి నరకం చూపించాడు. సొంత చెల్లికి న్యాయం చెయ్యలేని వాళ్లు రాష్ట్రంలోని మహిళలకు ఏం న్యాయం చేస్తారు? చెల్లి ఉసురు అన్నలకు తగలడం ఖాయం అని హెచ్చరించారు.
అధికారంలోకి రాగానే బిసి ఉపకులాలకు నిధులు
బీసీలు పడుతున్న కష్టాలు నేను చూసాను. 26 వేల అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం అని లోకేష్ వెల్లడించారు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హాజిరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు.
కమలాపురంలో 28 కోట్లతో టిడిపి హయాంలో హజ్ హౌస్ నిర్మించాం. ఆ భవనాన్ని వాడకుండా వదిలేసారు. మైనార్టీలపై జగన్ కి ఎంత కక్షో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు సీఎం ని ఎందుకు నిలదీయడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో మీరు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారని చెప్పారు.
ఉద్యోగులనూ వేధిస్తున్నాడు
జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడని లోకేష్ తెలిపారు. టీచర్లను లిక్కర్ షాపుల ముందు నిలబెట్టి అవమానించాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. జీతం ఒకటో తారీఖున వచ్చే దిక్కు లేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇదని విమర్శించారు.
భూబకాసురుడు రవీంద్రనాథ్ రెడ్డి
కమలాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి లో నంబర్ 1 చేస్తాడని భారీ మెజారిటీతో రవీంద్రనాధ్ రెడ్డిని గెలిపించారు. సీఎంకి మేనమామ నియోజకవర్గం అంటే ఎలా ఉండాలి? అభివృద్ధి పరుగులు పెట్టాలి? కానీ ఇక్కడ సీన్ రివర్స్. అభివృద్ధి నిల్లు. అహంకారం, అవినీతి, భూకబ్జాలు ఫుల్లు అని లోకేష్ ధ్వజమెత్తారు. అభివృద్ధి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే పళ్లు రాలగొడతాడు రవీంద్రనాధ్ రెడ్డి. ఇసుక,మట్టి,గ్రావెల్ దందా, భూకబ్జాలకు కమలాపురాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేసాడు రవీంద్రనాధ్ రెడ్డి. కొందరికి తాగుడు అంటే వ్యసనం..మరి కొందరికి జూదం వ్యసనం.. కమలాపురం ఎమ్మెల్యే కు మాత్రం భూకబ్జాలు అంటే వ్యసనం.
పూర్వం బకాసురుడు ఊరికి ఒకరిని బలికోరినట్టుగా రవీంద్రనాథ్ రెడ్డి పేదలు, ప్రభుత్వ, చివరికి శ్మశాన భూముల్ని సైతం కబ్జా చేస్తున్నాడు. అందుకే పేరు మార్చాను ఆయన రవీంద్రనాధ్ రెడ్డి కాదు భూబకాసురుడు. సొంత పార్టీ వాళ్లను కూడా వేధించడం ఆయన స్పెషాలిటీ అని పేర్కొన్నారు. కడప టౌన్ శివారు ప్రాంతంలో రూ.200 కోట్లు విలువ చేసే 54 ఎకరాల భూమిని కొట్టేసాడు. ఇప్పుడు అక్కడ వెంచర్ వేసి సెంటు 13 లక్షలకు అమ్మేస్తున్నాడు భూబకాసురుడు, ఆయన అనుచరుడు రాజేంద్రనాధ్ రెడ్డి. ఆ భూములు కొని ఎవరూ మోసపోవద్దు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూములు స్వాధీనం చేసుకుంటాం. లేపాక్షి భూములు లేపేయడానికి భారీ స్కెచ్ వేసాడు. 20 వేల కోట్లు విలువైన 9 వేల ఎకరాల భూమిని చీప్ గా 500 కోట్లకు కొట్టేయడానికి ఒక కంపెనీలో కొడుకుని డైరెక్టర్ గా చేర్చాడు.
