షెడ్యూల్ జారీ చేసిన ఎన్నికల కమిటీ
6గురు సీనియర్ నాయకులతో ఎన్నికల కమిటీ ఏర్పాటు
సాయంత్రం 4 గంటల తర్వాత ఫలితాల ప్రకటన
…….
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అయింది. మహానాడు సందర్భంగా 27 వ తేదీన పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగనున్నది. ఇందుకు సంబంధించి ఎన్నికల
కమిటీని శుక్రవారం ప్రకటించారు. పార్టీ సీనియర్ నాయకులు పూసపాటి అశోక్ గజపతి రాజు, నక్కా ఆనందబాబు, రావుల చంద్రశేఖర రెడ్డి, కాలువ శ్రీనివాసులు, గుమ్మడి సంధ్యారాణి, ఎన్ ఎం డి ఫరూక్
లను ఎన్నికల కమిటీ సభ్యులుగా నియమించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూల్ ఈ క్రింది విధంగా వుంది.
27 వ తేదీ ఉదయం 10 గంటలకు .. ఎన్నికల అధికార్లచే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రకటన జారీ
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు …. నామినేషన్ ల స్వీకరణ
మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు … నామినేషన్ ల పరిశీలన, ఆమోదిత నామినేషన్ ల ప్రకటన
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు … నామినేషన్ ల ఉపసంహరణ, అధ్యక్షుల జాబితా ప్రకటన
మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు … ఓటింగ్ (ఎన్నికలు)
సాయంత్రం 4 గంటల తర్వాత ఎన్నికల ఫలితాల ప్రకటన