సర్వారాయ ప్రాజెక్టు సమీపంలో 400 ఎకరాలు ఆక్రమించి చేపల చెరువులు, పండ్ల తోటలు వేసాడు భూబకాసురుడు. వల్లూరు మండలం గొటూరు వద్ద రూ.100 కోట్ల విలువ చేసే పీర్ల మాణ్యం కబ్జా చేశారు. కడప నగరంలోని మామిళ్ళపల్లె రెవిన్యూ పొలం సర్వే నెంబర్ 39,60 లో సుమారు 130 కోట్లు విలువ చేసే 18 ఎకరాల భూమి కబ్జా. వల్లూరు రెవిన్యూ ఆఫీస్ సమీపంలో రూ 7 కోట్లు విలువ చేసే భూమి కబ్జా. కడప నగర శివార్లలో జయరాజ గార్డెన్ వద్ద పేదలను బెదిరించి రూ.130 కోట్లు విలువ చేసే చేసే 18 ఎకరాలను స్వాధీనం. పెండ్లి మర్రి మండలంలోని పొలతల పుణ్యక్షేత్రం సమీపంలో బినామీ పేర్లతో సుమారు 200 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాడు బకాసురుడు రవీంద్రనాథ్ రెడ్డి అని లోకేష్ ఆరోపించారు.
బుగ్గవంకను ఆక్రమించి థియేటర్
బుగ్గ వంకను ఆక్రమించి ఏకంగా థియేటర్ కట్టాడు. ఆధునీకరణలో ఈయన థియేటర్ కోసం ఏకంగా అలైన్మెంట్ మార్చేసారు. కడప, కమలాపురంలో ఉన్న చుక్కల భూములను కాజేస్తున్నాడు
భూబకాసురుడు అని లోకేష్ ధ్వజమెత్తారు. వక్ఫ్ భూములు, దళితుల భూములు, రైతుల భూములు కొట్టేస్తున్నాడు భూబకాసురుడు. ఉమ్మడి కడప జైల్లో వైసిపి నేతలు సుమారుగా 20 వేల ఎకరాలు కాజేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక సిట్ వేసి భూములు వెనక్కి లాక్కొని పేదలకు పంచేస్తాం.
నేను చెప్పినవి గోరంతే కానీ ఈయన కబ్జాల లిస్ట్ కొండంత ఉంది. కడప జిల్లా లో భూ అక్రమాల పై ప్రత్యేక సిట్ వేసి బాధితులకు న్యాయం చేసే బాధ్యత నాది. భూబకాసురుడు వేధింపులు తట్టుకోలేక వైసిపి కౌన్సిలర్ ప్రమీల, ఆమె భర్త నరేంద్ర టిడిపి లో చేరారు. ఫోర్జరీ సంతకంతో ఆమె రాజీనామా చేసినట్టు దొంగ రాజీనామా పత్రాన్ని వాళ్లే సిద్ధం చేసి రాజీనామా ఆమోదించారు. ఆమె భర్త పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.రైతుల్ని చీట్ చేసిన హిస్టరీ ఈ భూబకాసురుడు సైకో ది. గతంలో తన ఎరువుల ఫ్యాక్టరీ నుండి నకిలీ ఎరువులు సరఫరా చేసినందుకు 420 కేసు కూడా నమోదు అయ్యింది. సర్వారాయ సాగర్ వలన బాగుపడింది ఇద్దరే…జగన్, ఆయన మేనమామ భూబకాసురుడు. సగం నీరు జగన్ సిమెంట్ కంపెనీ కి వాడుకుంటున్నాడు.
భూబకాసురుడు చెరువులో మట్టి మొత్తం కాజేసాడు. ఇప్పుడు అక్కడే చేపల చెరువు, పండ్ల తోటలు ఏర్పాటు చేసి మిగిలిన నీటిని ఆయన వాడుకుంటున్నాడు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే కట్ట కింద రైతులకు కాలువలు ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తాం. పెండ్లిమర్రి, వల్లూరు, సీకే దిన్నె మండలాల్లో చెరువులు మొత్తం కొల్లగొట్టి భూబకాసురుడు, అనుచరులు కలిసి మట్టిని దోచుకుంటున్నారు. ఓబాయపల్లె, కొప్పోలు, తప్పెట్ల, పుత్తచిన్నయపల్లె,గోటూరు చెరువుల్లో భారీగా మట్టి దోపిడీ జరుగుతుందని ఆరోపించారు.
కమలాపురాన్ని అభివృద్ధి చేసింది టిడిపి
కమలాపురంని అభివృద్ధి చేసింది టిడిపి. తాగు, సాగునీటి ప్రాజెక్టులు, పేదలకు ఇళ్లు, గ్రామాల్లో సిసి రోడ్లు వేసింది టిడిపి. మీరేం చేసారు? అని లోకేష్ ప్రశ్నించారు. పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. సీఎం హోదాలో జగన్ కమలాపురం వచ్చినప్పుడు వరాలు ఇచ్చాడు. ఆయన ఎం అన్నాడో గుర్తుందా? సాటి మనిషికి సాయం చేస్తే ఆ మనిషి గుండెల్లో శాశ్వతంగా ఉంటాం అన్నాడు. రూ.905 కోట్లతో కమలాపురాన్ని అభివృద్ధి చేస్తున్నా అంటూ శంకుస్థాపన చేసాడు.
కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ కి నీటి సౌకర్యం కల్పించి 3 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పాడు. కంపెనీలు తెచ్చాడా? మూడు లక్షలు కాదు ముప్పై ఉద్యోగాలు ఇచ్చాడా? కమలాపురం టౌన్ లో ప్రధాన సమస్య రైల్వే బ్రిడ్జ్. రూ.39 కోట్లతో నిర్మాణానికి శంకుస్థాపన చేసాడు. హామీ గాల్లో కలిసిపోయింది. రూ.88 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణం అన్నాడు. అది కాస్తా సర్వేలతో సరిపోయిందని చెప్పారు.
పైప్ లైన్ పనులు ఏమయ్యాయి?
రూ.60 కోట్లతో కమలాపురంలో తాగునీటి నీటి సమస్య పరిష్కారం కోసం పైప్ లైన్ నిర్మాణ పనుల కోసం శంకుస్థాపన చేసాడు పని ముందుకు కదలలేదు అని లోకేష్ విమర్శించారు. వరద నీరు వెళ్ళడానికి రూ.8 కోట్లతో చేపట్టిన కినీటి కాలువ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. రూ.3 కోట్లతో నగర పంచాయతీ కార్యాలయం నిర్మాణం అన్నాడు. బిల్డింగ్ కట్టాడా? రూ.36 కోట్లతో బిసి గురుకుల పాఠశాల నిర్మాణం అన్నాడు? చేసాడా? రూ.15 కోట్లతో ఆప్కాబ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కడతా అన్నాడు? కట్టాడా?రూ.213 కోట్లతో గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో ఫేజ్ 1 ప్యాకేజి 2 లో మిగిలిన పనులు అన్ని పూర్తి చేసి 35 వేల ఎకరాలకు నీరు ఇస్తా అన్నాడు ఇచ్చాడా? కమలాపురం, చెన్నూరు లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోరారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏర్పాటు చేస్తాం. ఇళ్లు లేని పేదలకు టిడ్కో ఇళ్లు, నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు అందిస్తామని చెప్పారు.
హజ్ హౌస్ ను ప్రారంభిస్తాం
టిడిపి అధికారంలోకి వచ్చాక హజ్ హౌస్ ని ప్రారంభిస్తామని లోకేష్ వెల్లడించారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని పెండింగ్ పనులు పూర్తిచేస్తాం. మామ, అల్లుళ్ళకు కమలాపురం చాలా ఇచ్చింది. కమలాపురానికి మామ, అల్లుడు ఎం ఇచ్చారు? గుండు సున్నా. టిడిపి ని కమలాపురం లో గెలిపించండి. అభివృద్ధిని కమలాపురానికి పరిచయం చేస్తాం. టిడిపి నాయకుల పై దాడులు, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రెచ్చిపోతున్న వైసిపి నాయకుల్ని వదిలిపెట్టను. కమలాపురం లో ఉన్నా కెన్యా కి పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా అని లోకేష్ హెచ్చరించారు.